May 17, 2024

అర్చన 2020 – మనమూ దోషులమే

రచన: జి.వి.శ్రీనివాస్ “యువరానర్ జరిగిన సంఘటన దారుణం, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా , మానవత్వం మంట గలిసి దానవ రాజ్యానికి అంకురార్పణ జరిగిన వేళ అది. మనిషి పశువైన దురదృష్టకర ఘటన అది “ వకీలు గారి గొంతు కంచు గంటల మ్రోగుతుంది. కిక్కిరిసిన న్యాయస్థానం చెవిరిక్కిరించి వింటుంది న్యాయవాది వాదనను. బోనులో పాతిక సంవత్సరాల ఇద్దరు కుర్రాలు కొద్దిగా మాసిన గడ్డంతో చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు. వారిద్దరి వెనుక పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడొకడు […]

అర్చన 2020 – మనస్సాక్షి

రచన: శ్రీనివాసరావు శింగరాజు ఏమి చెయ్యాలో ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు కమీషనర్ ఇంద్రనీల్. మొన్న ఆదిలాబాద్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతిచెందిన హంతకుడు గోవిందా కేసులో నిజానిజాలు నిగ్గుతేల్చమని కేంద్రప్రభుత్వం తనను నాయకుడుగా పెట్టి ముగ్గురున్న కమిటీని వేసింది. ఇద్దరు ముక్కుపచ్చలారని, పది సంవత్సరాలైనా నిండని పసికందులను మానభంగం చేసి, గొంతు నులిమి కర్కశంగా చంపి నూతిలో పడవేశాడు. ఆ కేసును పరిశోధించి ఎంతో శ్రమకోర్చి, రాజకీయ ప్రలోభాలకు లొంగక అసలు నేరస్థుడిని బోనులోకి […]

అర్చన 2020 – మరో ప్రపంచం…

రచన: డా.సమ్మెట విజయ ఎప్పుడెప్పుడు ఊర్లోకి అడుగు పెడతానా అని ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చింది. 25 సంవత్సరాల తర్వాత అడుగు పెడుతున్నా..ఉద్యోగం పేరుతో అమెరికా వెళ్లిన నేను ఎప్పటి కపుడు రావాలనే అనుకున్నా..తీరా వచ్చాక తిరిగి వెళ్లలేకపోతే …ఎలా..ఇదే ఆలోచన.దానికి తగినట్లుగ డాక్టరుగా నా జీవితం తీరిక లేకుండా ఉంటూ ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వచ్చేది. తీరా ఇక్కడికి రాగానే గుర్తుపట్టలేనన్ని మార్పులు. కాబ్ లో వెళ్ళాలో మెట్రో లోనో ..మనవడి […]

అర్చన 2020 – మాతృత్వము

రచన: కౌండిన్య తిలక్ ఫోన్ రావడముతో ఢిల్లీ నుండి హైదరాబాద్ కు ఆఘమేఘాల మీద ప్రయాణమయ్యాడు అరుణ్. ప్రయాణము తాలూకు అలసట బాధిస్తున్నా, విన్న సమాచారము ఒక వైపు ఆనందాన్ని, మరొక వైపు అనిశ్చితిని కలిగిస్తుండడముతో మానసికంగా డిస్టర్బ్ అయి ఉన్నాడు. హైదరాబాద్ లోని అతి పెద్ద కార్పొరేట్ మెటర్నిటీ హాస్పిటల్ చేరుకున్నాడు. “పదినిమిషాలలో విజిటింగ్ అవర్స్ ప్రారంభమవుతాయి. అంత వరకు కూర్చోండి” అన్న రిసెప్షన్ వారి మాటలు మన్నిస్తూ, అక్కడే లాంజ్ లో, ఖాళీగా ఉన్న […]

మారీ మారని మహిళ

రచన: డా. చాగంటి కృష్ణకుమారి అది బాగాప్రసిద్ధి చెందిన ప్రయివేటు మహిళాకళాశాల. అధ్యాపకురాండ్రు అందరూ విద్యాధికులు. నలభైలు, ఏభైలు పై బడిన వయసులో వున్నవారు. కొద్దిమంది ముప్పైలలోవున్నారు. విద్యార్ధినులు ప్రతీ ఏటా ఇటు చదువులలోనేకాక అటు ఆటపాటలలోనూ విశ్వవిద్యాలయస్థాయి పోటీలలో బహుమతులు పొందుతూ కళాశాలపేరు నిలబెడుతూ వుంటారు. అందుకుతగ్గ తోడ్పాటూ, శిక్షణలనిస్తూ అధ్యాపకురాండ్రు తమవంతు కృషి చేయడానికి వెనుకాడరు. ఆడపిల్లలు రంగు రంగులదుస్తులతో, రోజుకొక రంగుచీరకట్టుకొనివచ్చే అధ్యాపకురాండ్రతో కళాశాల కళకళలాడుతూ కన్నులపండుగగా శోభిళ్లుతూ వుంటుంది. అది శ్రావణ […]

