May 19, 2024

కృషీవలా

రచన: ఉమా పోచంపల్లి.

నేటికి యెన్ని దినములైనవో
ఆకలితో నుండు మాకు
కూటికి యన్నము పండించి
చీకటి బ్రతుకుననుభవించితివీవు!

కటకటా కన్నుల నిండ నీరు
పెల్లుబికి వచ్చు గ్రీష్మమునందు
వర్షములు కురియుచున్నవి
బీటలువారిన నేలయదేల తడవకున్నదో

అధికస్య యధికఫలం బనుచు
యున్న గింజలన్ని నేల జల్లితి
వేదీ ఒక్క గింజయు చేరలేదు కదా
వేరులూనగా నేలతల్లి యెదన

గున్నమామిడి చెట్టుకొమ్మన
కన్నులరమోడ్చినటుల
కట్టకడకు ఏల ఈ విధమున
చెట్టువలెనుండెడి వాడవు

చెట్టునే వ్రేళ్ళాడుచుంటివి, నిర్గమించి ఇలను,
మూగవోయెనదె కోయిల గళమ్ము
చెంతచేరెనోయి అసువులు బాసితివని
అశృవులు చిందిచు పశుపక్ష్యాదులు

దూరదేశమునందు నేనందించు
సాంత్వనంబుతో నీ బాధనే విధి తీర్చగలను?
హృదయమంతయు భారమై
భావన యంతయు నీవెయైనావు కదనోయి రైతన్నా…

1 thought on “కృషీవలా

Leave a Reply to Uma G Ji Cancel reply

Your email address will not be published. Required fields are marked *