May 6, 2024

శుభోదయం 1

రచన: డి.కామేశ్వరి శ్యామ్ అద్దం ముందు నిలబడి తల దువ్వుకొంటూ తన రంగు చూసి తనే నిట్టూర్చాడు. భగవంతుడు తననింత నల్లగా, అనాకారిగా ఎందుకు పుట్టించాడో! రోజుకి కనీసం ఒకసారన్నా ఆ మాట అనుకునే శ్యామ్ ఆ రోజు పదిసార్లు ఆ మాట అనుకున్నాడు. ఈ రంగే.. ఈ రంగే తనకి శత్రువయింది. లేకపోతే.. రేఖ.. నిట్టూర్చి తల దువ్వుకోసాగాడు. వెనకనించి తల్లి వచ్చిన నీడ అద్దంలో కనిపించింది. “శ్యామ్! టిఫినుకి రా రా, యింకా ముస్తాబవలేదా? […]

చిగురాకు రెపరెపలు – 7

రచన: శారద మన్నెం మా చుట్టాల్లో ఎవరిదో పెళ్ళి. ఎవరో అంటే ఏమో కాదు. మా పెద మామయ్య మరదలి కొడుకు. మా పెద్ద మామయ్య తహశిల్దార్ చేసేవాడు. ఆయనంటే అందరికీ హడల్. చాలా స్టయిల్ చేసేవాడు. అతని కేప్స్ కి, స్టిక్స్ కి స్టాండ్సుండేవి. హంటింగ్ కి వెళ్ళేవాడు. గుర్రం స్వారీ చేసేవాడు. కాని పిల్లికి బిచ్చం వేసేవాడు కాదు. మా అమ్మమ్మకే ఏమీ ఇచ్చేవాడు కాదు. ఎప్పుడన్నా యింట్లో వుంటే నేను కనిపిస్తే “ఏవే […]

మాయానగరం – 17

రచన: భువనచంద్ర “నువ్విక్కడెందుకున్నావ్? ” ఆశ్చర్యంగా అడిగింది సుందరీబాయి ఆనందరావ్ ని . “ఏక్సిడెంట్ అయ్యింది !” కొంచం సద్దుకుని అన్నాడు ఆనందరావు. “అయితే? “అర్ధం లేని ప్రశ్న వేసింది సుందరి. చిన్నగా నవ్వాడు ఆనందరావు , “సుందరి గారు! ‘అయితే’ అనే మీ ప్రశ్న కి నా దగ్గర సమాధానం లేదు. కొందరు వాళ్ళ కోసమే బ్రతుకుతుంటారు. వాళ్ళ సుఖము వాళ్ళ స్వార్ధము తప్ప మరేమీ వాళ్ళకు పట్టవు. కొందరు అంటే మాధవిగారిలాంటి వాళ్ళు సమాజం […]

చేరేదెటకో తెలిసీ 5

రచన: స్వాతీ శ్రీపాద “అవును బాగానే గుర్తు పట్టావు ..” అతను చెప్పకమునుపే అతని వివరాలు నా కళ్ళముందు సినిమా రీల్ మాదిరి తిరిగాయి. చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్కూల్ ,కాలేజీ అప్పట్లో అతనితో మాట్లాడిన గుర్తే లేదు. నిజమే. ఎప్పుడూ పుస్తకాల పురుగులా తన చుట్టూ తను గూడు కట్టుకుని ఉండేవాడు. అంతేనాఎవరైనా పలకరించినా ఎంత విసుక్కునే వాడనీ … ఎల్ కే జీనుండి ప్రతి క్లాస్ లో టాపర్ నన్నగర్వం చూపులో మాటలో ప్రవర్తన […]

ఆరాధ్య 11

రచన: శ్రీమతి అంగులూరి అంజనీదేవి ”అదే! అదంత అవసరమా? ఏం డాడీ! వాళ్ల దగ్గరకి వెళ్లక తప్పదా?” తండ్రి వేపు చూసింది. ”వెళ్లాలమ్మా! ఎందుకంటే సునీల్‌కి అమ్మాయిని ఇచ్చేవాళ్లు అన్నీ చూస్తారు. మీ అత్త, మామలు ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు రాకపోయినా, పెళ్లికి రాకపోయినా ఎందుకు రాలేదని అడుగుతారు. వాళ్లకు మనం చెప్పే సమాధానం మనకు నచ్చవచ్చేమో కాని వాళ్లకు నచ్చదు. వియ్యంకులకి వుండే ప్రాముఖ్యత అలాంటిది. ఈ సంబంధం చాలా మంచిది. ఈ చిన్న కారణంతో దీన్ని […]

