May 2, 2024

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 9

రచన: శ్రీమతి రామలక్ష్మి కొంపెల్ల మనం ఇంతవరకు సంగీతంలోని వివిధ విభాగాల్లో రాగమాలికల గురించి తెలుసుకున్నాం. ఈ సంచికలో అందరికీ సుపరిచితమైన లలిత సంగీతంలోని రాగమాలికా రచనల గురించి తెలుసుకుందాం. ముందుగా లలిత సంగీతం అంటే ఏమిటి? ఆ సంగీతానికి, శాస్త్రీయ సంగీతానికి ఉన్న తేడా ఏమిటి, ఇత్యాది విషయాలను క్లుప్తంగా చర్చించుకుని, ఆ తర్వాత ఒక రాగమాలికా భక్తి గీతం గురించి తెలుసుకుందాం. చాలా సరళమైన శైలిలో, భావ ప్రధానంగా, మాధుర్య ప్రధానంగా ఉండే సంగీతమే […]

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 8

రచన: కొంపెల్ల రామలక్ష్మి క్రితం సంచికలో మనం అర్ధ శాస్త్రీయ (సెమి-క్లాసికల్) సంగీత రచనలలో ఉన్న ఒక రాగమాలికా రచన గురించి సవివరంగా తెలుసుకోవడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈ సంచికలో మరో రెండు రచనల గురించి తెలుసుకుందాం. 1. అన్నమాచార్య కీర్తన ‘కంటి కంటి నిలువు చక్కని మేని దండలును’ 2. సి. రాజగోపాలాచారి గారి రచన ‘కురై ఒన్రుం ఇల్లై’ ఈ రెండు రచనలు పాడినవారు భారతరత్న శ్రీమతి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు. సంగీతం […]

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 7

రచన:- శ్రీమతి రామలక్ష్మి కొంపెల్ల ఈ సంచికలో మనం సెమీ క్లాసికల్ (తెలుగులో అర్ధ శాస్త్రీయమైన అని చెప్పచ్చు) రచనల్లో రాగమాలికల గురించి చర్చించుకుందాము. ఒక సంకీర్తన లాగా పాడే రచనలు అన్నీ కూడా ఈ విభాగంలో చేర్చుకోవచ్చు. శాస్త్రీయ సంగీతం విషయంలో రాగం, తాళం అన్నీ కూడా చాలా సాధన ద్వారా నేర్చుకుని, వాటిని ప్రదర్శించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, నియమబద్ధంగా ప్రదర్శించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, సెమీ క్లాసికల్ రచనలు, భక్తిరసం తో […]

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 6

రచన: శ్రీమతి రామలక్ష్మి కొంపెల్ల క్రితం సంచికలో మనం గణేశ పంచరత్న స్తోత్రం గురించి వివరంగా తెలుసుకున్నాం కదా… ఈ సంచికలో మరో అద్భుతమైన ఆదిశంకర విరచితం, ‘భజ గోవిందం’ గురించి తెలుసుకుందాం. టేప్ రికార్డర్, క్యాసెట్లు గురించి తెలిసిన వారందరికీ బాగా పరిచయం ఉన్న క్యాసెట్, భారతరత్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి ‘విష్ణు సహస్రనామం’. ఆధునిక పరికరాలు అందుబాటులో లేని కుటుంబాల్లో, పెద్దవాళ్ళు నేటికీ ఇళ్లలో ఉదయాన్నే ముందుగా శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, ఆ తర్వాత […]

