May 20, 2024

Dead ppl don’t speak-11

రచన:డా. శ్రీసత్య గౌతమి

పోలీస్ స్టేషన్ వచ్చింది. ఇద్దరూ లోపలికి వెళ్ళేరు, జేసన్ ఏవో ఫైళ్ళు చూస్తున్నాడు. జేసన్ తలెత్తి అనైటాని చూసి సాదరం గా నవ్వాడు. అనైటా ఏరన్ ని ప్రయివేట్ డిటెక్టివ్ గా పరిచయం చేసింది. ఏరన్, జేసన్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అందరూ కూర్చున్నారు. తాను పాత ఫైళ్ళన్ని వేరే స్టేషన్ నుండి తెప్పించినట్లు, వాటిలో ఈ కేసు వివరాలకోసం గత 2-3 రోజుల నుండి వెతుకుతున్నట్లు తాము ఎంత కష్టపడుతున్నదీ చెబుతున్నాడు.
అనైటా వైపు చూసి, “అసలీ కేసు ని మళ్ళీ ఎందుకు పర్ష్యూ చెయ్యాలి? ఏనాడో ముప్పై ఏళ్ళ క్రితమే క్లోజ్ అయిపోయిన ఈ కేసుని తిరిగి ఎందుకు ఓపెన్ చెయ్యాలనుకుంటున్నారు? ఈ కేసు గురించి ఎవరు మీకు చెప్పారు?” అని అన్నాడు.
ఈ ప్రశ్నకి సమాధానం తనకీ తెలుసుకోవాలనిపించింది, ఎందుకు అసలు అనైటా ఈ కేసుని పర్ష్యూ చేస్తున్నదని.. ఏరన్ కి ఎప్పట్నుండో వేధిస్తున్న ప్రశ్నే అది, క్రొత్తలో అనైటాని అడిగాడు కూడా ఒక ఆత్మ చెప్తే మాత్రం ఎందుకు ఇవన్నీ చెయ్యాలి అని? అనైటా నుండి పెద్దగా సమాధానమేమీ రాలేదు.
అనైటా దానికి పెద్దగా స్పందన చూపించ లేదు. మళ్ళీ ఎల్విన్ రికార్డే వేసింది, ఫోన్ ఇన్ కార్యక్రమం లో పెయింటర్ మాట్లాడినట్లు వగైరా. జేసన్ కి ఆ సమాధనం పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఏరన్ కి మాత్రం అర్ధమయ్యింది కొంతవరకు. అనైటా తనకి తెలియకుండానే ఈ కేసుని పర్ ష్యూ చెయ్యడానికి ఇందులోకి లాగబడిందని, అప్పుడప్పుడు ఆ ఆత్మ ల అతీత శక్తులకి తాను లోనవుతున్నదని. కానీ అది తానేమీ బయటపెట్టలేదు, ఎందుకంటే అది చెప్పి జేసన్ ని నమ్మించడం కష్టం, తన లాగ అనుభవపూర్వకం గా తనకు తాను తెలుసుకోవాలే తప్ప, రెండవది అనైటా కూడా సపోర్ట్ చెయ్యదు తాను ఆత్మ ల అతీత శక్తులకు లోనయ్యిందని చెబితే. ఆమె వాటికి లొంగి కేవలం క్రియ ని చేసుకుంటూ పోతుందే తప్ప.. తన లాగ ఎందుకు ఇలా జరుగుతోంది అని అనైటా పరిశోధించడం లేదు. కాబట్టి ఆమెకి కూడా జేసన్ అడిగే ప్రశ్నకు సమాధానం అంతు చిక్కని ప్రశ్న!
కేసు పూర్వాపరాలను పరిశీలించి… ముప్ఫై ఏళ్ళక్రితం ఒక పది మంది పిల్లల వరకు చుట్టుపక్కలనుండి తప్పిపోయినట్లుగా వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసినట్లుగా వుంది అని జేసన్ సూచించాడు.
ఏరన్: ఆ తర్వాత ఆ పిల్లలు మరి దొరికారా?
జేసన్: ఇంకా ఫైల్స్ చూస్తున్నాం. సమాచారం పెద్దగా తెలియడం లేదు. నాకు కూడా ఇంట్రస్ట్ పెరుగుతున్నది ఈ కేసు మీద ఆ తర్వాత ఏమి జరిగిందా అని తెలుసుకోవడానికి. ఈ లోపుల నేను ఆ పిల్లల తల్లి దండ్రులెవరు, ఇంకా బ్రతికే వున్నారా? అసలేం జరిగింది తెలుసుకుందాం అని అక్కడి తో ముగించబోయాడు. ఇక మీరు వెళ్ళొచ్చు, ఏదైనా క్లూ దొరికితే మళ్ళీ కబురు చేస్తానన్నట్లు.
అప్పుడు ఏరన్ “ఓకె.. తప్పకుండా ఈ విషయాల్ని తెలుసుకోండి, మాకు మీకు కూడా అవసరమైన విషయమే. కాకపోతే ఆ పిల్లల్లో పెయింటర్ అనే పేరుతో ఎవరైనా వున్నారా అని చూసి చెప్పగలరా? వుంటే ఆ కుర్రాడి తల్లిదండ్రుల అడ్రెస్స్, ఇతర వివరాలు కావాలి”..అన్నాడు.
జేసన్ ఆ పదిమంది పిల్లల పేర్లు ఇచ్చాడు, అందులో రాబర్ట్ పెయింటర్ అనే పేరు వుంది. అడ్రస్ చూస్తే ఆ వూరికి సంబంధించిన వాడే, మిగితా పిల్లలవి చుట్టుపక్కల అడ్రస్సులట. సరే అని ఆ ఇన్ ఫర్మేషనంతా తీసుకొని ఏరన్, అనైటా బయట పడ్డారు.
ఆ తర్వాత ఏమి చెయ్యాలన్నది ఆలోచించుకొని చేద్దాం, ఈ లోపుల జేసన్ చెయ్యాల్సినది జేసన్ని చెయ్యని. తన హోటల్ వచ్చేసింది. సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పాడు.
సాయంత్రం ఫెర్నాండేజ్ దగ్గిరకి వెళ్ళాడు ఏరన్. తాను రేడియో స్టేషన్ దగ్గిరనుండి సుజీ వరకూ అన్నీ తూ చ తప్పకుండా చెప్పాడు. ఇదంతా ఎలా సాధ్యమయ్యిందంటారు? ….. అడిగాడు ఏరన్..
ఫెర్నాండేజ్: ఏముంది? చాలా సింపుల్. పెయింటర్ అనైటాని ఎంచుకున్నాడు, తన ద్వారా ఏదో తెలియపరుస్తున్నాడు. అనైటా ఆ రోజు తనకు దొరకక పోయేసరికి సుజీ ద్వారా చెప్పాడు.
ఇది ఒక ఆత్మ కధ. పైగా ముప్ఫై ఏళ్ళ క్రితం జరిగింది, పోలీస్ స్టేషన్ లో ఎంక్వయిరీ చేస్తే, కొంతమంది పిల్లలు తప్పిపోయారని కంప్లయింట్లు తప్ప, తర్వాత విషయాలేమీ, తమ ఫైళ్ళలో లేవని తెలిపాడంటున్నారు.. ఈ కేసుని డీల్ చెయ్యడం కష్టమే అనిపిస్తున్నది.
ఏరన్: చాలా ఆశ్చర్యం. ఏం అనైటాని లేదా సుజీ ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు? మరెవరినైనా ఎంచుకొని చెప్పించుండొచ్చు గా?
ఫెర్నాండేజ్: అదంతా ఒక సైన్స్.
ఏరన్: సైన్స్ కి ఘోస్ట్స్ కి సంబంధం వుందా?
ఫెర్నాండేజ్: ఒక కోణంలో వుందనే చెప్పుకోవచ్చు. అందుకే ఈ కోణంలో కొంతమందిని సేకరించి న్యూరో సైన్స్ రీసెర్చ్ చేస్తున్నారు.
ఏరన్: ఆశ్చర్యపోయాడు. నేను చిన్నప్పుడు చెరువు గట్లంబడి ఆట్లాడి పడిపోయి రాత్రంతా జ్వరం తెచ్చుకొని బాధపడుతుంటే, ఏదో ఆ చెరువు దగ్గిర గాలి జల్లి, నన్ను తోసేసుంటందనీ అందుకే దెబ్బలు తగిలి జ్వరం వచ్చిందని అమ్మమ్మా వాళ్ళు కంగారు పడి మంత్రం వేయించడానికి తీసుకెళ్ళేవారు. అదేం మాయో ఆ తర్వాత జ్వరం ఎగిరిపోయేది. అది నిజం గా దెయ్యం లేదా గాలే నన్ను తోసేసిందంటారా? … గట్టిగా నవ్వేశాడు.
ఫెర్నాండేజ్: హహహ… చెరువు గట్లంబడి తిరిగితే ఎక్కడ గబుక్కున చెరువులో పడతారో అని ఆ దెయ్యం వర్రీ అయ్యి అలా భయపెట్టుంటుంది లేండి, మంచి దెయ్యమే అది..
ఇక పాయింటుకొస్తే.. కొంతమంది బ్రెయిన్స్ కి ఎక్కడో దాగివున్న కొన్ని ఏజెంట్స్ తో అనుసంధానం కాగలిగే శక్తి సామర్ధ్యాలు వుంటాయి. ఇవి ఎల్లవేళలా పనిచెయ్యకపోయినా కొన్ని అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే ఆ శక్తి సామర్ధ్యాలు బయటపడతాయి. న్యూరోసైన్స్ దీన్ని పూర్తిగా నమ్ముతున్నది. దీనినే 6th సెన్స్ అనవచ్చు. కొంతమందికి దీనికి మించి కూడా శక్తి వారికి సహజంగా పుట్టుకతోనే రావొచ్చు. ఇటువంటి లక్షణాలు కలిగిన వారు మాత్రమే ఆత్మలను చూడగలరు, వాటిని అర్ధం చేసుకోగలరు. ఇంటువంటి సెన్స్ బలంగా వున్నవాళ్ళ పైనే పరిశోధనలు చేసి మనిషి చనిపోయాక కూడా అతనికి లైఫ్ అనేది వుందా అనే విషయాన్ని కూలంకషంగా న్యూరో సైంటిస్ట్స్ పరిశోధిస్తున్నారు, అందులోని ఒక చిన్న భాగం గానే నేను ఆత్మ చుట్టూ ఆవరించుకొని వున్న పొరలు, వాటి అతీంద్రియ శక్తుల గురించి వివరణను ఇచ్చాను. అది మీ కేస్ స్టడీకి వుపయోగ పడింది, చాలా సంతోషం.
ఏరన్: అంటే రెలిజియస్టిక్ అపనమ్మకాలని సైన్స్ కూడా నమ్ముతుందా?
ఫెర్నాండేజ్: న్యూరో సైన్స్ కి రెలిజియన్ కి సంబంధం లేదు. న్యూరో సైన్స్ మనిషికున్న అతీంద్రియ శక్తులను స్టడీ చేస్తున్నది. మనిషి శరీర కుహరానికి లోపలి పొరల్లో ఒక పొర ఆత్మ. అదే చెబుతున్నది. ఏసు తాను మరణించిన మూడవరోజు ఆత్మ గా మళ్ళీ తిరిగొచ్చాడని చెబితే ప్రపంచం నమ్ముతున్నదిగా. అలాగే గీత లో ఆత్మ నాశనం లేనిది అని శ్రీ కృష్ణుడు బోధిస్తే నిజమన్నారుగా. మరి సైన్స్ కష్టపడి, సమస్యలు ఎదుర్కొంటూ ఇంకా డీప్ గా తెలుసుకుంటుంటే ఎందుకు హర్షించలేకపోతున్నారు.
ఏరన్: ఆల్ రైట్, అంటే, సుజీ ల బ్రెయిన్స్ కి సబ్ కాన్షియస్ (ఉపచేతనం) గా ఏదో వినగలిగే, అర్ధం చేసుకోగలిగే శక్తి వుందంటారు, ఆ శక్తి వల్లే పెయింటర్ అతీంద్రియ శక్తులతో అనుసంధానం కాగలుతున్నారంటారు.
