May 18, 2024

జీవితమంటే..

రచన: విజయలక్ష్మీ పండిట్ ఉదయం ఐదు గంటలకే లేచి మిద్దె పైన వాకింగ్ చేస్తున్నాను. రోజు తూర్పున ఇంటిముందు మెల్లమెల్లగా తన ప్రత్యూష కిరణాలు సంధించి చీకట్లను పరుగులు పెట్టిస్తూ ఎఱ్ఱని బంతిలా ఆకాశం పొత్తిళ్ళలో వెలిగిపోయే ఉదయించే బాలభానుడి అందాలను తిలకిస్తూ నడవడం నా కెంతో ఇష్టం. ఇంటి చుట్టూ ఎత్తుగా పెరిగిన చెట్ల కొమ్మలనుండి వీచే చల్లని గాలి ఒకవైపు శరీరాన్ని మృదువుగా తాకుతూంటే, ఆదిత్యుని లేత కిరణాల స్పర్శతో శరీరానికి మనసుకు చెప్పలేని […]

తేనె మనసులు

రచన: పరేష్ బాబు ఎన్నో వ్యాపారాలు చేసి నష్టపోయి ఆఖరి ప్రయత్నంగా శంకర్ విలాస్ భోజన హోటల్ ప్రారంభించాడు శంకరరావు. హోటల్ కు వచ్చే కస్టమర్ల కోసం ఆయన భార్య అన్నపూర్ణమ్మ వంటలు చేసేది. సరిగ్గా హోటల్ ప్రారంభం రోజే ఎక్కడినుంచి వచ్చాడో ఒక యువకుడు వచ్చి శంకర్రావును కలిసాడు ‘సార్. నా పేరు సుందరం. నాకు మీ హోటల్లో సర్వర్ ఉద్యోగం ఇవ్వండి సార్. నమ్మకంగా పనిచేసుకుంటా’. అడిగాడు ‘చూడు బాబూ. నేను నా భార్య […]

బందీలైన బాంధవ్యాలు

రచన: డా. కె. మీరాబాయి కూరగాయలు, ఇంటికి కావలసిన సరుకులు కొనుక్కుని ఇంటి దారి పట్టిన రమణకు పిచ్చికోపం వచ్చింది. రెండు చేతుల్లో నిండుగా ఉన్న సంచీలు మోస్తూ నడవడం వలన ఆయాసం వస్తోంది. వూపిరి ఆడకుండా చేస్తూ ముక్కును నోటిని కప్పిన మాస్క్ ఒకటి. చెమటకో ఏమో ముక్కు మీద దురద పెడుతోంది. మాస్క్ పీకి పారేసి గోక్కొవాలని వుంది. కానీ భయం. చుట్టూ జనం వున్నారు. ఎక్కడినుండి వచ్చి మీద పడుతుందో కరోనా భూతం […]

ఋణం

రచన: దొడ్డపనేని అఖిలాండేశ్వరి “గుల్లూ ఏం డిసైడ్ చేసావ్? తోడు నీడవై జీవితాంతం నాతో కలిసి నడుస్తావనే ఆశ నెరవేరుతుందను కొంటున్నా, మరి నీతీర్పు ఏవిటో!” ఉత్సుకత నిండిన స్వరంతో ప్రశ్నించాడు కృష్ణవంశీ. కృష్ణవంశీ మోకాలుమీద తన గడ్డం ఆన్చుకుని కూర్చుని అతని మొహంలోకి తదేకంగా చూస్తున్న గుల్షాద్ కళ్ళల్లో నీళ్ళు చిప్పిలి ముత్యాల సరాలయ్యాయి చెంపలమీద. తన చేత్తో బుగ్గల మీది కన్నీటిని తుడుస్తూ ” ఛ!ఛ! కన్నీళ్ళెందుకు నీకు యిష్టమైతే అవునను లేదంటే లేదు, […]

కానుక

రచన: ప్రభావతి పూసపాటి “లంచ్ అయ్యిందా?” అంటూ చొరవగా తలుపు తీసుకొని రాఘవరావు గారి రూమ్ లోకి ప్రవేశించారు ప్రకాష్ రావు. రాఘవరావుగారు కుర్చీలో వెనక్కివాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నారు. ప్రకాశరావు ,  రాఘవరావు ఇద్దరు చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు . ఒకే గవర్నమెంట్ ఆఫీస్ లో చాలా కాలంగా కలిసి పని చేస్తున్నారు. రాఘవరావు గారు చాలా కష్టపడి , నిజాయతి తో పని చేసి ప్రమోషన్స్ తో త్వర త్వరగా పైకి  వచ్చి పెద్ద […]

