May 19, 2024

స్థనఖండే తార తరిణి

రచన: నాగలక్ష్మి కర్రాnagalakshmi

మన పొరుగు రాష్ట్రమైన ఒడిస్సాలో ఉన్న ఆదిశక్తి పీఠం యిది .  స్థన ఖండే “తారా తరిణి “.. “తార “యని మరియు “తరిణి” యని యిద్దరు దేవతులుగా వుద్భవించేరు. ఆది శంకరాచార్యులు అష్థాదశ పీఠాలకి  ముందు ఆదిశక్తి పీఠాలని నాలుగుగా గుర్తించారు.

అవి

1)    ముఖ ఖండే దక్షిణ కాళిక యిది కలకత్తాకి షుమారు 25కిమీ దూరంలో వున్న “దక్షిణేశ్వర్ “లో రామకృష్ణపరమహంస చే పూజలందుకొని “దక్షిణ కాళిక “గా పిలువ బుడుతోంది.

2)    స్థన ఖండే “తారా తరిణి “.

3)   యోని ఖండే “ఖమాక్య ఈ క్షేత్రం అస్సాం రాష్ట్ర రాజధాని “గోహతి” కి 25,30 కిమీ దూరం లో ఉంది.

4)  పాదఖండే “బిమోళ దేవి “(విమలా దేవి) .జగన్నాధ  పూరి కోవెలలో ఎడం వైపున “విమలా దేవి “మందిరం ఉంది పూరి వెళ్ళిన వాళ్ళు ఈ దేవిని దర్శించుకునే ఉంటారు.

సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి  చక్రంతో ఖండించినప్పుడు ఏర్పడ్డాయి ఈ నాలుగు పీఠాలు . వీటి తరవాత అష్టాదశ  పీఠాలు , తరువాత 51 పీఠాలు , తరవాత 108 పీఠాలు అని చెప్పబడ్డాయి.

ఇప్పుడు మనం ఆదిశక్తి పీఠాలలో వొకటైన “తార తరిణి ” గురించి తెలుసుకుందాం.

మేము పుట్టి పెరిగింది ఒరిస్సా అయినా మాకు ఆది శక్తి పీఠాలు తెలియని కారణంగా వెళ్ళలేకపోయేము.

బరంపూర్  కి సుమారు 33 కిమి దూరం. బరహంపూర్ ,బ్రొహ్మోపురో అని పిలవబడే ఈ వూరు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వెళ్ళే రైల్ మార్గంలో ఒరిస్సా రాష్ట్రం లో వుంది .బరహంపూర్ నుంచి రాను పోను టాక్సీలు దొరకుతాయి.

 unknown2

తారా తరిణి కోవెల ద్వారం

ఈ తారా తరిణి మందిరం “ఋషికుళ్య “నదీ తీరంలో ఉన్న “తారకస్య “అనే కొండమీద తార, తరిణి అనే ఇద్దరు దేవతలుగా పూజలు అందుకుంటోంది. ఋషికుళ్య నది గంగానదికి చెల్లెలు అని ఆది శంకరాచార్యులు వారు రచించిన “తారా తరిణి ” గురించిన వర్ణనలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు , ద్వాపరయుగంలో పాండవులు ఈ దేవిని పూజించుకున్నారని రామాయణ, మహాభారతాలలో చెప్పబడింది . కలియుగంలో శంకరాచార్యులు ఆదిశక్తి పీఠంగా గుర్తించి శ్లోకించేరు . ఈ కోవెల 14వ శతాబ్దంలో కట్టించిన కోవెల అని అంటారు . కాని మా మాతమహుల సొంత వూరు బరహంపూర్ దగ్గర ఉన్న ఛత్రపూర్ కావడంతో మా వాళ్ళు ఈ కోవేలని తరచూ దర్శించు కోనేవారుట . అప్పుడు కోవెల చాల చిన్నగా వుండేదని చెప్పేరు. ఇప్పటి కోవెల కొత్తగా కనబడుతోంది .అయితే ఇక్కడ  ఉన్న శిల్ప కళ 14వ శాతాబ్దానికి చెందినదని అంటారు. అంటే ఈ కాలానికి చెందిన శిల్పి 14వ శతాబ్దానికి చెందిన శిల్పకళని వుపయోగించి ఉండవచ్చు.

 unknown1

ఇది అమ్మవారి వాహనం , వెనుక మొక్కుబడుల గాజులు కట్టే చోటు.