ఫెర్నాండేజ్: యస్. ఎగ్జాక్ట్లీ. ఇది వాళ్ళకి సహజమైన లక్షణమే. దీన్లో పెద్ద వర్రీ కావలసిందేమీ లేదు. ఓకె.. టైం అయ్యింది, నేను ఒక ఫ్రెండ్ దగ్గిరకి తీసుకు వెళ్తానన్నాను గా. తాను ఒక సైక్రియాటిస్ట్ మరియు న్యూరో సర్జన్ కూడా. నేను ఈ విషయాలన్నీ టూకీగా చెప్పాను కూడా. చాలా ఇంట్రెస్ట్ చూపించాడు ఈ కేస్ స్టడీ మీద. ఈయన అమెరికా లో చాన్నాళ్ళు వుండి అక్కడ కొన్ని పరిశోధనలు చేసినట్లు గా కొన్ని సంధర్భాలలో చెప్పినట్లు నాకు గుర్తు. మనం ఆయన్ని కలిస్తే… ఏదైనా తన సలహాలతో ఈ కేసును క్రొత్త మలుపు తిప్పవచ్చు. జేసన్ కి కూడా ఒక హెల్ప్ దొరకొచ్చు.
ఇద్దరూ కలిసి ఆయన దగ్గిరకి వెళ్ళారు. అతని చాంబర్ బైట బ్రౌన్ కలర్ నేం ప్లేట్ మీద తెల్లటి అక్షరాలు డా. స్టీవెన్ ఆర్. హౌసర్, న్యూరో సర్జన్ అని వ్రాసివుంది. హౌసర్ చిన్నవాడే ఒక 40-50 వరకు వయస్సు వుండొచ్చు. వీళ్ళని చూసి లేచి నిల్చొని, సాదరం గా ఆహ్వానించాడు. ఫెర్నాండేజ్ ఆల్ రెడీ కధ మొత్తం చెప్పేవుంచాడు కాబట్టి, ఏరన్ కి పెద్దగా కష్టం లేదు. రీసెంట్ గా జరిగినవన్నీ మళ్ళీ చెప్పాడు.
ఏరన్: జేసన్ కి కూడా క్లూలు దొరకడం లేదు.
హౌసర్: పెయింటర్ వున్నాడు గా. తానే అన్నీ చెప్పవచ్చుగా.
ఏరన్: అదే కదా చెప్పటం లేదు. అలాగని అనైటాని వదలటం లేదు.
హౌసర్: ఎందుకు పూర్తి గా చెప్పటం లేదు?
ఏరన్: తెలియదు. ఎప్పుడూ జస్ట్ గ్లింప్ సెస్ లాగ చెప్పడమే తప్ప.
హౌసర్: అయితే మనం అనైటాని హిప్నటైజ్ చేసి తనని ఏ సబ్ కాన్షియస్ లెవెల్ కి తీసుకు వెళ్తే అసలిప్పటి వరకూ ఏమి జరిగిందో చెప్పవచ్చు, కేవలం రేడియో స్టేషన్ ఎపిసోడ్ మాత్రమే కాకుండా. ఆ ఇన్ ఫర్ మేషన్ లోని ఏదైనా క్లూ లు జేసన్ కి వుపయోగపడవచ్చు.
ఏరన్: మీరన్నది కరక్టే. కానీ, తనకు ఇలా జరుగుతున్నదని అనైటా కి తెలియదు. మరి దీనికి అనైటా వప్పుకోదేమొ.
హౌసర్: తనకు చెప్పి వొప్పించాలి. తాను హిప్నటైజ్ అవ్వడానికి 100% అంగీకరించకపోతే టెక్నిక్ పని చెయ్యదు.
ఏరన్: ఓకె. ట్రై చేస్తాను. అచ్చా.. నాకొక సందేహం. నిందాక ఫెర్నాండేజ్ తో మాట్లాడేటప్పుడు తాను చాలా క్రొత్త విషయాలు చెప్పాడు ఆత్మ ల గురించి, అలాగే కొంతమంది యొక్క 6th సెన్సుల గురించి. చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. సైన్స్ చాలా అడ్వాన్సుడు గా కంటికి కనబడనివాటిని తెలుసుకోవడానికి పరిశోధిస్తున్నదంటే హాట్స్ ఆఫ్.
హౌసర్: యస్. థే ఆల్ మోస్ట్ థేర్. మనిషి చనిపోయాక ఇంకా లైఫ్ వుందని చెప్పే పరిశోధనల్లో కొన్ని క్రొత్త విషయాల్ని వెలుగులోకి తెచ్చారు.
యునైటడ్ కింగ్ డం (యు.కె) నుండి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ హేంప్టన్ లోని కొద్దిమంది సైంటిస్టులు యు.కె, యు.యస్.ఎ.మరియు ఆస్ట్రియా దేశాలలో మొత్తం 15 హాస్పిటల్స్ లో గుండెపోటు తో బాధపడుతున్న మనుష్యుల మీద హాస్పిటల్ సిబ్బంధి సహాయంతో కొన్ని విషయాలను సేకరించారు. చాలా ఇంట్రస్టింగ్ సేకరణ. కొంతమంది చనిపోయారు, మరికొంతమంది క్లినికల్ గా చనిపోయి అంటే గుండె కొట్టుకోవడము ఆగి.. డాక్టర్ల సాధనలతో మళ్ళీ పునర్జీవాన్నిపొందారుట. తిరిగి పునర్జీవాన్ని పొందినవారు వారు తాము తమ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందామని చెప్పారుట, దానికి తగు ఉదాహరణలు అంటే వారు చనిపోయాక మరియు తాము పునర్జీవాన్ని పొందడానికి ముందు మధ్యలో హాస్పిటల్ రూం లో జరిగినవి, తాము విన్న సౌండ్స్ తో సహా చెప్పారుట, ఒక్కసారి మళ్ళీ గుండె కొట్టుకోవడం మొదలు పెట్టాక. వారి చెప్పింది చూస్తే అంతా కరెక్ట్. ఇలా పునర్జీవాన్ని పొందిన మరి కొందరు స్పష్టం గా చెప్పలేకపోయారు గాని, ఏదో ఒక క్రొత్త అనుభవాలకి లోనయ్యము అని చెప్పారుట. వా ళ్ళు క్లినికల్ గా డెడ్ అయ్యి మళ్ళీ మూడు నుముషాల్లో పునర్జీవాన్ని పొందినప్పుడు ఆ మూడు నిమిషాల్లో జరిగినవి వా ళ్ళు దూరం గా నిలబడి చూశారుట. మనిషిశరీరం చచ్చి బెడ్ మీద పడివున్నప్పుడు దూరం గా నిలబడిన దేమిటి? వారి ఆత్మ కాక ! గుండె ఆగిపోయినా మళ్ళీ దాన్ని పనిచేయించడానికి మెడికల్ గా ఇంకా వ్యవధి వుండడం వల్ల, డాక్టర్లు వాళ్ళ సాధనలు వాళ్ళు చేస్తూ పోయారు. ఆ సాధనలకు గుండె కొట్టుకోవడము మొదలయేసరికి ఆత్మ మళ్ళీ యధాస్థానానికి శరీరం లోకి రాగానే బ్రెయిన్ పని చేసి వాళ్ళు పునర్జీవితులయ్యారు.
ఏరన్: దిగ్బ్రాంతి తో విన్నాడు. డాక్టర్ ఇందులో ఏది ముందు జరిగింది?
హౌసర్: ఇది ముందు, ఇది వెనుక అని చెప్పడం కష్టం. ఇవన్నీ సిరీస్ ఆఫ్ ఫంక్షన్స్. ఒకదానితో ఒకటి వెంటవెంటనే జరిగేవి. ఈ వా ర్త ఎన్నో పేపర్స్ లోనూ, మెడికల్ జర్నల్స్ లో కూడా వచ్చాయి. ఇప్పటివరకూ ఇంతే తెలిసింది. ఇంకా ఎన్నో డీప్ స్టడీస్ చెయ్యాలి.
