May 21, 2024

గౌసిప్స్!!! Dead people Don’t speak !!! 3

రచన: శ్రీసత్యగౌతమి

ఎలాగయితే ఏం.. మొత్తానికి రోడ్డు దాటి స్టోర్ చేరుకుని నాలుగు మంచి నీళ్ళ బాటిల్స్ కొన్నాడు. ఆ క్షణం ఎవరో టేప్ రికార్డర్ బటన్ ప్లేయర్ ఆపేసినట్లు చెవిలో చర్చి పాట ఆగిపోయింది. స్టోర్ లో డబ్బులిచ్చి వెనుదిరిగాడు, మళ్ళీ రోడ్డు దాటాలి. ఈ లోపున వాహనాల సందడి. ఆ సందడిలో చెవిలో చర్చి పాటలు, మదిలో గుడి గంటలు ఏవీ వినబడలేదు. ఏరన్ కి క్యూరియాసిటీ….చర్చి పాట అగిందా లేక రోడ్డుమీద వాహనాల రొద వల్ల తనకు వినబడటం లేదా? ఇక్కడ ఇంతమంది హడావిడిగా తిరుగుతున్నప్పుడు ఏ స్పిరిట్ మాత్రం తనకు దగ్గిరగా రాగలదు..పోనీ అనైటా చెప్పిన స్టోరీ యే కరెక్ట్ అయినట్లైతే..

అంటే ఇదంతా కేవలం తన భ్రమే నా? ఈ భ్రమని కాసేపు నిజం గా ఫీల్ అయ్యానా? అదెలా సాధ్యం? నేను సైతం నాకు తెలియకుండానే నేను నమ్ముతున్నానా? అందుకే భయపడుతున్నానా? ఇటువంటి ప్రశ్నలు వేసుకోవాల్సిన పరిస్థితి తనకు వస్తుందని తానెన్నడూ అనుకోలేదు.  తాను డిటెక్టివ్ అవ్వడానికి ఏ ధూము-1,  ధూము-2 సినిమాలలో లాగ చేజింగులు, కన్నింగులు, జంపింగుల స్టోరీ దొరుకుతుందనుకున్నాడు. కానీ non-existence ని చేధించవలసి వస్తుందని మాత్రం మెంటల్ గా ప్రిపేర్ అవ్వలేదు.  ఎదో ఇప్పుడిప్పుడే మెల్ల మెల్లగా….

అట్నుంచి రోడ్డుదాటగానే ఇటు బస్ స్టాప్, అనైటా, బిరియానీ పొట్లాలు తనకోసం నిరీక్షణ. ఆ క్షణం ఆలోచనలకి స్వస్తి చెప్పి జేవురించిన నవ్వు ఒకదానిని పులుముకొని..

ఏరన్: లేటయ్యిందేమో కదా..

అనైటా: కొంచెం. ఎవ్రీథింగ్ ఓకే??? (ఏరన్ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ)

ఏరన్: హహ.. ఐ యాం ఓకే. ఏం ఎందుకు?

అనైటా: ఏం లేదు. ముఖం చూస్తుంటే.. నేను కూ…డా రావల్సిందేమో, దైర్యంగా వుండేది???? (చిన్న వెటకారం)

ఏరన్:  రావల్సింది గా. ఇక్కడే కూర్చుని భయంతో వణికే బదులు (అక్కసుగా). (పోలీసు కుక్కలా అన్నీ పసిగట్టేస్తుందంకుంటాను ఆ కళ్ళజోడులోంచి, ఈమె సూక్ష్మ సంధాగ్రాహం తగలెయ్య.. -ఏరన్ మనసులోని మూలుగు)

ఇటువంటి సమాధానం తాను expected అన్నట్టుగా ఏ రియాక్షన్స్ లేకుండా కేజువల్ గా తీసిపారేసింది.

 

ఏరన్ మళ్ళీ పది నిముషాలలో తేరుకుని.. మామూలుగా వర్క్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ లోపుల ట్రాలీ ట్రెయిన్ కూడా మరో 15 నిముషాలలో అక్కడికి వచ్చే సూచనలు కనబడ్డాయి. ఇక వేగం గా ఫుడ్డు తినడం పూర్తిచేసే కార్యక్రమంలో పడిపోయారు. ఫుడ్డు తింటూ ఇద్దరూ ఎవరి ఆలోచనలలో వాళ్ళు పడిపోయినట్లున్నారు. వాళ్ళిద్దరిమధ్య మౌనం తాండవించడం మొదలెట్టింది.