కోవెల బయట అమ్మవారి వాహనమైన సింహం ఏనుగు పైన కూర్చొని ఉంటుంది. దీని వెనుక  కధ అక్కడ పూజారులకి తెలియదు అన్నారు . ఇలాంటి విగ్రహం కూడా యెక్కడా చూడలేదు.ఇలాంటి అరుదైన శిల్పాలని యిక్కడ చాలా చూడొచ్చు.

unknown3

వారాహిదేవి ,కాళికాదేవి

కోవెల పైన వున్న శిల్పాలు చాలా అరుదైనవి .ఈ శిల్పాలలో కొన్ని వారాహి(వరాహవతారానికి స్త్రీ రూపం ) , అలాగే నృశింహిణి (నృ సింహ అవతారానికి స్త్రీ రూపం) , బ్రాహ్మిణి (బ్రహ్మ కి స్త్రీ రూపం) , విఘ్నేశ్వరి (వినాయకుడికి స్త్రీ రూపం )

కాలక్రమంలో రుశికస్య పర్వతం చెట్లు పుట్టలతో నిండిపోయి ఈ కోవెల మరుగున పడి పోయింది. కొన్నేళ్ళకి అమ్మవారికి మానవుల కోరికలు తీర్చే వుద్దేశ్యంతో తన వునికిని మానవులకు తెయచెప్పాలని నిర్ణయించుకొని సతీదేవి ఒక కోమటి యింట్లో కవలలుగా జన్మించింది.

ఆ కధ ఇక్కడి స్ధానికులు ఇలా చెప్తారు. అది ఏంటంటే పురుషోత్తమపురం అనే ఊరులో ఒక కోమటి భార్య సంతానం లేక యెన్నో మొక్కులు మొక్కగా కవల పిల్లలకి జన్మనిచ్చి మరణిస్తుంది. పిల్లలిద్దరికి ,”తార”,”మరియు “తరిణి” అని పేర్లు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు . పిల్లలు పెరిగి తొమ్మిదేళ్ళ వయసు వాళ్ళు అవుతారు. కోమటి వ్యాపార నిమిత్తం ప్రొద్దుటే పక్కూరికి వెళ్లి రాత్రికి తిరిగి వస్తుంటాడు. పిల్లలకి గాజులు వేయించుకోడం సరదా. అందుకు ఆ వీధిలోకి వచ్చే గాజుల వ్యాపారి దగ్గర చేతులనిండా గాజులు వేయించుకునే వారు. ప్రతి రోజూ యిలాగే గాజుల వ్యాపారి దగ్గర గాజులు వేయించుకునేవారు. కొన్నాళ్ళు ఇలా జరుగగా కోమటి పిల్లలని రోజు కొత్త గాజులు వద్దు అని మందలిస్తాడు. అయినా పిల్లలు వినక పోవడంతో గదిలో పెట్టి తాళం వేసి  వ్యాపారానికి వెళ్ళేవాడు . అయినా కూడా “తారా , తరిణి ” రోజు కిటికీలోంచి చేతులు బయటకి పెట్టి గాజులు వేయించుకొనేవారు. ఇంటికి వచ్చి పిల్లల చేతులకి వున్న గాజులు చూసిన వ్యాపారి పిల్లలని బాగా మందలిస్తాడు. దానికి కోపించిన “తారా”,మరియు “తరిణి” రాత్రి వేళ యిల్లు విడిచి పారిపోతారు.

కోమటి రాత్రి నిద్రలో కల గంటాడు. అందులో “తార” మరియు “తరిణి” కనిపించి తాము సతీదేవి యొక్క స్తనాలనుంచి వుద్భవించిన “తార ,తరణి “అనే దేవతలమని రుషికస్య పర్వతం మీద పూజలులేక యున్నామని తమకు కోవెలకట్టి నిత్య పూజా నైవేద్యాలు చేయించమని చెప్పి మాయమవుతారు . నిద్రలోంచి మేల్కొన్న కోమటి పిల్లలని ఇంట్లో వెతికి కనబడకపోవడంతో యిరుగు పొరుగు వారిని లేపి తనకు వచ్చిన కల చెప్పి పిల్లలు కనబటం లేదని చెప్పగా అందరూ కలసి పిల్లలని వెతుకుతూ రుషికస్య పర్వతం పైకి చేరుకుంటారు. అక్కడ తుప్పలలో కప్పబడి యున్న దేవతా మూర్తులని చూసి భక్తీ పారవశ్యం పొందుతారు.

కోమటి తన ఆస్తులన్నీ అమ్మి ఆ వచ్చిన డబ్బుతో కోవెల కట్టి తాను బ్రతికి వున్నన్నాళ్ళు ఆ కోవెలలోనే వుంటూ “తారా తరిణి ” ల పూజా నైవేద్యాలు చూసుకుంటూ కొంత కాలానికి దేవునిలో ఐక్యం అయ్యేడని అంటారు.

ఇప్పటికి ఈ దేవికి మొక్కుబడులుగా  గాజులు సమర్పించడం జరుగుతోంది.

ముఖ ఖండే దక్షిణ కాళిక , స్థనఖండే తారాతరిణి, యోనిఖండే ఖామాక్య , పాద ఖండే విమలాదేవి .ఈ నాలుగు క్షేత్రాలని దర్శించుకుంటే అష్టాదశ పీఠాలని దర్శించుకున్న పుణ్యం వస్తుందని ఆదిశంకరాచార్యులు చెప్పేరు .

కాబట్టి అరుదైన శిల్పాలని చూడాలంటే “తార తరిణి ” వెళ్ళ వలసిందే.

 

 

 

10 thoughts on “స్థనఖండే తార తరిణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *