May 19, 2024

దీపతోరణం – పుస్తక సమీక్ష

రచన: ఝాన్సీ మంతెన మానవత్వపు విలువలను మానవ సంబందాలను అందమైన కధల రూపంలో చెప్పిన కన్నెగంటి అనసూయగారి దీపతోరణం కధా సంకలనం. ఇది ఆమె కలంలో నుండి వచ్చిన మూడవ కధాసంకలనం. మొత్తం పదిహేను దీపాలతో పేర్చి మనకందించారు. కొన్ని కళ్ళు చెమరింపచేస్తే కొన్ని ఆలోచింపచేస్తాయి. ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆర్. శాంతసుందరి గారు తన ముందు మాటలో మానవీయ విలువలను ఆహ్లాదంగా కధల్లో పొందుపరిచి సమాజానికి అందించడమే కాదు, తన జీవితంలో కూడా వాటిని పాటిస్తారు […]

అవ్యక్త దీపం

రచన; లలితారామ్ మార్మిక మేఘమా, మేఘమా ఆగాధ అద్భుత మహార్నవమా నీల లోహిత కిరణమా, సంవేగమా వనమాలికల రాజమా, శృంగమా మేఘమా! మేఘమా! నీ రాగ ధారల నిండే ఒక కావ్యం మహార్నవమా ! సత్యమా! జల ప్రవహాముల వెలువడే ప్రబంధం కిరణమా! కాంతి పుంజమా! రేఖామయమై నవ్య నవలిక మిరుమిట్లాడే పర్వతమా! అత్యున్నతమా! శిఖరాగ్రమున వెలిగే తాత్వికం కాల విస్తారం! కాల విహారం! కల్మషం, మాయమయ్యే మేఘం నేలకింకె జలాజాలం, జలాజాలం మసక రేఖల అస్పష్ట […]

Dead people don’t speak-7

రచన:గౌతమి ఏరన్ ఆ రచయిత ఫెర్నాండేజ్ ని కలిశాడు. అతను అంశాలమీద కొన్ని ప్రశ్నలు తనకున్నాయని చెప్పాడు. ఫెర్నాండేజ్ నుదురు చిట్లించి కంటి చీపును అనుమాన దృష్టితో సంధించి మీరు డీల్ చేస్తున్న కేసు వివరాలు చెప్పండి అన్నాడు. ఏరన్ “తప్పకుండా”… అని మొదలుపెట్టాడు…. “ఇంట్రెస్టింగ్… మీకు స్వయాన జరుగుతున్న అనుభవాలని బట్టి కూడా దీన్ని నమ్మక తప్పౌ. ఏదో అతీత శక్తి వుంది అని అనిపిస్తున్నది నాకు కూడా… “మరి ఇప్పుడు చెప్పండి మీ ప్రశ్నలేమిటి?” […]

వెటకారియ రొంబ కామెడియా 12 – లేడీస్ క్లబ్:

రచన: మధు అద్దంకి లేడీస్ క్లబ్: సోంబేరి పురానికి చాల గొప్ప పేరుంది..సోంబేరి పురానికి అంత గొప్ప పేరు రావడానికి ముఖ్య కారణం అందులోని నోరు తిరిగిన అమ్మలక్కలే…వారందరూ హాయిగా సంతోషంగా పక్కవాళ్ళ గురించి, ఎదురింటివాళ్ళ గురించి నోరు నొప్పి పుట్టేదాక లేదా ఆ “ఫలాన” వ్యక్తులు ఆ కాలనీ ఖాళీ చేసేదాక చెప్పుకుంటారు.. ఒక్కసారి “ఫలానా” ల మీద మొహం మొత్తాక టార్గెట్ ని మారుస్తారు.. ఈ అమ్మలక్కలందరూ ఒకరోజు వాళ్ళ నాయకురాలు “సైంధవి” ఇంట్లో […]

అక్షర సాక్ష్యం – రంగనాధ్ కవితలు

రచన: రంగనాధ్ 1. సగటు మానవుని నిత్యసంకల్పం ధన, ధాన్య, వస్తు, వహనం- భోగం, భాగ్యం, ఐశ్వర్యం – ఉద్యోగం, ఉత్సాహం- స్వగృహ వాసం, సత్సహావాసం- క్షేమం, ఆయురారోగ్యం- పుత్ర పౌత్రాదిజన సౌఖ్యం- బంధుమిత్రాదిజన సహాయం- సర్వదేవతా కటాక్షం- ఆనందమయ జీవితం- సర్వదా లభ్యమస్తూ!!! 2. శ్రేష్ట మానవుని సత్సంకల్పం నాకేర్పడే కష్టం, నష్టం, సుఖం, దుఃఖం, సంతోషం, సంతాపం, అవమానం, సన్మానం సర్వం దైవార్పితం- ఓంకారమే ప్రాణంగా- లోకకల్యాణ వ్రతమే జీవితంగా- భూమ్మీద నీ ప్రతినిధిగా- […]

పద్యమాలిక జులై 2

Srinivasa Bharadwaj Kishore నారి కుండె గాన నాజూకునడుమదే వంగు చుండె చంద్రవంకవోలె బలుపు నడ్డినీది బరువుగూడుండెనే ఇరుకు పట్టకుండ యెటులవంగు గుండు మధుసూదన్ గృహమున సర్వ కార్యములు గేస్తునకున్ దనుఁ గన్నవాండ్రకున్ గృహిణియె సత్వరమ్ముగనుఁ గేవల మేక కరమ్మునన్ దగన్ వహన మొనర్చి వారల కవారిత సేవలఁ జేసి చేసి తా నహరహమున్ గృతార్థతను నందఁగ “యోగ”యె యేలఁ గావలెన్

పద్యమాలిక – జులై 1

నాగజ్యోతీరమణ సుసర్ల 1. కం : పతి మారెను విష్ణువుగా సతి తన పాదములు పిసుక – సౌకర్యముగా నతిగా చాచిన చేయే సుతిమెత్తని ఫణి పడగగ- చోద్యము చూపెన్ …. గుండా వేంకట సుబ్బ సహదేవుడు 1. పిక్కల నొప్పులనగనే నిక్కడ సేవించు చుండ నిదియేమండీ! బొక్కసము నిండు కొన నెక సెక్కెములకు కొదువలేదు సిగ్గది లేదా? 2. సిరి శ్రీనాధులు పేర్లని నిరతము పవలింపు సేవ నెరవేర్చగ మీ శిరమున నుంచిన కరమే సరీసృపమ్మై […]