May 19, 2024

లోపలి ఖాళీ – భరిణె

రచన: రామా చంద్రమౌళి   ఫిబ్రవరి 17, 2016 : బుధవారం. ప్రాతః సమయం 4.50 నిముషాలు. ఒక సందర్భాన్నీ, ఒక వస్తువునూ ఒక వ్యక్తి తన నేపథ్యంతో, తన దృష్టికోణంలో, తనకున్న జ్ఞానస్థాయిని బట్టి చూచినప్పుడు ఆ వస్తువు అతనికి కనబడినట్టే ఇంకొక వేరే ఎవరికైనా ఆ వస్తువు సరిగ్గా అదేవిధంగా కనబడుతుందా. ఉహూ.. అస్సలే కనబడదు. చూపూ, దృష్టీ.. రెండూ ఒకటేనా. చూచుట, దర్శించుట.. రెండూ ఒకటేనా. ఒక వస్తువు మనకు ఎలా కనబడ్తే […]

లోపలి ఖాళీ – 1

రచన: రామా చంద్రమౌళి ‘‘ఒకసారి మళ్ళీ చెప్పండి ’’ అన్నాడు డాక్టర్‌ కుమార్‌ చాలా ఆశ్చర్యంగా. . విభ్రమంతో. . చిత్రంగా ఎదుట కూర్చుని ఉన్న ఆ పెద్దమనిషి ముఖంలోకి చూస్తూ. ఆ పెద్దాయన ఏమీ చెప్పలేదు. సూటిగా డాక్టర్‌ కళ్ళలోకి ఓ లిప్తకాలం చూచి ఏదో చెప్పడానికి ఉద్యుక్తుడౌతూండగా. , ‘‘ఐతే మీరు మనుషులను ప్రేమించే శక్తిని కోల్పోతున్నారు. . యామై కరక్ట్‌. ? ’’ అన్నాడు డాక్టర్‌ కుమార్‌. . ప్రసిద్ధ సైకియాట్రిస్ట్‌. గత […]