కంభంపాటి కథలు – ప్రయాణం

రచన: కంభంపాటి రవీంద్ర భ్రమరకి ఒకటే భయంగా ఉంది .. ఊరంతా కరోనా అట .. ఊరంతా ఏమిటీ ..రాష్టం , దేశం ప్రపంచం .. అంతా కరోనా ! తనుండే కాకినాడలో అయితే జనాలు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు … బయటకి వెళ్ళాలన్నా .. ఇంట్లోకి ఎవరినన్నా రానివ్వాలన్నా చాలా భయంగా ఉంది ! పని పిల్లని, పేపర్ వాడిని మానిపించేసింది.. అపార్ట్మెంట్ లో ఇరుగు, పొరుగు ఎవరి తలుపులు వారు మూసుక్కూచున్నారు.. మనిషన్న వాడి మొహాన […]

భవ( బాల) సాగరాలు

రచన: గిరిజారాణి కలవల ” సుధీర్! బబ్లూ ఇంకా ఇంటికి రాలేదు! స్కూల్ వదిలి చాలా సేపయింది. వచ్చి ఫ్రెష్ అయి ఐఐటి కోచింగ్ క్లాస్ కి వెళ్ళాలి. టైమయిపోతోంది” అంటూ నీలిమ కంగారుగా భర్త కి ఫోన్ చేసింది. ఆఫీసులో తలమునకలయే పనిలో కూరుకునిపోయి ఉన్న సుధీర్ కి, నీలిమ దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో చిర్రెత్తిపోయాడు. అసలే , తను చేసిన ఫైల్ లో తప్పులు తడకలు ఉన్నాయని, సాయంత్రం ఎంత […]

నవ్యే పువ్వు నువ్వే

రచన:  వావిలికొలను రాజ్యలక్ష్మి.   ఉదయం టైమ్ ఆరు కావస్తుంది. వేడివేడిగా కాఫీ కల్పుకున్న కప్పు చేతపట్టుకొని బాల్కనీలోకొచ్చి తాపీగా కుర్చీలో కూర్చొని, సన్నగా పడుతున్న వర్షపు జల్లులను తదేకంగా చూస్తూ కాఫీని ఆస్వాదిస్తూ తాగుతోంది రేణుక. ఈ కరోనా మాయదారి రోగం దేశదేశాల్లో ప్రబలి పోయి, మన దేశానికి కూడా త్వరితగతిన వ్యాపించేసరికి లాక్ డవున్ మొదలై, ఐటి వుద్యోగస్తులంతా యింటి నుంచే పనిచేస్తూ, ప్రవేట్ సంస్థలో పనిచేసేవారు వుద్యోగాలులేక కూరగాయలమ్ముకుంటూ కొందరూ, మట్టి పనికెళ్ళుతూ […]

సానుభూతి పరాయణి

రచన: వాసా శ్రీనివాసరావు   ఆఫీసులో టెస్టర్ గా కొత్తగా జాయిన్ అయ్యింది, కేరళ అమ్మాయి రజియా. చాలా చలాకీ అమ్మాయి. పెళ్ళయ్యింది. మూడేళ్ళ బాబు, తరవాత ఇప్పుడు మళ్ళీ కన్సీవ్ అయిందట. శ్రీకాంత్ ఆఫీస్ లో చాలా సీనియర్. ఎవరు కొత్తగా జాయిన్ అయినా ట్రైనింగ్ ఇచ్చేది అతనే. ట్రైనింగ్ అంటే రూములో కూర్చోబెట్టి క్లాసు చెప్పడు, కానీ వర్క్ అసైన్ చేసి, దగ్గరుండి చేయిస్తాడు. పని చేస్తూ నేర్చుకోవాలి అంటాడు. మూడు నెలలు పూర్తయ్యింది, […]

మా కోడలు బంగారం

రచన: గోటేటి కాశీ విశ్వేశ్వరరావు   “ఏమిటీ ! డాక్టర్ గారూ మీరు చెబుతున్నది వింటే ఆశ్చర్యంగా ఉందే ” అంటూ గెడ్డం మీద చెయ్యేసుకుంది తాయారు. ” ఈ మూర్చ రోగిని (కోడలు శ్రీలేఖ ను) చూపిస్తూ మాకు అంటగట్టి వాళ్ళ చేతులు దులుపుకొన్నారు అంటూ వియ్యాల వారిని దుయ్యబడుతుంటే “ఉష్ ! ఇది ICU ఇక్కడ గట్టిగా మాట్లాడకండి రోగి ఉంది నిశ్శబ్దం పాటించాలి” “నాకు ఇప్పటికీ నిజంగా నమ్మబుద్ధి కావడం లేదు” “ఈ […]