ట్రాలీ మళ్ళీ ఎక్కేసి కార్ పార్కింగ్ లాట్ కి దగ్గిరగా.. సిగ్నల్ దగ్గిర దిగారు. ఇక మళ్ళీ నడుచుకుని వస్తూ.. ఇక రేపేమిటి డ్యూటీ అన్నట్లు కళ్ళజోడులోంచి ఒక ప్రశ్నార్ధకపు చూపు విసిరింది, ఏరన్ కి అది అర్ధమయిపోయింది.

వెంటనే తన బాస్ ఆజ్ఞ ప్రకారం తాను ఈ కధకు కీలకమైన రేండవ పాత్రను కలవాలని చెప్పాడు. అనైటా ఆశ్చర్యపోయింది. తనకి తెలియని కీలక పాత్ర ఎవరు? ఈ కధ ఎటు వెళ్ళిపోతుంది? ఉండబట్టలేక అడిగేసింది.

ఏరన్: లేదు.. ఈ పాత్ర కి మీరు చెప్పిన కధకి సంబంధించినది కావొచ్చు, కాకపోవొచ్చు. పూర్తిగా ఎందుకో నాకూ తెలియదు. కానీ హోటల్ లో నన్నొక వ్యక్తిని మాత్రం కలవమని నాకు ఇన్ స్ట్రక్షన్స్ ఉన్నాయి. ముందు ముందుకి నాకే అర్ధమవుతున్నదంట. అంత కన్నా వివరాలు నాకు తెలియదు.

అనైటా: ఆ వ్యక్తి ఎవరో నేను తెలుసుకోవచ్చా?

ఏరన్: చెప్పను అని చెప్పేయకుండా.. ముందు ముందు కి మీకే తెలుస్తుంది, ముందు నన్ను తెలుసుకోనీయండి అని నవ్వుతూ పొలైట్ గా మాటని దాటేసాడు. తానందుకే హోటల్ మారినట్లుగా చెప్పి క్లూ ఇచ్చేసాడు. దీనితో సగం అర్ధమయ్యింది అనైటాకి. అనైటా ఇక ఏమీ మాట్లాడలేదు.  తమ కార్ల దగ్గిరకి వచ్చేసారు.  అనైటా రేపు బ్రేక్ ఫాస్ట్ కి కలుద్దామా అని అడిగింది.

ఏరన్: లేదు. నాకు బ్రేక్ ఫాస్ట్ హోటల్ లోనే కాంప్లిమెంటరీగా ఉంది. నేనే ఫోన్ చేస్తాను.

అనైటా: కార్లో డ్రైవింగ్ సీట్లో కూర్చుని..బెల్ట్ పెట్టుకుంటూ.. “సరే”.

ఏరన్ చూస్తుండగానే కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది అనైటా.

ఏరన్ అక్కడే వంటరిగా ఒకటి రెండు నిముషాలు నిలబడి, మెల్లగా తన కార్ తీసుకుని వెళ్ళిపోయాడు. హోటల్కి చేరుకోగానే తక్షణ కర్తవ్యం గుర్తొచ్చింది.. రూబీ ని వెతికి పట్టుకోవాలి !!!

హోటల్ ముందు దిగాడు. కార్ పార్క్ చేసి.. రిసెప్షన్ వైపు నడుచుకుని వెళుతూ అప్రయత్నం గా ఆకాశం వైపులి చూశాడు. చందమామ మబ్బులు వెనుక ఒదిగి కూర్చున్నది, మిగితా ఆకాశమంతా ఒక వెల్వెట్ క్లాత్ లాగ నీలి రంగులో పరుచుకుని ఉంది. ఈలోపున తాను ఫౌన్ టెయిన్ ప్రక్కకి నడుస్తున్నాడే మో.. ఆ ఫ్రెష్ వాటర్ తుంపరలు.. ఫ్రెష్ స్మెల్ తో చల్లగా తనపై పడుతూ చుట్టూ ఆవరిస్తుంటే .. ఏదో మైమరుపు కలిగింది. ఆ వెలుగులో హోటెల్ కూడా దేదీప్యమానం గా వెలుగుతూ కనబడుతుంటే.. తానేదో వెకేషన్ కి వచ్చినట్లుగా ఒక్కసారి ఫీలింగయిపోయాడు. రిసెప్షన్ బిల్డింగ్ లోకి అడుగుపెట్టి, రిసెప్షన్ టేబుల్ దగ్గిర ఎడమ చెయ్యి టేబుల్ మీద, కుడి చెయ్యి నడుం మీద వేసి నిలబపడ్డాడు.. ఎటుపక్కో చూస్తూ.. ఎవరూ లేరేమిటీ అనే ఆలోచనతో.

