May 18, 2024

చేయగలిగేదేముంది?

రచన:-భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు

అజ్ఞానమే తప్పవిజ్ఞానం అలవడని వయసులో
ఆవేశమే తప్ప ఆలోచన జతపడని మనసుతో
కన్నవాళ్ళని కాదని,వాళ్ళఆత్మీయతను చేదని
అల్లారుముద్దుగా పెంచిన వారి ప్రేమను వద్దని
ప్రేమించుకున్నాం అనే భ్రమలో ఇరుక్కొని
కలిసితీరుతాం అనే కఠిననిర్ణయాన్ని తీసుకొని
కులగోత్రాలతో సంబంధం రద్దు చేసుకొని
వంశగౌరవాలతో అనుబంధం త్రెంచేసుకొని
కట్టుబాట్లను కాలదన్ని
వెసులుబాట్లను వెనకేసుకొని
సాంప్రదాయానికి తలవంచక
ముందువెనుకలు ఆలోచించక
మంచిచెడులు అవలోకించక
ఆవేశాన్నే ప్రేమ అనుకొని
ఆకతాయితనాన్నేధైర్యం అనుకొని
చెడుదారిని ఎంచుకోవటమే చైతన్యం అనుకొని
పెడదారిని ప్రయాణించటమే పరవశం అనుకొని
కన్నూమిన్నూ కానక
కంటున్నది కలోనిజమో తెలియక
ముందున్నది లోయోమాయోగ్రహించక
వేసే అడుగులు తడబడుతుంటే
తీసుకునే నిర్ణయాలు పొరబడుతుంటే…..
ఎటు పోతోందీ యువత అని నివ్వెరపోవటం తప్ప,
పెద్దవాళ్ళు చేయగలిగే దేముంది ఆవేదన పొందటం తప్ప!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *