May 19, 2024

నాన్నా, నీకు వందనాలు!

రచన : కోసూరి ఉమాభారతి

Bharati-2

నాన్నంటే నమ్మకం
నాన్నంటే చేయూత
నాన్నంటే శిక్షణ
నాన్నే క్రమశిక్షణ

నవ్వించి, ఆడించి
నడకలు నేర్పాడు
తప్పిదాలు సరిదిద్ది
నడతని సరిచేసాడు

చిట్టిపావడ అమ్మ వేయిస్తే,
చిరుమువ్వలు నాన్న సవరించాడు
వంటింటి వైనాలు అమ్మ నేర్పితే,
గణితాన్ని నాచేత నాన్న వల్లించాడు

మురిపాలు పంచినా నాన్నే
యువరాణిగా పొగిడినా నాన్నే
నా పై ఉరిమినా నా వృద్దికే
నన్ను తరిమినా నా పురోగతికే

కళ్ళల్లో కలలు నింపుకోమన్నాడు
గుండెల నిండా ఆశలుండాలన్నాడు

బెదురే లేక ఎదురీదమన్నాడు
ఉనికి నిలుపుకోమన్నాడు
విశ్వాసంతో ముందుకి సాగి
విజ్ఞతని పంచమన్నాడు

జన్మనిచ్చినవాడు నాన్నే
జీవితానికి దిశ చూపినవాడూ నాన్నే
నాన్ననేర్పిన పాఠాలే
జీవనబాటకి పునాదిరాళ్ళు

నన్ను నన్నుగా తీర్చిదిద్దినందుకు
నాన్నా నీకు శతకోటి వందనాలు!

3 thoughts on “నాన్నా, నీకు వందనాలు!

Leave a Reply to Srihari Nandimala Cancel reply

Your email address will not be published. Required fields are marked *