May 21, 2024

రక్షా బంధనం

రచన:కె.ఝాన్సీరాణి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చున్న నిత్య ఆలోచిస్తూ వుంది. ఆఫీసుకి వెళ్ళాలా, సెవు పెట్టాలా? లేక ఏకంగా ఉద్యోగమే మానేయాలా? అని. నిత్య ఒక ప్రైవేటు ఆఫీసులో కంపెనీలో 6 నెల నుంచి ఉద్యోగం చేస్తూంది. భర్త అజయ్‌ ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగం. రెండు నెలలు ఇండియాలో ఉంటే ఒక నెల అమెరికాలో ఉంటాడు. ఇంకా వాళ్ళకి పిల్లలు లేరు. అందుకే నిత్య ఉద్యోగం మానేయాలంటే ఆలోచించడం. పోనీ వేరే ఉద్యోగం చూసుకోవాంటే `ఇప్పుడు […]

21-వ శతాబ్దంలోవికటకవి – 1

రచన: కిభశ్రీ (శ్రీనివాస భరద్వాజ కిశోర్) ఒకసారి రాయలవారూ, తిరుమలదేవి, రామకృష్ణకవి, హైదరాబాదు పబ్లిక్ గార్డన్స్ లో వ్యాహ్యాళి సమయంలో వాదులాటలో వున్న ఒక యువజంటను చూసి వారి ఘర్షణకు కారణమేమయ్యుంటుందన్న విషయం మీద చర్చ వచ్చి రాయలవారు పొరపాటు అమ్మాయిదయుంటుందనీ , రాణిగారు తప్పు తప్పకుండా అబ్బాయిదేనని, వాదించుకుని కాసేపు, రామకృష్ణకవిని అభిప్రాయం అడుగుతారు. అప్పుడు రామకృష్ణుడు: కం।। మగువలు వెదకుదురెప్పుడు తగవుపడగ కారణమ్ము తన తప్పైనా మగడు సతికి యన్నింటను సగభాగమునిచ్చెగాన సహియించవలెన్ అని […]

ఆకుదొక కథ!

రచన:లక్ష్మీదేవి నేనిక్కడికెప్పుడు వచ్చానో, ఇంత అందమైన ప్రపంచంలోకి ఎలా చేరానో మరి, చల్లగాలిలో అమ్మ కొమ్మ తాను ఊగుతూ నన్ను ఉయ్యాలలూపుతోంది. నా చుట్టూ నా తోబుట్టువులు సంతోషంగా కనిపిస్తున్నారు. అప్పుడే రాలిన చినుకులలో తడిసి మరింత కొత్తగా మెరిసి పోతున్నారు. ఎన్ని ముఖాలో, ఎన్ని ఆకారాలో, వాటిల్లో ఎన్ని వికారాలో! చుట్టూ జరిగేదాన్ని గమనిస్తూ , ఆలోచిస్తూ ఉండడమే నా స్వభావం. ఆకాశపుటంచులనుండి నా స్నేహితులు మమ్మల్నంతా ఆనందతరంగాల్లో ముంచేయడానికి అప్పుడప్పుడూ వస్తుంటారు. వారికోసమే మా […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 18

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య జీవన సంగ్రామంలో పరుగులు పెడుతున్నాం. ఎందుకో తెలియదు. పరుగులే పరుగులు. ఈ ఉరుకులు పరుగులు అనేవి, జంతువులకే తప్ప, మానవులకు కాదు. ఒక మానవునిగా, సమాజ నిర్బంధతలకు, బలహీనతలకు లొంగకుండా ఎవరికి కావలసిన మార్గాన్ని వారు విఙ్ఞతతో సమకూర్చుకోవచ్చు. మనిషి తన జీవితకాల జీవనసౌందర్యాన్ని తిరస్కరిస్తున్నాడని, ఒక ఆనందమయ జీవన విధానానానికి తెరలు దించి, దారిమూసివేసి పక్క దారి పడుతున్నాడని, ధన భోషాణంలో దూరి తలుపు గడియ వేసుకుంటున్నాడని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. […]

ఇస్లాం మతం

రచన: శారదా ప్రసాద్ భారతదేశంలో హిందూమతం తరువాత ఇస్లాం రెండవ స్థానంలో ఉంది . 2007 గణాంకాల ప్రకారం, 13.4% ముస్లింలు ఉన్నారు.ప్రస్తుతం భారత్ లో ముస్లింలు ఇండోనేషియా మరియు పాకిస్తాన్ ల తరువాత మూడవ స్థానంలో ఉన్నారు. ఇస్లాం తొలుత అరబ్బు వర్తకుల ద్వారా శాంతియుతముగా భారతదేశంలో ప్రవేశించింది.ఇస్లాం అనేది మానవజాతి కోసం అల్లాహ్ నిర్ణయించిన ధర్మం. దేవుడు ఒక్కడే అనే ప్రాతిపదిక పైన ముహమ్మద్ ప్రవక్త (ఆఖరి ప్రవక్త) స్థాపించిన మతం కాదు ఇది […]

తిక్క కుదిరింది… గొలుసు కథ

తిక్క కుదిరింది.. గొలుసు కథ 1 రచన: రజనీ శకుంతల సుమలత మంచి సింగర్ ” ఎంత అంటే పుట్టిన వెంటనే తన ఏడుపు కూడా స—-రి— గ—మ –ప —లానే రాగయుక్తంగా ఏడిచిందని ఆమె తల్లి అరుంధతి ఇప్పటికి ఏడు లక్షల ఒకటోసారి చెప్పింది. ఇంకా చెప్తోనే ఉంది. ప్యూచర్ లో కూడా చెప్తూనే ఉంటుంది. ఇంత రిధమిక్ గా ఏడవబట్టే మూడో సంవత్సరానికే సంగీతం క్లాస్ కి పంపింది.తల్లి. అలా అలా స్వరాలు వగైరా […]

The Ministry of Utmost Happiness.. Video Review

Arundhati Roy’s The Ministry of Utmost Happiness is the story of post modern India…the events that have unmade lives, left people shattered, yet the India and Indians live on bravely. Arundhati Roy tells this story through Anjum, a trans woman’s life. What you see in the book is the author’s experiences of having been a […]

బోనాలు

రచన: జ్యోతి వలబోజు ఆడియో: డా.శ్రీసత్య గౌతమి బోనాలు ఆడియో ఈ లంకెలో వినండి.. BONALU భారతావనిలో పండగలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పండగ వెనుక ఓ ప్రాముఖ్యత ఉంటుంది. పండగలు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబిస్తాయి. వీటిని ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అటువంటి ఒక ముఖ్యమైన పంఢగ బోనాలు. తెలుగువారి ముఖ్యంగా తెలంగాణా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకునే పండగ బోనాల పండగ. బోనాల […]