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 5

రచన: శ్రీమతి కొంపెల్ల రామలక్ష్మి క్రితం సంచికలలో మనం సంగీతాభ్యాస క్రమంలో వరసగా గీతాలు, స్వరజతులు, వర్ణాలు మరియు కృతులలో రాగమాలికల గురించి తెలుసుకున్నాము. అయితే, కర్ణాటక సంగీతం ఆధారంగా చేసుకుని కొందరు, స్తోత్రాలకు, అష్టకాలకు మరియు భుజంగస్తోత్రం వంటి రచనలకు సంగీతం సమకూర్చి, వాటిని సులువుగా గుర్తుపెట్టుకుని పాడే విధంగా చెయ్యడం జరిగింది. అటువంటి రచనలు కొన్నింటిని రాగమాలికలుగా చేసి మనకు అందించిన మహానుభావులు ఉన్నారు. మనం భగవంతుడిని కీర్తించుకునేందుకు వీలుగా ఎన్నో రచనలు చేసినవారు […]

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 4

రచన: కొంపెల్ల రామలక్ష్మి ఇప్పటి వరకూ మనం రాగమాలికల గీతాల గురించి, వర్ణాల గురించి చర్చించుకున్నాము కదా… ఈ భాగంలో రాగమాలికా కృతుల గురించి మాట్లాడుకుందాము. రాగమాలికాకృతులు రచించిన వాగ్గేయకారుల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన వారు – 1. శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ 2. శ్రీ స్వాతి తిరునాళ్ 3. శ్రీ సీతారామ అయ్యర్ ఒక్కొక్క వాగ్గేయకారుల గురించి, వారి రచనల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా శ్రీ ముత్తు స్వామివారి అతిపెద్ద రచన ‘చతుర్దశ రాగమాలిక’, గురించి […]

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 3

రచన: కొంపెల్ల రామలక్ష్మి సంగీతం నేర్చుకుంటున్న క్రమంలో, గీతాలు, స్వరజతుల తర్వాత, స్వరం, సాహిత్యం చక్కగా పాడడం తెలిసాక నేర్చుకునే తర్వాతి అంశం ‘వర్ణం’. ఒక సంగీత విద్యార్థి వర్ణాల దాకా వచ్చే సమయానికి కొన్ని సంపూర్ణ రాగాలు, కొన్ని జన్య రాగాలు, వాటిలో ఔడవ రాగాలు (5 స్వరాలు ఆరోహణ మరియు అవరోహణలో ఉండే రాగాలు), షాడవ రాగాలు (6 స్వరాలు ఆరోహణ మరియు అవరోహణలో ఉండే రాగాలు), కొన్ని ఘన రాగాలు (నాట, గౌళ, […]

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 2

రచన: కొంపెల్ల రామలక్ష్మి మనం గత సంచికలో తెలుసుకున్న ‘72 మేళ రాగమాలిక’, అభ్యాసగానానికి ఉపకరించే రచన కాదు. ఈ రచనను ఒక గీతంగా చెప్పడం కంటే, ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన అతి పెద్ద రాగమాలికగా చెప్పుకోవాలి. కొందరు విద్వాంసులు ఈ రచనను కృతిగా సంబోధించడం కూడా జరిగింది. అయితే, అభ్యాసగాన స్థాయిలోనే మరొక ముఖ్యమైన 72 మేళ రాగమాలికాగీతం మీకు పరిచయం చేసి, తర్వాతి అంశం అయిన ‘జతి స్వరం మరియు స్వరజతులు’ గురించి […]

రాగమాలికలు – 1

రచన: రామలక్ష్మి కొంపెల్ల – కర్నాటక సంగీతంలో ఉన్న రాగాలు ఎంతో మధురంగా ఉంటాయి. సరిగమపదని ఏడు స్వరాలే అయినా వాటిల్లోంచి మన సంగీత కర్తలు ఎన్నో మధురమైన రాగాలు కనిపెట్టి, వాటిల్లో ఎన్నో భక్తి గీతాలను, కీర్తనలను సమకూర్చారు. రాగమాలిక అంటే? రాగాలతో అల్లిన ఒక దండ. రెండు లేక అంతకన్నా ఎక్కువ రాగాలు ఉపయోగించి చేసే రచనను రాగమాలిక అంటారు. ఒకే రకం పువ్వులతో కట్టే మాల కంటే, రకరకాల పువ్వులతో కట్టే కదంబమాల […]