అర్చన కథల పోటి – మార్పు

రచన: డా. జె. శ్రీసత్య గౌతమి సావిత్రీ, రాజారావులు కూతురు అంజలిని కలవడాని కి వైజాగ్ ప్రయాణమవుతున్నారు.”ఇంకా ఎంతసేపు సావిత్రీ? లేటు చేస్తే ట్రాఫిక్ లో ఇరుక్కుంటాం. బస్సు మిస్సవుతాం…” హడావిడి పడుతున్నారు రాజారావు. “ఇదిగో … అయిపోయింది. అన్నీ వెతుక్కొని ఒక దగ్గర పెట్టుకొనేసరికే టైము గడిచి పోతోంది” సావిత్రి సర్దుబాటు తన ఆలశ్యానికి. “సావిత్రీ, ఉండాల్సినవన్నీ ఒక చోట వుంటే కావాల్సినప్పుడు ఇంత శ్రమ వుండదు”. “మరేం… సంవత్సరానికి ఎన్నిసార్లు బయటికి ట్రిప్పులు వెళతామో