అర్చన 2020 – రాయుడే గెలిచాడు

రచన: భవ్య చారు లత, నరేష్ పక్క పక్క ఇళ్ల వాళ్ళు వారికి చాలా చనువు ఉంది. కానీ లత వాళ్ళది అగ్రకులం నరేష్ ది తక్కువ కులo. అయినా చిన్నప్పటి నుండి ఇద్దరూ కలిసి,మెలిసి కలిసి ఆడుకున్నారు, కలిసి బడికి వెళ్లారు కానీ పెద్దయ్యే కొద్దీ వారి మధ్య దూరం పెరగసాగింది. వారిద్దరూ పదవ తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఒకే దగ్గర కాకుండా వేరే వేరే ఊళ్ళలో ఇంటర్ జాయిన్ అయ్యారు. లత […]

అర్చన 2020 – విజయమా! వర్ధిల్లు !

రచన: అనూరాధ యలమర్తి రోడ్డంతా మహా రద్దీగా ఉంది. వచ్చేపోయే వాహనాలు రొద ఒకవైపు. అల్లరి మూకల హడావిడి మరొకవైపు. ‘నూతన’ కి చాలా ఇబ్బందిగా ఉంది . మొరిగే కుక్కలు కరవవు అని వదిలేద్దాం అనుకుంటుంది. కానీ దాన్ని అసహాయతగా తీసుకుని మరీ రెచ్చిపోతారు ఈ గ్యాంగ్. వీళ్లకు సరైన గుణపాఠం చెప్పాలి అనుకుంది. అనుకున్నదే తడవుగా దాన్ని ఆచరణలో పెట్టింది . 24 గంటలు గిర్రున తిరిగి పోయాయి. మళ్ళీ అదే బస్స్టాప్. అదే […]

అర్చన 2020 – విదిశ

రచన: రోహిణి వంజారి నన్ను నేను తిట్టుకోవడం అప్పటికి వందోసారి. అమ్మ తోడుగా వస్తాను అంటే ” ఎందుకమ్మా. . . ఇంటర్వ్యూ ఎంతసేపు చేస్తారని, లంచ్ లోపలే అయిపోతుంది నేను వచ్చేస్తాలే. . . నువ్వు విశ్రాంతి తీసుకో అనడం నాది బుద్ది తక్కువ అయింది. నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ పూర్తి అయ్యేసరికి రాత్రి ఎనిమిదిన్నర అయినది. చివరికి ముగ్గురం మిగిలాం. నాతోపాటు వచ్చిన వినూత్నని వాళ్ళ అన్న వచ్చి తీసుకువెళ్లాడు. ఇంకో అబ్బాయి వెళ్ళిపోయాడు. […]

అర్చన 2020 – వైజయంతి

రచన: శ్రీధర శర్మ “నేను వద్దన్నా వినకుండా ప్రేమ, ప్రేమ అని ఈ దరిద్రాన్ని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు చూడు ఇది ఆడపిల్లని కనింది. ఇంకొక్క కాన్పులో కూడ ఇది ఆడపిల్లని కనిందంటే మన వంశం నీతోనే ముగిసిపోతుంది. మూడో కాన్పు చుద్దామంటే నాయనమ్మను అయిన నాకు ప్రాణగండం అని జ్యోతిష్యుడు చెప్పాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మగపిల్లాడిని కనే జాతకం వున్న దాన్ని చూసి నీకు మళ్ళి పెళ్లి చేస్తాను. దీనికి విడాకులు ఇచ్చేసి ఇప్పటికైనా […]

అర్చన 2020 – శిక్ష

రచన: యమున చింతపల్లి “అఖీ, ఐ లవ్ యు “ శ్రీరామ్ చేతులు అఖిలను చుట్టేశాయి. ఆ మాటలకు ఎప్పటిలాగానే అఖిల మనసు అనురాగంతో పులకించాలి. కానీ కంటిలోని నీరు మండుతున్న ఆమె చెంపలను, తలకింద దిండుని కూడా తడుపుతోంది. “నువ్వు లేకుండా నేను బ్రతకలేను. చచ్చిపోతాను “ మరింత దగ్గరగా జరుగుతూ అన్నాడు. గొంతు దిగిన మందు, తలకెక్కిన కిక్కుతో కాదు ఆ మాట అన్నది మనసులోని ప్రేమతో నిజాయితీగానే అన్నాడు. దశాబ్దం క్రితం అతను […]