May 17, 2024

జీవన యాత్రలో కనిపించిన మూడవ మనిషి

రచన: రమేష్ కార్తికేయ (స్టూడెంట్)

mudava manishi

మనమెటో వెళ్తూ ఉంటాము చడిచప్పుడు లేకుండా తుఫానులా వచ్చేస్తారు . భాయా భాయా .. పైసల్ తీయి భాయా అంటూ చెంపలు గిల్లుతూ , చప్పట్లు కొడుతూ భయపెడుతూ నవ్విస్తూ, రాబట్టుకున్న పైసలని చేతివేళ్ళ మధ్య ఇరికించుకుని దిగిపోతారు . అలా వాళ్ళ జీవితాలతో పోరాడుతూ కనిపించే మనుషులే అదేనండి మన నోటి వెంట నుండి అలవోకగా వచ్చే మాట ” కొజ్జా చక్కా ,హిజ్రా “ గురించే ఇదంతా.. నిత్యం నేను చూసే నిజాలు. మానవ సమాజంలో బహిష్కరణకు గురి అయ్యి పని చెయ్యా లనుకున్నా పని దొరకక, చివరికి తమ దేహాలని అమ్మకానికి పెట్టె ఆ మూడో మనిషి గురించే ఈ ప్రస్తావన అంతా ….
కనీసం రోబోలైనా గౌరవానికి నోచుకుంటాయి గాని మన తోటి వ్యక్తి అయినా ఆ మనిషికి ఈసడింపులు, అవమానాలు, బహిష్కరణలు ఎందుకిలా అనిపిస్తుంది వాళ్ళని రైల్లో చూసినప్పుడల్లా. అయితే వాళ్ళు మన ఆస్తులు అడిగారా ? లేదే కేవలం మగాడిగా పుట్టి ,ఆడదానిగా మారవలసి వచ్చిన పరిస్థితులమధ్య అనేక కోరికలతో స్త్రీగా బతకాలనుకోవడం తప్పని అంటున్నాము ….
కొన్నిసార్లు వాళ్ళని చూస్తే జాలి వేస్తోంది అసహ్యం కూడా కలుగుతుంది. వాళ్ళ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది కానీ వాళ్ళతో మాట్లాడితే మనల్ని కూడా వాళ్ళకింద జమకడతారని భయం వేస్తోంది. అందుకే వాళ్ళని పట్టించుకోకుండా మన మానాన మనం వెళ్లి పోతాము.
అయితే ఈ మధ్యకాలంలో రేవతి అనే రచయిత్రి ” రేవతి ఒక ఆత్మ కధ ” అంటూ వాళ్ళ జీవితాలని గురించి నిర్భయంగా రాసారు, ఎప్పటి నుంచో తన రచనలతో మార్పు కోసం ప్రయత్నిసున్న పార్సీ యోగి (ఇంగ్లీషు కవి ) గే లమీద 13 కవిత సంపుటాలు వెలువరించి ప్రపంచ ఖ్యాతి సంపాదించాడు.
అలాగే కొన్ని దశబ్దాలుగా టీవి రంగాన్ని నడిపిస్తున్నది యీ ముడో మనిషే . అది తమిళనాడులో కల్కి సుభ్రమణ్యం (సిని నటి,రచయిత్రి), రోసి(యంకర్), పద్మిని ప్రకాష్( మొదటి యాంకర్), మదు బాయి కిన్నర్(మేయర్), బి బందోపాధ్యాయ(ప్రిన్సిపల్, రచయిత్రి), విద్య(సామాజిక పొరాట కర్త ) ఓ బ్లాగ్ నిర్వహిస్తుంది.
అలాగే రేణుక అయోల గారు రాసిన”మూడవ మనిషి ” దీర్ఘ కావ్యం చదివినప్పుడు తెలుగులో నాకు తెలిసి ఇదే మొదటి పుస్తకం కవిత్వంలో అనుకుంటాను. ఈ పుస్తకం చదవడం మొదలు పెట్టి ముగించగానే ఆశ్చర్యం కలిగింది. బాధ వేసింది. వాళ్ళని ఆలా ఎందుకు అనుకున్నాను అనిపించింది . ఈ రచయిత్రి వాళ్ళగురించి ఎలా రాయగలిగారు అనిపించింది . వాళ్ళని కలిసారా? లేక వాళ్ళ బాధలలోపలికి ఈవిడ పరకాయ ప్రవేశం చేసారా? అనిపించింది .. చదువుతున్నంతసేపూ కవయిత్రిని చాలాసార్లు మెచ్చుకున్నాను.
ఈ కవిత్వం అంతా ఒక నదిలా ప్రహింప చేస్తోంది ……
ఈ దీర్ఘ కావ్యం చదివింప చేస్తుంది. నాలాంటి స్టూడెంట్ల చేత కూడా చదివించారు బోరు కొట్టకుండా.. ఈ కవిత్వంతో వాళ్ళని మనుషులుగా గుర్తించగలుగుతామా ? కానీ ఈ రచయిత్రి మాత్రం పాఠకలోకంలో వాళ్ళకో గౌరవాన్ని పెంచారు అనిపిస్తుంది. ఇది అందరూ చదవదగ్గ పుస్తకం.
నిజాయితి గల రచయిత్రి ఈమె ” రేవతి ఆత్మ కధ చదివి ” చలించి రాసుకున్న మూడవ మనిషి అంటారు. నిజమే కావొచ్చు అందుకే ఆమె కవిత్వంలో మనకి చాలా లోతైన భావాలు దర్శనమిస్తాయి. చాలావరకు కళ్ళకు కట్టినట్లు చెప్పారు.. ఒక హిజ్రా గురించి మొదలు పెట్టి ఆఖరిదాకా ఒక సినిమాలా చూపించారు. కళ్ళు చెమరించే సన్నివేశాలు 13 వ చాఫ్టర్ లో వున్నాయి ” నేను మొగవాడిని కాదు ఆడదాన్ని అన్నందుకు నాన్న కొట్టిన దెబ్బ చప్పుడుకి తల్లి పేగు కలుక్కు మనడం మనల్ని ఏడిపిస్తుంది
ఈ సన్నివేశంలో రంగనాయకమ్మ స్త్రీ పాత్ర గుర్తుకొస్తుంది . భర్తని కొడుకుని ఏమి అనలేక చితికి పోయిన స్త్రీ పాత్ర గుర్తుకొస్తుంది …
ఇప్పుడు అనిపిస్తోంది మనము మన చాదస్తాలతో వాళ్ళని తొక్కేస్తూ, చివరికి యే పని ఇవ్వక వాళ్ళ దేహాలని అమ్ముకునే స్థాయికి దిగజార్చమని .
ఒక మనిషిగా సంపూర్ణ స్త్రీగా బతకాలనుకునే ఆమెని, ఆమెలాంటి వాళ్ళని మనం అంగీకరించ కుండా వింతగా చూస్తూ వెకిలిగా నవ్వుతాము ,ఆ చూపులు, నవ్వులు గుచ్చుకుని ఆమెని భాధ పెడతాయని తప్పనిసరిగా తెలుసుకోవాలి అనిపించింది ఈ ధీర్ఘకావ్యం చదువుతున్నంతసేపూ …
ఇంకో విషయం చెప్తున్నాను ఒక హిజ్రా గురించి కొంతైనా తెలుసుకోవాలంటే రేణుక అయోలగారి పుస్తకాన్ని పలకరించాలసిందే .
రేణుక అయోల గారి ” లోపలి స్వరం” కవితా సంపుటి మా ఊరి గ్రంధాలయంలో చదివాను ఈ పుస్తకం చదివాక ఇలా కూడా అనిపించింది ఆవిడ మూడవ మనిషి లోపలి స్వరాలని మనకి వినిపించారని.. ఈ రోజుల్లో చాలా మంది మనుషుల గురించి వాళ్ళ కష్టాల గురించి మనకు తెలియదు వాళ్ళల్లో వీళ్లు కూడా ఒకరు. అలాంటి వాళ్ళ గురించి సమగ్రంగా తెలియ చేసినందుకు వారికి నా ధన్య వాదాలు ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *