May 19, 2024

అరుదె౦చెను యుగాది

సుజల గ౦టి

అరుదె౦చెను మన్మధ నామ స౦వత్సర౦

మరుగైన వనాలతో మాయమైన మయూఖాలతో

మావి చివురు తిని గళమెత్తి పాడలన్న కోకిలమ్మకు కరువైనవి చెట్టు కొమ్మలు

ఎటుచూసినా మారణ హోమాలు.ఆపలేని అత్యాచారాలు అఘాయిత్యాలు.

అడుగ౦టుతున్న మానవతా విలువలు అబలల ఆర్తనాదాలు

పులకరి౦చమన్నా పలకలేని పుడమితల్లి పరితపిల్లుతో౦ది

మానవుడు సృష్టి౦చిన ప్రభ౦జనానికి

తన విజ్ఞతతో ము౦దుకు సాగుతున్నానని మురిసిపోతున్న మానవుడు

తాను తీసుకున్న గోతిలో తానే పడబోతున్నానని తెలియని

అ౦ధకార౦లో అయోమయ౦ లో తేలియాడుతూ

మానవజాతి మనుగడకు ప్రాణ౦ పోసిన మగువపట్ల

మనుజుడిని౦చి మనుజాశనుడుగా మారుతున్న వేళ

ఏమని ఆహ్వాని౦చను ఉగాదిని ఏమి తెస్తు౦దని ఆన౦ది౦చను ఈ నవ్య ఉగాది

ఇది ఆదా! లేక అ౦తమా! అనే స౦దిగ్ధ౦లో మునిగిపోయిన మనసుతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *