April 26, 2024

ప్రసిద్ధ వాడపల్లి లక్ష్మీనృసింహ స్వామి

పుష్యమిసాగర్                                                       మా చెల్లెలు ఎప్పటినుంచో అడుగ్తున్న “వాడపల్లి” టూర్ ని మొన్న మార్చ్ లో వెళ్ళడం జరిగింది. ఎండలు మండిపోతున్నాసరే వెళ్లి తీరాల్సిందే అన్నప్పుడు ఇంకో ఆప్షన్ లేదు కదా…ఓ వర్కింగ్ డే ని త్యాగం చేసి ఉదయాన్నే […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 6

టేకుమళ్ళ వెంకటప్పయ్య   శ్రీవేంకటేశ్వరుని అన్నమయ్య కీర్తించిన సంకీర్తనాలయంలో, వారి కుమారులు, మనవళ్ళూ ఆ ఆ”లయ” ప్రాకారాలైతే … శ్రీయుతులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి, గౌరిపెద్ది రామసుబ్బశర్మ, ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గార్లు నాలుగు మూల స్థంభాలుగా భావించవచ్చు. అన్నముని వేవేల స్వరసంకీర్తనాజ్యోతులు అజ్ఞానాంధకారంలో మునిగిఉన్న భక్తులకు సదా ఆధ్యాత్మిక జ్ఞానమార్గాలుగా.. ఉషోదయ కిరణాలుగా.. ఎన్ని తరాలు మారినా … ఎన్ని శతాబ్దాలు గతించినా నిత్య నూతనంగా, మార్గదర్శకంగా, ప్రకాశిస్తూనే  ఉంటాయి. మానవుడు ఏ దు:ఖమూలేని నిత్యమైన […]

“వరాళి” రాగ లక్షణములు

భారతీప్రకాష్   ఈ రాగం 39.వ. మేళకర్త రాగం. కటపయాది సంఖ్య కోసం ఈ పేరుకు ముందుగా “ఝాల” అని పెట్టారు. ఈ రాగం ఏడవ చక్రమైన “రిషి” లోని మూడవ మేళకర్త రాగం. వివాది మేళ రాగాలలో ఇది ఒకటి. అమూర్చనకారకమేళరాగం. ఆరోహణ:సరిగమపదనిస. సగరిగమపదనిస. అవరోహణ:స. ని ద ప మ గ రి స ఈరాగం లో “స రి గ మ” అనే ప్రయోగం వివాదిత్వం కాబట్టి ” స  గ  రి  […]

రజియా …..      

కె.యన్.మూర్తి అసుర సంధ్య వేళ. అది బీదర్ కోట. విశాల ప్రదేశంలో కోటను  రెండు భాగాలుగా నిర్మించారు. ముందు వైపు కొత్త కోట. దాని వెనుక దూరంగా పాతకోట. చరిత్రకు సాక్ష్యాలుగా కోట లోపల రకరకాల కట్టడాలు. కోట గోడను ఆనుకొని చుట్టుతా శిధిల భవనాలు. మొండిగోడలు, కూలిన భవనపు శకలాలు…. చెల్లా చెదురుగా పడిఉన్నాయి. కోటను చూసేందుకు అక్కడికి వెళ్ళిన మేము ఆ ప్రాంతమంతా కలియ తిరిగాము. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు మొదలవడంతో చెరసాల […]

ఇలాక్కూడా మనుషులు…!                                     

డా. కోగంటి విజయబాబు అరుణాచలం ఈ వూరు వచ్చి సంవత్సరం దాటింది. ఆర్నెల్ల క్రితం బాంక్ లో రిటైరై ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాడు. రోజూ మేడపైన సాయంత్రంపూట తిరగటం బాగా అలవాటు. ఎదురింటి మేడ పైన రెండు పోర్షన్లు. ఈమధ్యనే వాటిలోకి ఎవరో చేరారు. తప్పకుండా వాటిలో ఒకదానిలో బాంక్ ఉద్యోగులు వస్తూఉంటారు. పరామర్శగా చేయి ఊపుతూ పచార్లు చేస్తూ ఉంటాడు. వారి ఇంటి ఓనరు పేరు విశాల. అరుణాచలం పనిచేసిన బాంక్ లోనే పనిచేస్తోంది. వాళ్ళాయన […]

ఆలి కోసం అలికిడి

శ్రీధర మా  వాడు మేధావి  అవునో కాదో  నేను చెప్పలేను కానీ, మేధావికి ఉండాల్సిన అవలక్షణాలు – అదే లెండి లక్షణాలు  పుష్కలంగా ఉన్నాయి. కొంచెం మతిమరుపు, కొంచెం బద్ధకం  కొంచెం నిర్లక్ష్యంలాంటి సద్గుణాలన్నీ ఉన్నసకల కళ్యాణ గుణాభిరాముడు మావాడు. ఇవన్నీ కలిసొచ్చి కళ్యాణానికి ఎప్పటి కప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నాయి. జీవితం దాదాపు ఇంటర్వెల్  దాకా వచ్చినా పెళ్లి కాకపోవడానికి పైన చెప్పిన లక్షణాలే కారణం. ’నెట్’  లో ఎప్పటికప్పుడు అమ్మాయిలతో చాట్ చేస్తునే ఉన్నాడు. […]

ఎగిసే కెరటం-3       

డా. శ్రీసత్య గౌతమి   [జరిగిన కధ: అతి తెలివైన సింథియా ఏమాత్రం ఆలశ్యం చేయకుండా గిరి గీసి రాకేష్ ను అందులో ఉంచేస్తేనే మంచిది, లేకుంటే మొగుడు అనే డెసిగ్నేషన్ ని పెట్టుకొని చంకనెక్కుతాడని వెంటనే ఊహించి, వంట చెయ్యను పొమ్మంది. కానీ తన లంచ్ లో మిగిలిపోయిన పిజ్జా ముక్కని రాకేష్ కి డిన్నర్ లో ఆఫర్ చేసింది. ఇండియాలో ఈజీ గా చటర్జీ దగ్గిర తనకి నచ్చినట్లుగా ఉద్యోగం చేసుకోగలిగింది, ఆ నైపుణ్యం […]

మాయానగరం 27  

భువనచంద్ర నన్ను నేను పోషించుకోలేని కుచేలుడ్ని. దరిద్రం అనే మొసలి బారిన పడ్డ గజేంద్రుడ్ని. అభిమానాన్ని కాపాడే దుర్యోధనుడి లాంటి స్నేహితుడు దొరకని కర్ణుడ్ని. ఎంత హింసను అనుభవించినా దైవదర్శనం  లభించని భక్తుడ్ని. నన్ను ప్రేమించద్దు. నన్ను గౌరవించనూ వద్దు. కేవలం నన్నో ‘జీవి ‘ లా చూడంది. మనిషిలా చూడకపోయినా ఫర్వాలేదు. “అంటే ఏం చేయమంటారు?” అన్నాడు విసురుగా శామ్యూల్ రెడ్డి. “అయ్యా! మీరో గొప్ప మానవతావాది … ఓ గొప్ప స్కూలు నడుపుతున్నారు. నేను […]

శ్రీకృష్ణదేవరాయ వైభవం           ఎపిసోడ్-2

  రాచవేల్పుల విజయభాస్కరరాజు శ్రీ కృష్ణదేవరాయల వారి జన్మ దిన తేదీలపై, ఆ మహనీయుని వయస్సు పై రక రకాల వాదోప వాదాలున్నాయి. కవులు, రచయితలు ఎవరికి తోచిన విదంగా వారు సదరు తేదీని, వయస్సును నిర్ణయిస్తూ వచ్చారు. వారి వారి వాదనలకు మద్దతుగా ఎన్నెన్నో ఆధారాలను క్రొడీకరించారు. అయితే అవన్నీ నిరాధారాలే. కృష్ణదేవ రాయల వద్ద నున్న అష్టదిగ్గజాల్లో ప్రధాన కవివర్యులైన అల్లసాని పెద్దన గారు ఒకానొక పద్యము ద్వారా శ్రీ కృష్ణ దేవ రాయలు […]

శుద్ధ కవిత్వ భాషలో జరిపిన సుదీర్ఘ సంభాషణ – ఇందిరకవిత్వం

సమీక్ష: రామాచంద్రమౌళి   From the Biography of an Unknown Woman                                        – Indira Babbellapati     కవిత్వం రకరకాలుగా నిర్వచించబడి మనిషి ఆవిర్భావం నుండి ఇప్పటిదాకా ఒక అతీత భావస్పర్శకోసం నిరంతరం అన్వేషిస్తూనే కవిత్వాన్ని కేవలం ఒక అనుభవైకవేద్యమైన రసాత్మక మహానుభూతిగా మాత్రమే స్వీకరిస్తూ రకరకాల రూపాలతో,శైలితో, వ్యక్తీకరణలతో,ప్రతీకలతో,అనేకానేక నైరూప్య మార్మిక అభివ్యక్తులతో కేవలం శరీరంతో మాత్రమే కాక హృదయంతోకూడా జీవించే వ్యక్తులకోసం రసభాషగా కొనసాగుతూ వస్తూనేఉంది యుగయుగాలుగా.దేశాలు,ప్రాంతాలు,నాగరికతలు,భౌగోళిక నేపథ్యాలు..ఇవేవీ కవిత్వ సంగ్రహణా…అనుభవ దాహానికి ఎప్పుడూ అవరోధాలు కాలేదు.ఎక్కడ ఒక వాక్యం రసాత్మకంగా వెలువడ్డా సకల సరిహద్దులనూ చెరిపేస్తూ అక్షరాన్ని కవిత్వం ప్రజ్వరిల్లజేస్తూ కవిత్వ ప్రక్రియను విశ్వజనీనం చేస్తూనే ఉంది.ఆ పరిణామ వికాసాలను మెట్లు మెట్లుగా అధిరోహిస్తూ కవిత్వ సృజన ఆధునికంగా..అత్యాధునికంగా…ఆధునికోత్తర సాహిత్య ఉద్గారతగా తన రూపురేఖలను వికిరణ పరుస్తూ భాసిస్తూ వస్తూనే ఉంది.ఆ క్రమంలో కొన్ని సంక్లిష్టతలు…కొన్ని అనిర్ధుష్టతలు…కొన్ని అస్పష్ట సంలీనతలు…వీటన్నింటినీ ప్రవాహీకరించుకుంటూ చొచ్చుకొస్తూనే ఉంది కవిత్వ సృష్టి.   ఈ ఇరవైయ్యవ శతాబ్దిని దాటుతున్న కాల క్రమంలోప్రసిద్ధుడూ, మనకంటే వరిష్ఠుడూ ఐ న టి ఎస్ ఇలియట్ … తదనంతర ఈనాటి యువ కవిత్వ సృజనకారులు “కవిత్వాన్ని” నిర్వచిస్తున్న తీరును గమనించండి.   T.S. Eliot: “Poetry is not a turning loose of emotion, but an escape from emotion; it is not the expression of personality, but an escape from personality. But, of course, only […]