May 19, 2024

రెండో జీవితం 2

రచన: అంగులూరి అంజనీదేవి గబగబ లోపలకెళ్లింది. ”మమ్మీ! మమ్మీ !” అంటూ పిలిచింది. మిక్సీలో మసాలపొడి వేస్తూ, ఆ సౌండ్‌లో శృతిక పిలుపు విన్పించక వెంటనే పలకలేదు సుభద్ర. ”అబ్బా! మమ్మీ! ఓ నిముషం ఈ మిక్సీని ఆపు. ఎప్పుడు చూసినా దీని సౌండ్‌తో చచ్చిపోతున్నా…” అంది శృతిక. శృతిక మూమెంట్స్ చూడగానే అర్థమై మిక్సీ ఆపింది సుభద్ర. ఇవాళ హాలిడే కూడా కాదు. శృతిక హాస్టల్‌నుండి ఎందుకొచ్చినట్లు? ఎప్పుడు చూసినా ఇంటికొస్తుంది. హాస్టల్‌ ఫీజు దండగ […]

రెండో జీవితం

రచన : అంగులూరి అంజనీదేవి జీవితం చిన్నదే అయినా మనుషుల్లో ఆశలు, ఆకాంక్షలు వుంటాయి. తాము చేరుకోవలసిన గమ్యాలు, పెట్టుకున్న లక్ష్యాలు వుంటాయి. శాంతికి, అశాంతికి మధ్యన అవ్యక్తపు ఆలోచనలు, ఊహకందని అలజడులు వుంటాయి. వీటికోసం ఎంతో గోప్యంగా తమ హృదయాన్ని రహస్యపు మందిరంగా చేసుకొంటారు. మనసును దారంతో బిగించి కట్టిన పొట్లంలా మార్చుకుంటారు. తాము గీసుకున్న బొమ్మలో తామే తిరుగుతున్నట్లు తమలోకి తాము చూసుకుంటారు. ఎక్కడ ఆగుతామో అక్కడ మన ఆనందం ఆగుతుందని గ్రహిస్తారు. తిరిగి […]