May 7, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 7

రచన:- టేకుమళ్ళ వెంకటప్పయ్య దైవీభావము నిండిన శరీరము మాత్రమే విషయవాంఛలకు దూరమై ఉంటుందన్న విషయం అందరూ ఎరిగినదే! వంచన, కపటము వంటి దుర్గుణములు మనిషికి సర్వ సాధారణం. మనము పంచ జ్ఞానేంద్రియముల ద్వారా.. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మముల ద్వారా అనుభవించే పంచతన్మాత్రలు అంటే చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శలు, మనస్సులో విషయాలుగా పరిణామం చెందుతాయి. ఈ జ్ఞానేంద్రియాలవల్ల కాక మనకు వేరే ఏ విధంగానూ బయటి విషయాలు లోపలికి చేరవు, మనస్సుకి అందవు. […]

లేకితనం .

రచన. ఆదూరి.హైమావతి. తిరుమలరావు తిరుపతికి మొక్కు తీర్చుకోవడానికి కుటుంబంతో సహా బయల్దేరాడు. ముందుగానే కల్యాణోత్సవానికీ, తోమాల సేవకూ, సుప్రభాత దర్శనానికీ, వసతికీ కూడా గదులు ‘ఆన్ లైన్ ‘ లో బుక్ చేసుకుని, మరీ బయల్దేరాడు. వసతి గదిలో దిగి స్నానపానాదులు పూర్తి చేసుకుని , కల్యాణోత్సవానికి వెళ్ళి వచ్చాడు , భోజనాదికాలూ కానిచ్చి ఆ తర్వాత , చుట్టూ చూస్తూ విశ్రాంతిగా వరండాలోని కుర్చీలో కూర్చున్నాడు.   తిరుమలరావు శ్రీమతి- సీతాలక్ష్మి చాలా కలుపుగోలు ఇల్లాలు.ఇరుగూ […]

సంస్కరణ (కథ )

రచన : జీడిగుంట నరసింహ మూర్తి “బాబూ మీ హోటల్లో కాఫీ ఒక్కటే ఆర్డర్ ఇస్తే తీసుకు రారా ?” అంటూ కొద్దిగా కోపంగానే మొహం పెట్టి అడిగాడు గోపాలం సర్వర్ వైపు చూస్తూ. తను సంధించిన ప్రశ్న ప్రొప్రయిటర్ కూడా విన్నాడా లేదా అని అటువైపు కూడా చూసాడు. ప్రొప్రయిటర్ నిర్లక్ష్యంగా డబ్బులు లెక్కెట్టుకునే పనిలో బిజీగా వున్నాడు. . అప్పటికే గోపాలం ఆ హోటల్ కి వచ్చి అరగంటకు పైగా అయ్యింది. “అవతల పెద్ద […]

సారంగ పక్షులు

రచన: టి.వి. యస్. శాస్త్రి   (మహాభారతం లోని ఈ కధను మీరు ఎప్పుడైనా విన్నారా?వినకపోతే తప్పక ఇది చదవండి!) పురాణాల్లో కొన్ని కధల్లో కొన్ని పక్షులు ,జంతువులు  మనుషుల్లాగే మాట్లాడుతుంటాయి. అంతే కాదు కొన్ని సార్లు మేలుచేసే సూచనలు ఇస్తాయి. మరికొన్ని సార్లు వేదాంతపరమైన భాషణలు కూడా చేస్తుంటాయి.పురాణాల్లో ఉన్న ఈ అద్భుత కధలు వింటానికి ఉత్సాహంగా కూడా ఉంటాయి. పక్షులు,జంతువులు మాట్లాడే కధలు చిన్న పిల్లలకు చాలా ఇష్టం.కానీ పురాణాలు మాత్రం పెద్దవారు చదవటానికి […]

కమాస్ రాగ లక్షణములు

రచన: భారతి ప్రకాష్   ఈ రాగము 28.వ. మేళకర్త రాగమైన హరికాంభోజి నుండి పుట్టిన జన్య రాగం. ఆరోహణ – స మ గ మ ప ద ని స. అవరోహణ – స. ని ద ప మ గ రి స షడ్జమ, పంచమాలతో కలసి ఈ రాగం లో వచ్చే స్వరాలు : చతుశృతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి దైవతం, కైశికి నిషాదం మరియు కాకలి […]

రహస్యం – లలిత భావ నిలయ

రచన: విశాలి పెరి 1967 లో విడుదలైన సంగీత, సాహిత్యాల అపురూప మేళవింపు ‘రహస్యం ‘ . ఈ సినిమాలో నాగేశ్వర రావు, ఎస్. వి. రంగా రావు, కృష్ణ కుమారి, బి. సరోజాదేవి నటించారు. సంగీతము అందించినది ఘంటసాల గారు. సాహిత్యం మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు. మల్లాదివారు పదునాగులు భాషలూ తెలిసిన నిపుణులు. సంస్కృతము, తెలుగులో విధ్వాంసులే. వారు వ్రాసిన పాటలలో ‘అచ్చ తెలుగు ‘ పదాలు చాలా ఉంటాయి. నాగేశ్వరరావు గారు అంతవరకు ఒక […]