ఏరన్ చాలా ఉత్సాహంతో ఎంతో హోప్స్ ని పెంచుకున్నాడు. అయితే డా. హౌసర్ చెప్పినట్లు అనైటాని వప్పించ గలిగితే ..కేసు వివరాలు బయట పడిపోతాయి. పెయింటర్ ఆత్మ మాకు తప్పకుండా సహకరిస్తుంది. కాకపోతే దానికి మేమే ఒక మార్గాన్ని వేయాలి.
అక్కడినుండి ఫెర్నాండేజ్ తో బయటపడి అనైటాని అప్పుడే పిలిచి మాట్లాడదామని నిర్ణయించుకున్నారు. టైము సాయంత్రం ఏడున్నర. ఇద్దరూ వాటర్ ఫ్రంట్ దగ్గిర ఒక మంచి రెస్టారెంట్ లో కూర్చొని జాజ్ మ్యూజిక్కు రిలేక్స్ అవుతూ అనైటాని కూడా అక్కడికే డిన్నర్ కి వచ్చేయమని పిలిచారు. అనైటా పావుగంట వ్యవధిఓ అక్కడకు చేరుకున్నది. తాను కూడా జాజ్ మ్యూజిక్కుని, అందమైన సాయంత్రాన్ని రిలాక్స్ అవుతూ ఎన్ జాయ్ చేస్తోంది. అప్పుడే ఏరన్ సడన్ గా పెయింటర్ ఇంకా ఏమన్నాడు అని అడిగాడు. ఆసడన్ చేంజ్ కి ఒక సెకను ఆగి, మళ్ళీ నవ్వేసింది అనైటా. ముగ్గురూ కావలసిన ఫుడ్డు ఆర్డర్ చేసుకొని.. అపటైజర్స్ తింటూ మాటల్లో పడ్డారు. అనైటా ఇంకా ఫెర్నాండేజ్ ని పరిచయం చెయ్యలేదేమిటా అని అనైటా అనుకుంటున్నంతలో..
ఏరన్: బై ద వే.. హి ఈజ్ ఫెర్నాండేజ్ ఎ రైటర్ అండ్ మై ఫ్రెండ్.
అనైటా: నైస్ టు మీట్ యు. ఐ యాం తింకింగ్ వై యు లేట్ టు ఇంట్రడ్యూస్ మి టు హిం?
ఏరన్: వెయిటింగ్ ఫర్ థ రైట్ టైం, యు ఆర్ ఎంజాయింగ్ థ మ్యూజిక్ యాస్ సూన్ యాస్ కం.
అనైటా: యా, ఐ యాం సో టైయార్డ్ విథ్ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ గోఇంగ్ ఆన్ ఇన్ మై బ్రెయిన్. కాస్త ఈ అందమైన సాయంత్రం చక్కటి జాజ్ వినగానే ఎంతో హాయనిపించి ఎక్కడికో వెళ్ళిపోయాను, సారీ అబౌట్ ఇట్.
ఫెర్నాండేజ్: (నవ్వుతూ) అది మేము గమనించే డిస్టర్బ్ చెయ్యదలచుకోలేదు.
ఏరన్: పెయింటర్ గురించేనా ఆలోచనా?
అనైటా: అవును. చాలా కలవరం గా వుంది, పాపం చిన్నపిల్లలు.
ఏరన్: అనైటా, ఇది జరిగిపోయి ముప్ఫై ఏళ్ళకు పైగా అయిపోయింది, ఇప్పుడే ఫ్రెష్ గా జరుగలేదు. ఎందుకంత కలవరం?
అనైటా: అంటే నీ కేమీ బాధలేదా?
ఏరన్: జాలి వుంది, అంతకన్నా ముఖ్యం గా జరుగుతున్నదంతా చూస్తుంటే ఆశ్చర్యం, దిగ్బ్రాంతి. ఈ ఫీలింగ్స్ ని ఎలా మిస్సవుతున్నావ్? కలవరం దేనికి కలుగుతుంది?
అనైటా: కలవరం. నిజమే ఎందుకో చాలా కలవర పడుతున్నాను.
ఏరన్: ఎందుకంటే నీ 6 సెన్స్.. పెయింటర్ ఆత్మ సెన్సెస్ లేదా అతీంద్రియ శక్తులతో అనుసంధానమయ్యింది. అందుకే పెయింటర్ కలవరపడుతుంటే, నువ్వూ కలవరపడుతున్నావు. ఎందుకు పడుతున్నావో నీకూ తెలియడం లేదు. అందువల్లనే మాకున్న ఫీలింగ్స్ నీకు కలగడం లేదు, సహజత్వానికి దూరమవుతున్నావ్!
అనైటా: వ్వాట్? నాకేం జరిగింది?
ఏరన్: యస్.
అనైటా: నాకేం అర్ధకావడం లేదు.
ఏరన్: ఇప్పుడర్ధం కాదు, ముంద్ ముందుకి నీకే అర్ధమవుతుంది మామాట కాస్త వింటే. ఈ కేసు నీ చేతిలోనే వుంది. జేసన్ కి కూడా నువ్వే హెల్ప్ చెయ్యగలవు.
ఫెర్నాండేజ్: అవును అలైటా. ఏరన్ చెప్పేది ముమ్మాటికీ నిజం. పెయింటర్ ఆత్మ ఘోష ని వినగలిగే శక్తి మీ బ్రెయిన్ కి వుంది. ఇదంతా ఒక సైన్స్.
అనైటా: సైన్స్? ఏవో మూఢ నమ్మ్మకాలని నాపై మీరిద్దరూ రుద్దుతున్నట్లుగా నా కనిపిస్తున్నది.
ఫెర్నండేజ్: లేదు అనైటా. ఈ కేసుకి పెర్ఫెక్ట్ సొల్యూషన్ మీవల్లనే దొరుకుతుంది..
అనైటా: ఏమంటున్నారు మీరిద్దరూ?
తాను గూగుల్ లో చేసిన సెర్చ్ దగ్గిర నుండి ఇక ఫెర్నాండేజ్ ని కలిసి ఆ పై డా. హౌసర్ వరకూ, అలాగే అనైటా పైన వివిధ ప్రశ్నలను అడిగి, వివిధ కోణాల్లో తాను రాబట్టిన విషయాలను కూలంకషం గా ఏరన్ వివరించాడు. అనైటా దిగ్బ్రాంతిని చెందింది. నాకు తెలియకుండా ఇంత పరిశోధన చేశావా?
ఏరన్: యస్. అదీ కూడా ఫెర్నాండేజ్ సహాయంతో. కాబట్టి నీ ద్వారానే విషయాలన్నీ తెలుసుకోవాలి. నీ కోపరేషన్ ఎంతైనా అవసరం, డా. హౌసర్ ని మనం కలవాలి ఆయన సలహా ప్రకారం నువ్వు ఆయనకి సహకరిస్తే మనకన్ని విషయాలు బయటపడతాయి, ఏమంటావ్?
అనైటాకి ఒక ప్రక్క ఇదంతా బుర్ర గిర్రున తిరుగుతున్నది. మరో ప్రక్క ఆ కేసు తన వల్ల ఒక కొలిక్కి వస్తున్నదంటే కూడా ఒక ఆనందం. అందుకే తడబడకుండా “సరే” .. అని అంది.
అనైటా వప్పుకున్నందుకు ఏరన్ కి, ఫెర్నాండెజ్ కి కొండంత బలమొచ్చింది. ఇక జేసన్ ని కలిసి తనని సహకరించమని అడగాలి, కానీ ఎక్కడో పోలీసు కదా ఇవన్నీ నమ్ముతాడా అనిపించింది. కానీ పోలీసోడికి 6th సెన్స్ ఎంత స్ట్రాంగ్ గా వుంటుందంటే నేరం నిర్ధారణ జరిగేలోపల నేరస్థుడెవడో చెప్పగలగాలి. అది పోలీసోడికి వుండాల్సిన లక్షణం. ఏరన్ కి ఇప్పుడర్ధమవుతుంది.

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *