April 27, 2024

రెండో జీవితం 11

రచన : అంగులూరి అంజనీదేవి శృతికను చూశాక సంవేదకి ఒక్కక్షణం ఏమి అర్థంకాలేదు. బయట మనం కొనుక్కునే బొమ్మల్లో కూడా కొంచెం ఫీలింగ్స్‌ కన్పిస్తాయి. ఈమెలో ఒక్క ఫీలింగ్‌ కూడా కన్పించలేదు బొమ్మను మించిన బొమ్మలా వుంది. ఇదేంటి ఇలా? ద్రోణ గారు బొమ్మలు వేసి, వేసి భార్యను కూడా ఓ బొమ్మను చేశారా? లేక ఆమె మనస్తత్వమే అంతనా? అయినా ఆవిడ గురించి నాకెందుకులే…ఆయన భార్యను చూడాలన్న కోరికైతే తీరింది. అది చాలు. అనుకుంటూ శృతిక […]

రెండో జీవితం 10

”బాధపడకు ముక్తా! కిందపడ్డప్పుడే పైకి లేచే అవకాశాలు వుంటాయి కదా! దాంతో వేగంగా కెరియర్‌లో ఇంప్రూవ్‌ అవ్వచ్చు. అందరి గౌరవం పొందొచ్చు. కీడులో మేలన్నట్లు ఇదికూడా ఓ ఇన్‌స్పిరేషన్‌ అనుకోండి” అంది సంవేద. వెంటనే సంవేద చేతిని మెల్లగా తాకి ”అది ఒక్కరోజులో రాత్రికి రాత్రే సాధ్యమయ్యేది కాదు వేదా! మణిచందన్‌ తన జీవితాన్ని తనకోసమే జీవించాలనే వ్యక్తి… తన జీవితాన్ని తనే శాసించాలి. తన సక్సెస్‌, తన పెయిల్యూర్‌ తన సంతోషం, తన కన్నీరు తనకే […]

రెండో జీవితం 9

రచన: అంగులూరి అంజనీదేవి కోపం మనిషిని పశువును చేస్తుందని విమలమ్మకి తెలియంది కాదు… ”ఆయన బాధంతా ఆయన కొడుకు గురించే అన్నయ్యా! మనం అర్థం చేసుకోవాలి కాని, ఇలా పంతాలకి పోతే కాపురాలు నిలవ్వు… అయినా ఎంత మంది భర్తలు ఉద్యోగరీత్యా బయట ఊళ్లలో గడిపిరావటం లేదు. అంతమాత్రాన వాళ్ల భార్యలు విద్వంసాన్ని సృష్టించుకుంటున్నారా? ఆర్టిస్ట్‌ అన్న తర్వాత అభిమానులు, యాడ్‌ ఏజన్సీలు, సన్మానాలు చేసేవాళ్లు, ఎగ్జిబిషన్లవాళ్లు ఇలా ఎందరెందరో ఫోన్లు చేస్తుంటారు. అందులో ఆడవాళ్లు కూడా […]

రెండో జీవితం 8

రచన: అంగులూరి అంజనీదేవి ఏది ఏమైనా తన బొమ్మల్ని అభిమానిస్తుంది కాబట్టి తన అభిమానురాలే… అభిమానం ఓవరం! కానీ అభిమానులతో మాట్లాడేంత ఉల్లాసంగా తను లేడు. అనుకుంటూ వెంటనే ఆ మొబైల్‌ని పక్కన పెట్టాడు. కానీ ఆ మెసేజ్‌లు మాత్రం అతని గతం తాలుకు భావరేఖల్ని కదిలించి ‘మా సంగతేంటి? నీ బొమ్మల్లో మమ్మల్నెప్పుడు ఒలికిస్తావు.’ అన్నట్లు తొందర చేస్తున్నాయి. పైకి కన్పించేది ఒకటి… అంతర్లీనంగా దోబూచులాడేది ఒకటి… అంతర్లీనంగా వున్నదాన్ని అవసరాన్ని బట్టి అణగదొక్కాలని చాలా […]

రెండో జీవితం – 7

రచన: అంగులూరి అంజనీదేవి ”నేను ఆర్‌.టి.సి. బస్‌లో పనిచేస్తున్న రోజుల్లో నా భార్య డబ్బు మీద ఆశతో నన్ను బాగా సంపాయించమనేది. జీతాన్ని మించిన సంపాదన నాకెలా వస్తుంది? రోజుకోరకంగా, ఏదో ఒకటి లేదంటూ తనలోని వెలితిని బయటపెట్టి బాధపడేది. నన్ను బాధపెట్టేది. రాను రాను ఇంటికి రావాలంటేనే భయపడేవాడిని… అప్పటికే శ్యాం పుట్టాడు. శ్యాం కోసమైనా నేను నా భార్య మాట వినాలి. లేకుంటే నన్ను ఇంటికి రానివ్వదు. బస్‌లో టికెట్స్ ఇవ్వకుండానే ప్రయాణీకుల దగ్గర […]

రెండో జీవితం 7

రచన: అంగులూరి అంజనీదేవి ఒకసారి ఆమె ముఖంలోకి జాలిగా చూసి, ‘సమస్యల్ని సృశించే నేర్పుకూడా ఓ కళేకదా!’ అని మనసులో అనుకొని, ఏమనాలో తెలియక ‘ఆల్‌ ద బెస్ట్‌’ అన్నాడు. అంతలో… పేర్స్‌ెం నుండి కాల్‌ రావటంతో ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అని ఆముక్తతో చెప్పి పక్కకెళ్లి మ్లాడి వచ్చాడు. ఆమె చాలా సేపు ద్రోణ దగ్గరే కూర్చుంది. * * * * * అర్ధరాత్రి దాక – అందరు నిద్రపోతున్న సమయంలో గంగాధరం మళ్లీ అరుస్తూ లేచాడు. […]

రెండో జీవితం – 6

రచన: అంగులూరి అంజనీదేవి ఆముక్త కారుదిగి లోపలకి వస్తుంటే చూసి మండేనిప్పుల కణికలా అయింది శృతిక. రెండడుగులు ఎదురెళ్లి ఉరిమి చూస్తూ…. ”ఆయన ఇంట్లో లేరు” అంది అక్కడే ఆగు అన్నట్లు. అర్థంకాక బిత్తరపోయింది ఆముక్త. అభిమానంతో అడుగు వెనక్కి తీసుకొని, వెనుదిరిగి కారెక్కి వెళ్లిపోతూ ద్రోణకి కాల్‌ చేసింది. అతని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో వుంది. ఆ రోజు ఫోన్లో కృతికతో శృతిక మాట్లాడటం విని, వెళ్లిపోయిన ద్రోణ ఇంతవరకు ఇంటికి రాలేదు శృతిక ఆ […]

రెండో జీవితం .. 5

రచన: అంగులూరి అంజనీదేవి ఆకులు కదిలినట్లనిపించి ఇటు తిరిగాడు ద్రోణ. వెన్నెల నీడ కొబ్బరాకుల సందుల్లోంచి శృతిక మీదపడి కదులుతుంటే ఆమె వేసుకున్న లైట్ బ్లూ కలర్‌ నైటీ మీద నల్లపూసల దండ మెరుస్తోంది. ఒక్కక్షణం అతని కళ్లు అలాగే నిలిచిపోయాయి. ”ఒక్క నిముషం శృతీ! వస్తున్నా”… అంటూ కాల్‌ కట్ చేసి భార్య వైపు రెండడుగులు వేశాడు. ”వస్తారులెండి! ఏదో ఒక టైంకు… ఇక్కడేం జరుగుతుందో చూద్దామని వచ్చాను” అంది శృతిక. ఏం జరుగుతోందని చుట్టూ […]

రెండో జీవితం 4

రచన: అంగులూరి అంజనీదేవి ఆమె దృష్టిలో ప్రేమ కామం కాదు. ఇంకేదో…! మరి పురుషునిలో తండ్రి అంశ వుండదు. ప్రేమ అంటే కామమే… ఎవరైనా మనిషి చనిపోతే ఏడుస్తారు. కానీ తాగుబోతుల భార్యలు నిత్యం ఏడుస్తూనే వుంటారు. వంటగదిలో వున్న శకుంతల – భర్త పిల్లల్ని తిట్లే తిట్లు వినలేక, దేవుడు ఈ చెవులను ఎందుకు ఇచ్చాడా అని బాధపడ్తోంది. తిట్లు ఆగిపోయాయి. కుక్కర్‌ విజిల్‌ రెండు సార్లు రాగానే ఆపేసింది. ”మమ్మీ! మమ్మీ!” అంటూ ఆపదలో […]

రెండో జీవితం 3

రచన: అంగులూరి అంజనీదేవి ఆముక్తను చూడగానే చిరునవ్వుతో విష్‌ చేసి.. కూర్చోమన్నట్లు కుర్చీ చూపించాడు ద్రోణ. కూర్చుంది ఆముక్త. ద్రోణ వేసిన బొమ్మల్ని చూసి మెచ్చుకుంది ఆముక్త. మన బిడ్డల్ని ఎవరైనా ఇష్టపడ్డప్పుడు మన ఆనందం ఆకాశాన్ని ఎలా తాకుతుందో అదేస్థాయి ఆనందంలో వున్నాడు ద్రోణ. ద్రోణ చాలా చిన్న వయసునుండే చిత్రాలు గీస్తున్నాడు. ప్రతి చిత్ర ప్రదర్శనలో తన చిత్రాలను ఎంట్రీ చేస్తుంటాడు. అతని చిత్రాలు మిగిలిన వాళ్లకన్నా విభిన్నంగా వుంటూ కళాప్రియులకు గొప్ప అనుభూతిని […]