॥ కొన్ని రాత్రులు॥

సమీక్ష:-వాణి కొరటమద్ది విలక్షణమైన కవిత్వం సున్నితమైన భావప్రకటనకు కవిత్వం అద్భుత సాధనం మనసులోని భావాలను అలవోకగా అక్షరీకరించుకునే అవకాశం వచన కవిత్వం. సమాజాన్ని చైతన్య పరిచే సాహితీ ప్రక్రియ కవిత్వం. ప్రత్యేకమైన వస్తు వైవిధ్యంతోమనసు స్పర్శించే భావాన్ని అక్షరాల్లో పొదిగి మాల గుచ్చినట్లుగా మన ముందుకు తెచ్చారు పుష్యమీ సాగర్ గారు “కొన్ని రాత్రులు”. ఓ మనసుకు కవిత్వంపై ఆసక్తి కలిగిందంటే వారికి సామాజిక సృహ అధికమై వుండాలి. లేదంటే మరువలేని గాయపడ్డ సందర్భమైనా ఉండాలి. ఇది […]

పాఠకులకు నవ్వుల నజరానా అమెరికా ఇల్లాలి ముచ్చట్లు

సమీక్ష: సి.ఉమాదేవి   ఆనాడైనా ఈనాడైనా ఇల్లాలి ముచ్చట్లు సరదాల సరాగమాలలే!అమెరికా ఇల్లాలి ముచ్చట్లు  అక్కడి కష్టసుఖాల సమతూకాన్ని పారదర్శకం చేసే జీవనవిధానానికి అక్షరవేదికగా మలిచిన చక్కటి రసరమ్య హాస్యగుళికలు.  పురాణంవారి ఇల్లాలి ముచ్చట్టు అందించిన స్ఫూర్తితో అమెరికా ఇల్లాలి ముచ్చట్లు రచించిన శ్యామలాదేవి దశిక మరోమారు ఇల్లాలి ముచ్చట్లు రెండవభాగాన్ని మనకు అందిస్తున్నారు.  మరిన్ని హాస్యజల్లులు కురిపిస్తూ సరికొత్త ప్రయోగంగా  శ్రీవారితో సంభాషణే కథాకళియై చతురోక్తులతో అలరిస్తుంది ఈ పుస్తకం. కథ రాయాలంటే కథాంశం ముఖ్యం. […]

ప్రమదాక్షరి – కధామాలిక -2 || తరాలు-అంతరాలు ||

సమీక్ష:-ఇందిర గుమ్ములూరి, పి.హెచ్.డి. (తెలుగు లిట్.) ఈ పుస్తకాన్ని చూడగానే మాలతీచందూర్ గారి ‘ప్రమదావనం’ గుర్తుకొచ్చింది. ఆడవాళ్ళకోసం ఆడవాళ్ళు రచించిన కధల సంపుటి ఇది. ఇందులో 17 కధలున్నాయి. ఇందులో రచయిత్రులందరూ ఆడవాళ్ళ సమస్యలను, వారి అంతరంగాల్లోని వివిధ భావాలని, వాళ్ళ మానసిక వేదనలని, కాలంతో వచ్చే మార్పులని, సంఘం కట్టుబాట్లని, వాటికి తలొగ్గి గెలుపోటములని సమన్వయ పరచుకొన్న విధానాన్ని, వారి మానసిక పరిస్థితులని చాలా చక్కగా వివరించారు. కధాంశాలన్నీ స్త్రీల చుట్టూ, వారి అంతరంగాల చుట్టూ, […]

కృషీవలా

రచన: ఉమా పోచంపల్లి. నేటికి యెన్ని దినములైనవో ఆకలితో నుండు మాకు కూటికి యన్నము పండించి చీకటి బ్రతుకుననుభవించితివీవు! కటకటా కన్నుల నిండ నీరు పెల్లుబికి వచ్చు గ్రీష్మమునందు వర్షములు కురియుచున్నవి బీటలువారిన నేలయదేల తడవకున్నదో అధికస్య యధికఫలం బనుచు యున్న గింజలన్ని నేల జల్లితి వేదీ ఒక్క గింజయు చేరలేదు కదా వేరులూనగా నేలతల్లి యెదన గున్నమామిడి చెట్టుకొమ్మన కన్నులరమోడ్చినటుల కట్టకడకు ఏల ఈ విధమున చెట్టువలెనుండెడి వాడవు చెట్టునే వ్రేళ్ళాడుచుంటివి, నిర్గమించి ఇలను, మూగవోయెనదె […]