May 17, 2024

5. ‘ప్ర’మా’దాక్షరి’

రచన : ఇందిరారావు షబ్నవీస్ “ఒరే సురేష్, నీకు ఈ అమ్మాయి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం నాకుందిరా” అంది తల్లి. అదేదో సినిమాలోలాగ “అంత గట్టిగా ఎలా చెప్పగలవు?” అన్నాడు నాటకీయంగా సురేష్. “నీ మొహం, అంత చదువుకున్నది కాకపోయినా చూడ్డానికి బాగుంది. తెలిసిన వాళ్ళు. అయిన సంబంధం. చేసుకోరా” అంది మళ్ళీ. “సరే, నువ్వంతగా చెప్తుంటే కానీ” అన్నాడు సురేష్. నిజంగానే అమ్మాయి చాలా బాగుంది…కాదనడానికి కారణం ఏమి తోచలేదు. పేరే కొంచెం వింతగా అనిపించింది. […]

6. వాస్తు

రచన: భారతి రామచంద్రుని. “తాతయ్య పట్నం వెళ్తున్నారు. బయలుదేరేటప్పుడు వాకిట్లో ఉండకండి. పెరటి వైపు వెళ్ళండి. తుమ్ముతారేమో జాగ్రత్త.” “తుమ్మితే ఏమవుతుంది బామ్మా!” చిన్నది అమాయకంగా అడిగింది. “తుంపర్లు పడతాయని!” కొంటెగా అన్నాడు పదేళ్ళచింటూ. రమణి కిసుక్కున నవ్వింది. “ఓరి భడవా!” కసిరింది సీతమ్మగారు. “ఎక్కడికైనా వెళ్ళేప్పుడు తుమ్మితే వెళ్ళిన పని కాదు” వివరించింది చిన్నపిల్లకు. బామ్మ మాటలకు పిల్లలు ముగ్గురూ గప్ చుప్ గా వెనక్కెళ్ళి ప్రహరీ గోడమీంచి తమాషా చూడడానికి అరుగెక్కి నిల్చున్నారు. తాతగారు […]