May 13, 2024

మనిషి ఖరీదు

రచన: డి.కామేశ్వరి జనరల్ ఆస్పత్రి ప్రహరిగోడ ఆనుకుని వున్న ఆ పెద్ద మర్రిచెట్టు. ఊడలు దిగిన ఆ మహావృక్షం ఆ అమావాస్య చీకటి రాత్రిలో జుత్తు విరబోసుకున్న దెయ్యంలా వుంది. ఝూమ్మని కొమ్మలగుండా దూసుకు వచ్చే గాలిశబ్దం వికటాట్టహాసం చేస్తున్నట్టుంది. ఎండుటాకులు చేసే గలగల శబ్దం దెయ్యాలు గుసగుసల్లా వుంది. ఆ చెట్టు క్రింద బీదా బిక్కీ వండుకోడానికి చేస్తున్న చితుకుల మంటలు కొరివిదెయ్యాల్లా అగుపిస్తున్నాయి. ఆ పొయ్యిలమీద ఉడుకుతున్న అన్నాల కుతకుతలు దెయ్యాలు నిట్టూరుస్తున్నట్టు వుంది. […]

ముఖం లేని చెట్టు..!

రచన: శైలజామిత్ర అగ్ని పేదల గుడిసెల్ని చుట్టుకుంటుంది. అహం పెద్దల మనసుల్ని మండిస్తుంది . ఆ రెంటికీ పెద్ద తేడాలేదు! సూట్‌కేస్‌తో లోనికి వచ్చింది విూరా! వస్తూ వస్తూనే ఎదురుగా పేపర్‌ చదువుతూ కాఫీ తాగుతున్న భర్త బాలరాజును చూసి, ఈయనకు కాఫీ కలపడం రాదే? ఎవరిచ్చారో కూతురేమయినా ఇచ్చిందేమో అనుకుంటూ ఇక ఆ మాటలకు తావు ఇవ్వకుండా నవ్వుతూ ‘‘ ఏవండీ? పని పిల్ల వచ్చిందా? గ్యాస్‌ బుక్‌ చేసి వెళ్ళాను. వచ్చిందా? పాపాయి లేచిందా? […]

రససిద్ధి

రచన: నిడదవోలు మాలతి రాజారావుకి ఆ రోజు చిరాగ్గా తెల్లవారింది. అప్పటికి ఇరవై రోజులక్రితం మామూలుగా తెల్లవారిన ఓ ఉదయం కాలేజీలో మామూలుగా పొద్దు పోలేదు. అతనికీ ఓ కుర్రలెక్చరరుకీ ఘర్షణ జరిగింది. అసలు సంగతి ఎవరికీ అంతు బట్టలేదు కానీ పిల్లలంతా పొలోమంటూ వీధిన పడ్డారు. సమ్మె ప్రారంభమయింది. పిల్లలందరూ పుస్తకాలు మూలన పడేసి బాకాలూ బేనర్లూ పట్టుకుని తిరగడం మొదలెట్టేరు. ఎక్కడ చూసినా “డౌన్, డౌన్, నిరంకుశత్వం నశించాలి, కామేశ్వరరావుని తొలగించాలి, విద్యార్థుల న్యాయమైన […]

ఆఖరి మజిలీ

రచన: ముచ్చర్ల రజనీ శకుంతల వయసు అరవై దాటడం వల్లనేమో కాస్త మోకాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి. భార్య లక్ష్మితో అనలేదు. అలాగే బాధని భరిస్తూ వచ్చాను. కానీ ఈ మధ్య మరీ ఎక్కువగా ఉంటే లక్ష్మితో అంటే.. “పదండి డాక్టర్ దగ్గరకి” అంది. పిచ్చి లక్ష్మి..! తనకేది వచ్చినా   తల్లడిల్లిపోతుంది. పెళ్లయి నలభయ్యేళ్ళు మరి. ఏనాడూ  నా మాటకి ఎదురు చెప్పలేదు. కావలసినవి తెచ్చి ఇస్తే వండి  పెట్టేది.  నోరు తెరిచి “ఇది కావాలీ” అని ఏదీ […]

అనుకోని అతిథి

రచన: వెంపటి హేమ “రజ్జు సర్ప భ్రాంతి” అన్న మాట మీరు వినేవుంటారు .  రజ్జువుని ఆంటే తాడుని చూసి పామని భ్రమించి చంపాలనుకుంటే ప్రమాదమేమీ లేదు. కాని, పాముని చూసి తాడనుకుని చేత్తో పట్టుకుంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే ఎదురౌతుంది కదా! ఒక్కొక్కప్పుడు ఎంతో తేలికగా కనిపించే విషయాల వెనుక భయంకరమైన  ఉపద్రవం పొంచి ఉండే ప్రమాదం ఉంటూంటుంది . అందుకే చెపుతారు పెద్దలు “తస్మాత్ జాగ్రత్త!” అని. ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారిలో […]