అలా చుట్టూ చూస్తూ రిసెప్షన్ టేబుల్ వైపు మళ్ళీ దృష్టి సారించాడు ఇంతలో సడన్ గా …

You must be Mr. Aron .. right? .. (చురుకుగా ఒక వాయిస్ పలుకరించింది)

రిసెప్షన్ టేబుల్ అటుపక్కనుండి.. టేబుల్ క్రిందకు వంగీ అప్పటిదాకా ఏదో వెతికినట్లున్నదీ..

అప్పుడే పైకి తలెత్తి.. ఏరన్ ని చూస్తూ ఆ మాట అడిగింది. సడన్ గా వాయిస్ వినేసరికి మనవాడు త్రుళ్ళిపడబోయి అలవాటుగా ముఖంలోకి నవ్వు కొని తెచ్చుకున్నాడు. అమె కేసి చూస్తూ.. తాను మళ్ళీ సర్దుకుని రిసెప్షన్లో కూర్చుంటుండేటప్పుడు ఆమె డ్రెస్ ని గమనించాడు. ఆమె చక్కగా, నిండయిన శరీరాకృతిని కలిగివుండి, వైట్ బ్లౌజ్ దానిపైన కురచగా వున్న బ్లూ బ్లేజర్ ని వేసుకుని ఉన్నది. చక్కని పలువరసతో స్త్రైట్ గా నవ్వుతూ ..అద్భుతం గా కనబడింది.

ఏరన్ : She must be Ruby… (స్వగతం)… yes.. I am Aron.

రూబీ: I am Ruby.

అలా అనేటప్పుడు.. క్రిముసన్ రెడ్ లిప్ స్టిక్ తో వున్న ఆమె గుండ్రని పెదాలు ఇంకా గుండ్రం గా వట్రసుడిలా తిరిగి తన పేరుని పలికి చెప్పింది.

ఏరన్ ఇంకా మైమరచి మాట్లాడేలోపుల… ఒక్క చూపుతో రూబీ ఏరన్ ని ఆపాదమస్తకం స్కాన్ చేసేసింది. తాను ఏదో ఒక జీన్ పేంట్ వేసుకుని.. ఒక టీ షర్టు పైన తగిలించుకున్నాడు. అంత అందమైన అమ్మాయి తనని ఫ్లరిటడ్ గా చూస్తే.. నేనింత అసహ్యం ఉన్నానేంట్రా బాబూ.. అని బ్రెయిన్ లోనే ఒక దర్పణాన్ని వేసుకుని తనని తాను అందులోనే చూసుకొని ఒకసారి అసహ్యించుకున్నాడు. ఇంతలో తన ఆలోచనని చేధిస్తూ రూబీ… మీకోసం ఎవరో అమాండా అనే అమ్మాయి వచ్చి అడిగింది. మీ రూం నెంబర్ తెలుసుకుని వెళ్ళిపోయింది.

అమాండా మూడవ కీలక పాత్ర.. కాని ఎలాగో తెలియదు. తెలుసుకోవాలి అని అనుకున్నాడు ఏరన్. మళ్ళీ మొదటి ఆలోచన కి వెళ్ళి.. రూబీ తో సంభాషణ అమాండాతో పరిమితమయి పోయినందుకు ఏరన్ మనసు కొంచెం గట్టిగా మూలిగింది. ఈ లోపున రూబీ మళ్ళీ కల్పించుకుని… “మీ రూం నెంబర్ 25. డౌన్ థ హాల్ వెళ్ళి లెఫ్ట్ కి తిరగాలి”…… అని డైరక్షన్ చెప్పింది.

తాను తెచ్చుకున్న ఒక బ్యాగు, బ్రీఫ్ కేసు తన వైపు లాక్కుని.. రూం వైపు నడుచుకుని వెళ్ళిపోయాడు. రూం లోకి వెళ్తూనే.. చేతిలోని బ్యాగు విసిరేసి.. బ్రీఫ్ కేస్ ని కూడా బెడ్ మీద పడేసి…. తనకంటూ ఒక స్వంత ప్రపంచం దొరికేసింది.. అందులో తానొక్కడే ఒక్కగానొక్క పౌరుడు అని హ్యాపి గా.. టవల్ తీసుకుని.. షవర్ చేయడానికి వెళ్ళిపోయాడు. తన ప్రయాణ బడలికనంతా పోగొట్టుకొవడానికి కొన్ని వందల సంవత్సరాలనుండి యజ్ఞం చేసినట్లుగా ఫీల్ అయిపోయి.. తనివితీరా స్నానాలాచరించి వచ్చి కూర్చున్నాడు. కళ్ళముందు కనబడిన మినీ బార్ ని ఓపెన్ చేసి చూశాడు. స్కాచ్ కనబడింది. ఇంతకుమునుపు ఏదో లైట్ గా మందుకొట్టాడు.. అనైటా తో మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఈ స్కాచ్ తీసుకుని హాయిగ నిద్రపోయి పండగ చేసుకుందామనుకున్నాడు. అనుకున్నదే తడవు… గ్లాసులోకి స్కాచ్ వేసుకుని ఐసు ముక్కలను కూడా వేసుకుని.. లోపలికి స్వీకరించడం మొదలుపెట్టాడు. రాజైనా, బంటైనా తానే.. …..

“ఈ లోకంతో నా కింకా పని ఏముందీ…Don’t care!” …. అని ఒకసారి పాడుకున్నాడు కూడా.  తన సెల్ ఫోన్ ని కూడా సైలెంట్ మోడ్ లో పెట్టేసాడు.

ఇలా హాయిగా ఆశ్వాదిస్తూ… సగం స్వర్గం లో ఉంటుండగా… ఒక భల్లూకం మీద పడినట్లు భళ్ళున రూం లోని ఫోన్ మ్రోగింది. ఆ శబ్దానికి ఏరన్ త్రుళ్ళిపడి.. తన చేతిలోని స్కాచ్ ని స్పిల్లోవర్ చేశాడు. తేరుకునే లోపునే మళ్ళీ భళ్ళుమని అలాగే సౌండు. ఈసారి స్కాచ్ షర్ట్ మీద పడింది. ఇక తట్టుకోలేక లేచి ఫోన్ దగ్గిరకి వెళ్ళి రింగ్ ఆపేద్దామనుకున్నాడు. కానీ మళ్ళీ అది రూబీ నుండి లేదా బాస్ నుండి కావొచ్చు అని ఓపిక తెచ్చుకుని ఎత్తాడు.  కానీ ఇద్దరూ కాదు.

ఒక్కసారిగా… కెవ్వు..మని చెవి దగ్గిర పెట్టుకున్న ఇయర్ పీస్ చెవికి దూరం గా ఎత్తిపట్టుకున్నాడు.. ఎందుకంటే.. హిస్స్స్స్స్స్స్స్స్స్స్స్…. అనే ఒక స్టాటిక్ సౌండ్ గూబని గుయ్యిమనిపించింది.  ఆ తర్వాత… బరువైన ఉచ్చ్వాస నిశ్శ్వాసాలు ఎక్కడో మూతేసిన స్టీలు డ్రమ్ములోంచి వస్తున్నట్లు… ఆ ఊపిరి బరువులు ఎక్కువై.. రూం అంతా వ్యాపించి.. మధ్య మధ్యలో మూలుగులు గా మారడం మొదలుపెట్టింది. దెబ్బకి ఆ ఫోన్ ని కార్పెట్ మీద పడేసాడు. అయినా మార్పులేదు. తానొక సోఫా మీఎద నక్కి కూర్చుని.. అడిగాడు..

“ఎవరది?”… సమాధానం లేదు.

కొంతసేపు వెయిట్ చేసి ఆ ఫోన్ రిసీవర్ ని మళ్ళీ ఫోన్ మీద పెట్టాడు. కానీ ఆ నెర్వస్ నెస్ ఇంకా తగ్గలేదు. మెల్లగా వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు.. ఈసారి ఫోన్ వచ్చినా ఎత్తకూడదనుకుని. ఈలోగా ఎలాగూ నిద్రపట్టేస్తుంది కదా అని దైర్యం !!

అలా బెడ్ మీద సాగోరి.. ఫ్యాన్ వైపు చూశాడు. ఫ్యాను డయల్ మీద ఏదో ఒక అబ్బాయి రూపం కనీ కనబడనట్లు ఉంది. ఫ్యాను తిరుగుతుంటే డయల్ మీద వున్న రూపం కూడా తిరుగుతుంది. ఏరన్ కి మళ్ళీ జ్వరం వచ్చినంత పనయింది.

ఎవరయివుంటారు?………మళ్ళీ ప్రశ్న… కానీ లేచి ఫ్యాను ఆపడానికి కూడా బలం లేకుండా అయిపోయి బిగుసుకుపోయాడు ఏరన్.

 

(సశేషం)

1 thought on “గౌసిప్స్!!! Dead people Don’t speak !!! 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *