May 19, 2024

అన్వేషణ

రచన: సుపర్ణ మహి చిగురు పచ్చని దుప్పటి కప్పుకుని పడుకున్న కొండ సానువుల నడుమ అలవాటుగా సుడులు తిరిగే చల్లగాలిలా నడిచొస్తుంది డాబా మీదకి…. చెప్పడానికి నేను మాటలన్నీ సిద్ధం చేశాక, మౌనం వొదిలిన యోగి ఆర్తితో మోకరిల్లిన ఆరాధకుణ్ణి చూస్తున్నట్లుగా అంటుంది… ‘సారీ రా చాలా లేటయింది కదా…’ గడిచిపోయిన కాలమంతా కూడబలుక్కుని మిగిల్చిన అద్భుతం కదా ఇది… ఎవరికి గుర్తుంటుంది ఆలస్యం అనడానికి యుగాల క్రితం మొదలయిన ఈ అన్వేషణకి మొదటి నిముషం ఎప్పుడు […]

ఉగాది కవితలు – సాధారణ ప్రచురణ

ఉగాది సందర్భంగా మాలిక పత్రిక నిర్వహించిన కవితలపోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైనవి: జీవితం -ప్రతాప వెంకట సుబ్బారాయుడు జీవితం ఇంద్రధనుస్సులా ఆకర్షణీయంగా కనిపించాలి ఆనందాంబుధిలో అనుక్షణం ఓలలాడాలి మధుర తాయిలాలని ఒక్కసారన్నా రుచిచూడాలి సౌగంధికపుష్ప సుకుమారత్వం అణువణువునా గోచరించాలి పంచేంద్రియాలను మధురానుభూతుల భావనలు ముప్పిరిగొనాలి ఇలాంటి అందమైన అనుభూతులన్నీ మనకి కావాలనుకుంటే ఎలా? షడ్రుచుల కలయికే జీవితం అన్న స్థితప్రజ్ఞత అలవడడానికే వత్సరానికోసారి షడ్రుచులపచ్చడి సందేశం వర్తమానం ఎలావున్నా..భవిష్యత్తుపట్ల జాగరూకత ఎరకపరచేదే పంచాంగశ్రవణం ఎండలు మండిపోతున్నా_ కమ్మని […]