ప్రవర్తన

రచన: రాధ మండువ “వచ్చే వారం అంతా కాలేజీకి రాను శిరీషా!” అన్నాను కాలేజీ నుండి బస్టాండ్ కి వచ్చేటప్పుడు. “తెలుసులే. మీ అక్క పెళ్ళి కదా ఎలా వస్తావు?” అంది శిరీష. పద్మిని, శ్రావణి మా వెనగ్గా నడుస్తున్నారు. “మీ బావకి ఫర్నిచర్ షాపుందంటగా సౌజన్యా, భలే అందంగా కూడా ఉంటాడంట, కానీ కట్నం లేకుండా చేసుకుంటున్నాడంటగా. మా ఇంట్లో చెప్పుకుంటుంటే విన్నా” అంది పద్మిని మా వెనక నడస్తున్నదల్లా మా దగ్గరకొచ్చి మా పక్కన […]

ఇది సరైన దారేనా ?

రచన: స్వాతీ శ్రీపాద   ఇంట్లో పెద్ద దుమారమే చెలరేగింది. ఉదయాలు నిశ్శబ్దమైపోయాయి. సాయంత్రాలు పగలు గుహలలో వేలాడే గబ్బిలాలయాయి. శంకరం ఎప్పటిలాగే తన ధోరణిలో తానున్నాడు. ఉదయం అయిదింటికే  నిద్రలేవడం, ఒక గంట వాకింగ్ . ఆరునూరైనా నూరు ఆరైనా అతని అలవాట్లలో మార్పురాదు. వర్షం పడితే వాకింగ్ కి వెళ్ళే బదులు ఇంట్లోనే ఎక్సర్ సైజ్ బైక్ తొక్కడం, ఆరున్నర అయ్యే సరికి స్నానం, దేవతార్చన, సంధ్య వార్చడం ముగించుకుని  అప్పటికే వచ్చిన వంట […]

అమ్మ ఓడిపోయింది…

రచన:జ్వలిత   “టీచర్!!  వాడు చచ్చి పోయాడు”ఆనందంగా చెప్పింది సంతోషి. “వారం రోజులు బడికి రాలేదు ఎందుకు అంటే .. ఎవరో చచ్చిఫోయారంటవేం” మందలించింది టీచర్. “అవును టీచర్, నేను పుట్టినందుకు మా అమ్మను కొట్టి.. అమ్మను వదిలేస్తానని. నన్ను అక్కను చంపుతానన్నవాడు. తాత వాడి కాళ్ళు పట్టుకొని బతిమిలాడితే అక్కను మాత్రమే సాదడానికి  ఒప్పుకున్నవాడు .. ఇన్నేళ్ళు నాకు అమ్మను దూరం చేసినవాడు చచ్చాడు టీచర్”ఉద్వేగంగా  చెప్పింది సంతోషి. జలధి టీచర్ ఆ పసిదాని పరిస్థితి […]

“ముహుర్త బలం”

రచన: నాగజ్యోతీ సుసర్ల . కౌసల్యా సుప్రజా రామా ! పూర్వా సంధ్యా ప్రవర్తతే …….ఒరేయ్ నానీ బారెడు పొద్దెక్కింది నిద్రలేరా …ఒక వైపూ రాముడినీ ,పనిలో పనిగా అదే నోటితో ఇరవై ఆరేళ్ళు వెనకేసుకున్న నాని గాడినీ నిద్ర లేపుతోంది సావిత్రి . ఏమిటమ్మా ఇంకా నిడా ఆరు కూడా కాలేదు ,కాసేపాగి లేస్తాలే అంటూ మళ్ళీ ముసుగు తన్నాడు నాని . సరే నీ ఇష్టం మళ్ళీ ఆఫీస్ అంటూ హడావిడి పడతావు …. […]

ఫిట్నెస్ ఫ్రీక్

    ‘ అమ్మా ! నాకు నెయ్యి రాయొద్దన్నానా!’  పదిహేనేళ్ళ నిత్యా …. ఫుల్కాలని పైకి ఎత్తి చేతులో పట్టుకొనీ తల్లికేసి చూపిస్తూ. ‘ ఎదుగుతున్న పిల్లవి కొద్దిగా నెయ్యి తడిమేను దానికే ఇంత రాద్ధాంతమా! ఏమిటోనమ్మా ఈ పిల్లా….స్కూలు కెళ్ళినన్నాళ్ళూ పెట్టింది తిని, చక్కగా చెప్పినట్లు వినేది. ఈ జూనియర్ కాలేజీ చేరినప్పటినుంచీ, నెయ్యొద్దూ, కూరలో నూనె పోసేస్తున్నావూ…., అని ప్రాణం పీకేస్తోందమ్మా!’ నిత్య తినకుండా కోపంగా చూస్తూ విసురుగా లేచి వెళిపోయింది. నిత్య […]