విపర్యయాలు – వేటూరి కథలు 2

రచన: వేటూరి సుందరరామమూర్తి “ఇదిగో! ఇదే ఆఖరుసారి చెబుతున్నా, తర్వాత నన్నని ప్రయోజనం లేదు. గడువులోగా నాకివ్వవలసిన ఆరువేలూ అణాపైసల్తో సహా చెల్లించావా, సరి. లేదా నా పెళ్ళాం బిడ్డల్ని నీవు శపించి లాభం ఉండదు, జాగ్రత్త!” చెప్పవలసిన మూడు ముక్కలు టకీమని చెప్పి వెనక్కి తిరిగాడు వీరభద్రం. నడిరోడ్డు కెక్కిన బ్రతుకుతో, ముళ్ళకంచెపై దుప్పటి పడ్డవాడిలా కర్మవివశుడై నిగూఢంగా నిట్టూర్చాడు సూర్యం. ————– “అమ్మాయి రాణీ! నువ్వు ఎప్పుడెళ్ళాలమ్మా కాలేజీకి.. ఎంత కట్టాలి? అసలు మొత్తం […]

అంతిమం – 5

రచన: రామా చంద్రమౌళి శైల చెప్పింది. ప్రస్తుతం ట్రెండ్ ఏమిటంటే. . ‘పాత ఒక వింత. . కొత్త ఒక రోత ‘. ఆంటిక్ సైకాలజీ అదే కదా. పురావస్తువులపై మనిషికి మక్కువెందుకంటే. . ఓల్డ్ ఈజ్ గోల్డ్. అందుకు. సర్కస్ కళ ఓల్డ్. అందుకే గోల్డ్. ఐతే మనం దీన్ని ఆధునీకరించి. . కొన్ని కొత్త భారతీయ గ్రామీణ యుద్ధ కళలనూ, స్కిల్స్ నూ ప్రవేశ పెట్టాలి. కాబట్టి ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేద్దాం […]

శోధన 5

రచన: మాలతి దేచిరాజు “అక్కా ఎక్కువగా ఆలోచించకు హాయిగా నువ్వు కూడా నీ ఉద్యోగానికి రిజైన్ చేయ్, ఇద్దరం పెళ్లి చేసుకుందాం నీకు అభ్యంతరం లేక పోతే వన్ బై టు అయినా సరే క్రికెట్ టీమ్ లా పిల్లలను కని దేశానికి ఓ అమితాబ్ ని, ఓ రాఖీ సావంత్ ని ఇద్దాం” నవ్వుతూ అంది. “నీకు అల్లరి ఎక్కువ అవుతోంది” అంది చెల్లెలి చెవి మెలిపెట్టి. అర్ధ రాత్రి పన్నెండు దాటింది. శోభన కంప్యూటర్ […]

మన వాగ్గేయకారులు – 2

రచన: సిరి వడ్డే శ్రీ త్యాగరాజ స్వామి : శ్రీ త్యాగరాజ స్వామి(మే 4, 1767 – జనవరి 6, 1847) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. “త్యాగయ్య”, “త్యాగబ్రహ్మ” అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన […]

రాగమాలిక – ఆభేరి

శివుని ఢమరకము నుండి అకార, ఉకార, మకారం యొక్క కలయిక అయిన ‘ఓం ‘ కారము పుట్టినది. ఈ ఓంకారాన్నిఅనుష్ఠించడంలో, అనుసంధానించడంలోనూ నాదము వస్తుంది. ఆ నాదమే సంగీతానికి మూలము. అందుకే శివున్ని ‘నాదా తనుమనిశం ” అని కొడియాడాడు త్యాగరాజ స్వామి. ప్రకృతిలోని జంతువుల పక్షుల అరుపుల నుండి సప్త స్వరాలు పుట్టించాడు మానవుడు. ఈ సప్త స్వరాలతో సామవేద సారమైన సంగీతము పుట్టింది. స : షఢ్జం అంటారు అంటే సముద్రము. ఈ షడ్జం […]