May 3, 2024

‘మా నాన్నగారు ‘.

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు .

raghavendra

ప్రేమ ఆప్యాయత
అనురాగం
మూర్తీభావిస్తే
మా నాన్నగారు

ఆత్మ విశ్వాసం
మానసిక ధృడత్వం
విజ్ఞానం
విచక్షణ
విషయ పరిశీలన
విశ్లేషణ
వ్యక్తిగా అత్యున్నతం
బంధుత్వపు తలమానికం
మా నాన్నగారు.

సహనం
సంయమనం
సమన్వయం
ఎందరికో
ఎన్నెన్నో సమస్యల
పరిష్కర్త
మా నాన్నగారు

జీవన సహచరిణి
అర్ధంతరంగా
అనంతలోకాలకు
పసికందులు
సంతానం
నిబ్బరం తన ఆభరణం
ఆయన మా నాన్న గారు.

నమ్మినవారని
వారికి ఆదరువని
మోసం జరుగదని
ఆయన నమ్మకం
వ్యాపారం అప్పగిస్తే
నిట్టనిలువునా ముంచి
వెన్నుపోట్లు
పోనీ బాగుపదనీ
వస్తూ తెచ్చామా
ఆయన వేదాంతి.
ఆయనే
మా నాన్నగారు.

ముందు వెనుకలు
ఎరుగదు దాత్రుత్వం
ఆస్తి అయిసుముక్క .
గంపెడు సంసారం
తప్పని తిప్పలు
మూకుమ్మడి కష్టాలు.
తనకు పిల్లలు
పిల్లలకు తానయి
మా నాన్నగారు.

కష్టాలలో
స్థిరత్వం
సుఖాలలో
స్తిమితత్వం
పంచిచ్చిన
భవ్యమైన
ఆస్తి మాకు
ఆయనే
మా నాన్నగారు.

జీవనాన
సునామీలు
వెరవని
బెదరని
శిఖరం
మా నాన్నగారు .

5 thoughts on “‘మా నాన్నగారు ‘.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *