July 7, 2024

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 12

రచన: రామలక్ష్మి కొంపెల్ల ఈ సంచికలో కూడా మనం సినిమా పాటల విభాగంలోని రాగమాలికల గురించి తెలుసుకుందాం. మనందరికీ చిరపరిచితమైన ఘంటసాల గారి పాట గురించి ముందుగా వివరించుకుందాం. ఈ పాట 1961వ సంవత్సరం విడుదలైన ‘బావ మరదళ్ళు’ చిత్రంలోనిది. చిత్రానికి సంబంధించిన వివరాలు: నిర్మాణ సంస్థ : కృష్ణ చిత్ర దర్శక నిర్మాత : శ్రీ పి ఎ పద్మనాభరావుగారు సంగీతం: శ్రీ పెండ్యాల నాగేశ్వరరావుగారు ముఖ్య తారాగణం: కృష్ణకుమారి, జె వి రమణమూర్తి, మాలిని […]

అలనాటి తారలు – రమణారెడ్డి (హాస్యనటుడు)

రచన: సుజాత తిమ్మన సన్నగా, పొడుగ్గా, చూడగానే హాస్యరసం ఉట్టి పడే విధంగా ఉన్న ఆనాటి హాస్య నటుడు రమణారెడ్డి గారి అసలు పేరు తిక్కవరపు వెంకట రమణారెడ్డి. రమణారెడ్డి 1921, అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, జగదేవిపేటలో జన్మించారు. నెల్లూరులో సానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ, శని, ఆది వారాల్లో మద్రాసు వెళ్ళి సినిమాల్లో వేషం కోసం ప్రయత్నం చేసేవారు. 1951 లో A. శంకరరెడ్డి గారు ‘మాయపిల్ల’ సినిమా […]

నా ‘మథుర’ యాత్ర

రచన: రమా శాండిల్య అవి మా అమ్మాయి ఢిల్లీలో ఉన్న రోజులు. ఢిల్లీకి దగ్గరలో అనేక మంచిమంచి దేవాలయాలున్నాయి… తన దగ్గరకు నేను వెళ్ళినప్పుడు అనేక దేవాలయాలు చాలా చూసాను. మమ్మల్ని చూడటానికి వచ్చిన అతిథులతో కొన్ని దేవాలయాలు చూసాను. ఢిల్లీ నుంచి, ఉదయం వెళ్ళి, సాయంత్రానికి వచ్చేసేవాళ్ళం… మరీ సమయం సరిపోదనుకుంటే, మరొకరోజు ఉండి చుట్టుప్రక్కల ఆలయాలు అన్నీ చూసి వచ్చేవాళ్లం. అలా చూసిన ఆలయమే ‘మథుర’. ఢిల్లీ నుంచి నూటయాభై కిలోమీటర్ల దూరంలో దక్షిణంగా […]

శ్రీ సూర్యనారాయణ ఆలయం – అరసవల్లి

రచన: సుధా రాజు ఆరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీకాకుళం పట్టణం దగ్గర ఉన్న అరసవల్లి గ్రామంలో ఉన్నది. ఏడవ శతాబ్దంలో కళింగ రాజు దేవేంద్రవర్మ చేత నిర్మింపబడ్డ ఈ ఆలయం, మన దేశంలో ఉన్న అతి పురాతనమైన సూర్య భగవానుని ఆలయాలలో ఒకటి. అరసవల్లి శ్రీ సూర్య భగవానుడిని పూజించిన వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి అని అందరికి నమ్మకం. అందుకే ఇదివరకు ఈ స్థలాన్ని హర్షవల్లి అనేవారు. కాలక్రమెణా అరసవల్లిగా మారిపొయింది. స్థలపురాణం […]