July 1, 2024

మాలిక పత్రిక మే 2024 సంచికకు స్వాగతం

మాలిక మిత్రులు, పాఠకులు, రచయితలకు మాలిక పత్రిక మే నెల 2024 సంచికకు స్వాగతం… సుస్వాగతం… మా పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు.. మన తెలుగువారింట ప్రస్తుతం ఏం జరుగుతోంది.. మండే ఎండల్లో కాని, ప్రాణాలు తీసే కరోనా విలయతాండవ వేళ కాని, ఆరు నూరు నూరు పదహారైనా మానని ఒకే ఒక ప్రహసనం మీకు తెలుసు కదా.. అదేనండి ఆవకాయ.. గోవిందుడు అందరివాడేలే లాగే ఆవకాయ మన అందరిదీ… ఒకటా రెండా నాలుగా.. […]

సుందరము సుమధురము –13

రచన: నండూరి సుందరీ నాగమణి 1961 లో విడుదల అయిన ‘వాగ్దానం’ అనే చిత్రానికి ప్రముఖ మనసు కవి, పాటల రచయిత శ్రీ ‘ఆత్రేయ’ గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ బెంగాలీ రచయిత శ్రీ శరత్ చంద్ర చటర్జీ రచించిన ‘వాగ్దత్త’ అనే నవల ఆధారంగా నిర్మింపబడింది. కవితాచిత్ర పతాకం పైన నిర్మించిన ఈ చిత్ర నిర్మాతలు – శ్రీ కె సత్యనారాయణ మరియు శ్రీ డి శ్రీరామమూర్తి గారలు. దీనికి శ్రీ పెండ్యాల […]

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు 10

రచన: కొంపెల్ల రామలక్ష్మి ఈ సంచికలో కూడా మనం, లలిత గీతాలలో చేయబడిన రెండు రాగమాలికా రచనల గురించి వివరించుకుందాం. ముందుగా – ‘వచ్చెనదిగో వర్షసుందరి, నిండినది భువి హర్షమాధురి’, అనే రచన. ఈ పాట రచించిన వారు శ్రీ కందుకూరి రామభద్ర రావు గారు. సంగీతం సమకూర్చిన వారు ఎన్ సి వి జగన్నాథాచార్యులు గారు. ఆకాశవాణి కోసం మొట్టమొదట గానం చేసిన వారు కుమారి. శ్రీరంగం గోపాల రత్నం గారు. ముందుగా ఈ ముగ్గురు […]

స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -8

రచన: శ్రీమతి లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద 21. కష్టమైన నిర్ణయం వేసవి పూర్తయే వేళకు సలీం తన ఎక్జామ్ తో బిజీగా ఉన్నాడు. కాని అతను మాత్రం ఏదో పోగొట్టుకున్నట్టు కనిపించాడు. ముఖ్యంగా రాత్రిళ్ళు బాబీ విషయంలో సాయపడుతూనే ఉన్నా అతన్ని ఏం బాధిస్తోందో నాకు అర్ధం కాలేదు. తన ఎక్జామ్ రాయడానికి జూన్ లో డబ్లిన్ వెళ్ళాడు. కాని అది క్లియర్ చెయ్యకుండానే నిరాశగా తిరిగి వచ్చాడు. సలీం కొత్త జాబ్ మొదలుపెట్టే […]

ఎత్తుకు పై ఎత్తు… చిత్తు చిత్తు!

రచన: వారణాసి విజయలక్ష్మి “ఏమండీ!” ఇడ్లీ, వడ ప్లేట్ లో పెట్టి తన చేతికిస్తూ, గోముగా పిలుస్తున్న సదరు పెళ్ళాం వెంటలక్ష్మి పిలుపు విన్న ఆమె మొగుడు పరాంకుశం పరాకంతా పారిపోగా, చిరాకుని అణిచిపెడుతూ, “చెప్పండి శ్రీమతిగారూ” అన్నాడు, కళకళ్ళాడే ప్లేట్ అందుకుంటూ! ఎందుకైనా మంచిదని పెళ్ళాం నీళ్ళు నమలడం తెమిలేలోపునే, ఆబగా రెండు వడలు, రెండు ఇడ్లీలు ముఖద్వారంలోకి నెట్టేసాడు, అమ్మయ్య అనుకుంటూ! ఖాళీ అయిన ప్లేట్ నింపాలని వచ్చిన వెంకటలక్ష్మి, మొగుడి భక్షణ స్పీడ్ […]

పెళ్ళయ్యింది

రచన: గిరిజారాణి కలవల ఆ ఫంక్షన్ హాల్ అంతా కోలాహలంగా ఉంది. ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నారు. అక్కడ నిశ్చితార్థం జరగబోతున్న కాబోయే పెళ్లికొడుకు, పెళ్ళికూతుర్లు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ మైమరిచిన స్థితిలో ఉన్నారు. జరగబోయే పెళ్ళికి సంబంధించి తిథి వార నక్షత్రాలు నిర్ణయించిన పంతులుగారు, దానికి తగ్గట్టుగా పెళ్లి ఇరువైపులా వారికీ వారివారి శుభలేఖ పత్రాలను వ్రాయటానికి ఉద్యుక్తుడయ్యాడు. ముందు అనుకున్న విధంగా తాను ఇవ్వాల్సిన కట్నం డబ్బును ఒక బ్యాగ్ లో […]

బాలమాలిక – పసి మనసు

రచన: కాశీ విశ్వనాథం పట్రాయుడు సీతాలు, నర్సింహులు భార్యాభర్తలు. వారికి ఒక్కగానొక్క కొడుకు శీను. నర్సింహులు వ్యవసాయ కూలీ. శీను పుట్టిన ఏడాదికే రోడ్డు ప్రమాదంలో నర్సింహులు చనిపోయాడు. అప్పటి నుంచి పుట్టింట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తోంది సీతాలు. ఆ రోజు ఆగస్టు 15. ఊళ్ళో ఎక్కడ చూసినా మూడురంగుల జెండాలు రెపరెపలాడుతున్నాయి. దుకాణాలన్నీ దేశభక్తి భావాన్ని పెంపొందించే స్టిక్కర్లు, రబ్బరు బ్యాండ్లు రకరకాల ఆకృతుల్లో దర్శనమిస్తున్నాయి. వాటిని పిల్లలంతా డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారు. పాఠశాల ప్రాంగణమంతా మూడు […]

బాలమాలిక – మంచి తల్లిదండ్రులంటే…

రచన: మంగు కృష్ణకుమారి అనగా అనగా ఒక ఊరికి, ఒక రాజు గారు ఉన్నారు‌. రాజుగారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆయన. ప్రజలందరికీ తగిన విలువిచ్చి చూసేవారు. ప్రజలకి రాజంటే ప్రాణం. ఆయనకి ఒక కొడుకు. రాజుగారికే కాదు, రాజ్యంలో అందరికీ యువరాజుగారంటే ముద్దే! అందరూ ముద్దు చేయడం, ‌అందరూ, పొగడడం, ఆటలలో, స్నేహితులు యువరాజే గెలిచేటట్టు చేయడం వలన యువరాజుకి కొంచెం గర్వం వచ్చేసింది. స్నేహితులతో ఆడుతూ, “ఏరా బంటుకొడుకా… నీవల్ల కర్రా బిళ్ళా కొట్టడం […]

యోధ ప్రేమ

రచన: కృష్ణమాచార్యులు ఆమె బాల్యంలో యెదురైన ప్రతికూల పరిస్థితులకు కృంగిపోలేదు. మగపిల్లల అల్లరి చేష్టలకు బెదరలేదు. కామ పిశాచి వికాటాట్ట హాసాలకు భయపడలేదు. నిలిచి పోరాడింది. సవాళ్ళను ఆనందంగా స్వీకరించి శ్రమించి గెలిచింది. జగడాల మారి, రౌడీ లాంటి బిరుదులతో తోటివారు పరిహసించినా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగింది. తోడుగా నిలచిన ఒక స్నేహితుడిని, ప్రేమించినా చెప్పలేక సతమతమయ్యింది. ఓటమి యెరుగని ఆ యోధ, ప్రేమ ప్రపంచంలో గెలుస్తుందా? *** చెన్నయి విమానాశ్రయం లాంజ్ లోనికి […]

జీవనయానం

రచన: మణి గోవిందరాజుల “నాన్నా! అమ్మ వున్నన్నాళ్ళూ మాకు ఓపికలున్నాయి, అక్కడికి వచ్చి వుండలేమని రాలేదు. పోనిలే ఇద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళు వున్నారు కదా అని నేను మాట్లాడలేదు. మన దురదృష్టం అమ్మ వున్నదున్నట్లుగా మాయమయింది” కళ్ళు తుడుచుకున్నాడు అశ్విన్. “ఇప్పుడు అమ్మలేదు. ఒక్కడివి ఎంత ఇబ్బంది పడుతున్నావో, అని మాకు ఎంత బెంగగా వుంటుందో తెలుసా?” కంఠం రుద్దమయింది అశ్విన్ కి. “ఇప్పుడు నాకు నేను చేసుకునే ఓపిక వుందిరా. అది కూడా తగ్గాక వస్తాను.” […]