May 20, 2024

నెరవేరిన కల

రచన: సునీత పేరిచెర్ల ” తెల్లవారనే లేదు ఇప్పటి నుండే ఏం చేసేస్తున్నావు లక్ష్మీ ” మోహన్ కళ్లు నులుముకుంటూ తన భార్యతో అంటూ హాల్ లోకి వచ్చాడు.. “మర్చిపోయారా ..! ఈ రోజు మనకెంతో ముఖ్యమైన రోజు కదా..మీతో పాటు ఫంక్షనుకు నేను కూడా వద్దామని కాస్త ముందుగానే లేచి పనులన్నీ పూర్తిచేసాను ” కాఫీ కప్పు చేతికందిస్తూ అంది లక్ష్మి…! *** మోహన్ కాలేజీలో లెక్చరర్.. మానవతా దృక్పథం ,ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి.. […]

అమ్మ కోసం

రచన: వంజారి రోహిణి చెల్లికి డెలివరీ టైమ్. అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. దూర ప్రయాణాలు చేసే ఓపిక అసలే లేకపోవటంతో చెల్లెలు గీత తనను పదే పదే బతిమాలడం తోటి తప్పనిసరి పరిస్థితుల్లో కావ్య చెల్లెలి ప్రసవ సమయంలో సాయంగా ఉండేందుకు తన ఇద్దరు చిన్నారులు లిఖిత, నిఖితలను వాళ్ళ నాయనమ్మ, తాతల దగ్గర వదిలి, వారికీ, తన భర్త విశ్వానికి పిల్లల గురించి లక్ష జాగ్రత్తలు చెప్పి అమెరికా విమానం ఎక్కింది కావ్య. పెద్ద కూతురు […]

తిరుక్కడయూర్ అభిరామి కోవెల

రచన: నాగలక్ష్మి కర్రా ఈ తిరుక్కడయూర్ అనే పట్టణంలో అమృత ఘటేస్వర్ కోవెల ఉంది .ఈ తిరుక్కడయూర్ తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలో ఉంది. ఈ తిరుక్కడయూర్ “మైలదుత్తురై “(మాయ వరమ్) నుంచి “పోరయార్ “వెళ్ళేదారిలో మైలదుత్తురై కి 22కిమి దూరం, పోరయార్ నుంచి 8కిమి దూరంలో ఉంది. ముందు 60వ పెళ్లి రోజు ఇక్కడ చేయించుకునే వారు. తరవాత తరవాత ఈ కోవెలలో షష్టబ్దిపూర్తి (60 సం.), భీమార్థ శాంతి(70 సం ..నిండిన తరువాత చేసుకొనే […]

చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయము (చేబ్రోలు-గుంటూరు జిల్లా)

రచన: అంబడిపూడి శ్యామసుందరరావు త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మకు భృగుమహర్షి శాపము వలన దేవాలయాలు ఉండవు. ఉన్న దేవాలయాలు కూడా శివలింగాకృతిలో ఉంటాయి. అటువంటి దేవాలయాలు బ్రహ్మ, శివుడు పేర్లను కలిపి ఉంటాయి. అందుచేతనే శివుడిని పూజించేటప్పుడు ముందుగా బ్రహ్మను తలచుకుంటాము, అటువంటి దేవాలయాలలో గుంటూరు జిల్లా లోని చేబ్రోలు గ్రామములో వెలసిన చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి దేవాలయము చాలా ముఖ్యమైనది. ఈ దేవాలయాన్ని రాజా వాసిరెడ్డి వెంటాద్రి నాయుడు గారు 200 ఏళ్ల క్రితము అంటే […]

స్త్రీల మనసులను ఉద్దీపనదిశగా నడిపిన నవల

రచన: సి. ఉమాదేవి పోలంరాజు శారదగారు జగమెరిగిన రచయిత్రి. ఆంధ్రభూమిలో ప్రచురింపబడిన నవల బంగారు కంచం. ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో రచింపబడిన నవల. నేటి పరిస్థితులకు భిన్నంగా ఒకనాటి హద్దులు, సామెతలు కొడుకునైనా, కోడలినైనా కట్టడి చేసే విధంగా అత్తలు, నాయనమ్మలు, అమ్మమ్మలు వల్లెవేయడం పరిపాటి. ఈ నవల వాటి పరిణామాలను బహిర్గతపరచింది. ఒకనాటి ఉమ్మడి కుటుంబాలలో పెద్దలమాటే శిరోధార్యం. వారి మాటలను అతిక్రమిస్తే నలుగిరిలో చిన్నబోవడమేకాక కఠినమైన శిక్షలకు కూడా గురవుతారు. తరాలు మారాయి. కాని […]

తపస్సు – పిల్లల ఆటస్థలం

రచన: రామా చంద్రమౌళి చెట్టుకింద సిమెంట్‌ బెంచీపై కూర్చోబోతున్నా రివ్వున పరుగెత్తుకొచ్చింది బంతి కాళ్ళలోకి జివ్వున సముద్రం ఉరికిచ్చి .. పట్టుకుంటూండగా వచ్చాడు వాడు పరుగెత్తుకుని ముఖంనిండా వెలుగు .. కళ్ళలో ఆకాశం బంతిని అందించగానే .. తుఫానై వెళ్ళిపోయాడు – పిల్లలు ఆడుతూనే ఉన్నారు పదిమంది దాకా ఆట ఒక్కటే .. మనుషులే వేర్వేరు వెనక్కి బెంచీ అంచుపై చేతులను విప్పి చాపి కళ్ళు మూసుకుంటే పొద్దంతా, కొద్దిసేపు పులినై, మరికొద్దిసేపు పిల్లినై అప్పుడప్పుడు చెక్కుకున్న […]

జానపదబ్రహ్మ బి.విఠలాచార్య

రచన: శారదాప్రసాద్ ‘జురాసిక్ పార్క్’లో రాక్షస బల్లుల్ని చూసి స్పీల్‌బర్గ్‌ ని బ్రహ్మాండంగా మెచ్చుకున్నాం! వాళ్లకు హైటెక్ కెమెరాలు, అడ్వాన్స్ గ్రాఫిక్సులున్నాయ్!మిలియన్ డాలర్ల డబ్బులున్నాయి ! విఠలాచార్య దగ్గర ఇవేవీ లేవు. ఆయన దగ్గర ఉందల్లా ఓ మిఛెల్ కెమెరా,మూణ్ణాలుగు లక్షల బడ్జెట్టు మాత్రమే ! వీటితోనే వెండితెరపై పరకాయ ప్రవేశాలు… గుర్రపు స్వారీలు… కత్తి ఫైటింగులు… వింత పక్షులు, జంతువులు… పుర్రెలు, అస్థిపంజరాలు… సృష్టించాడు. బి.విఠలాచార్య ‘జానపద బ్రహ్మ’ అని పేరు పొందిన తెలుగు సినిమా […]