May 21, 2024

కళ్యాణి రాగం

రచన: విశాలి పెరి

కల్యాణి రాగము / మేచకల్యాణి రాగము కర్ణాటక సంగీతంలో 65వ మేళకర్త రాగము. ఇది అతి ప్రాచీన రాగము, ఇది ప్రతి మధ్యమ రాగములలో ‘రాణి ‘ వంటిది. ఇది రుద్ర అను చక్రములో ఐదవ రాగము. ఈ రాగము పూర్వము కళ్యాణి గా పిలువబడేది. కటపయాది సంఖ్య లో ఇముడుట కొరకు “మేచ” అను పదమును “కల్యాణి” యందు అమర్చిరి. ఇది 29వ మేళకర్త రాగమైన ‘ధీరశంకరాభరణం ‘ యొక్క ప్రతి మధ్యమ సమానము. మనసును ఎల్ల వేళలా ఆహ్లాదముగా ఉంచుతుంది కాబట్టి ఈ రాగం అన్ని రాగాలలోకి ‘ రాణి ‘ రాగముగా ప్రశిద్ధికెక్కింది.
ఈ రాగంలో షడ్జమము, చతుశ్రుతి ఋషభము, అంతర గాంధారము, ప్రతి మధ్యమము, పంచమము, చతుశ్రుతి ధైవతము, కాకలి నిషాధము.

ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R2 G3 M2 P D2 N3 S)

అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N3 D2 P M2 G3 R2 S)

విశిష్టత :
ప్రసిద్ధ ప్రతిమధ్యమ రాగము. చాల జన్యరాగ సంతతి గల జనకరాగము. ఈ రాగములో పా మా గా అనునపుడు గాంధారము అంతర గాంధారము లకు కొంచెము ఎక్కువగా నుండును. ఈ రకపు గాంధారమునకు తీవ్ర అంతర గాంధారము అని పేరు. దీనినే ‘ చ్యుత ‘ మధ్యము అని ఖూడా అంటారు.

ఈ రాగం లోని
“రి” ని షడ్జమం చేస్తే హరికాంభోజి,
“గ” ని షడ్జమం చేస్తే నటభైరవి,
“ప” ని షడ్జమం చేస్తే శంకరాభరణం,
“ద” ని షడ్జమం చేస్తే ఖరహరప్రియ,
“ని” ని షడ్జమం చేస్తే తోడి…
కల్యాణి రాగము పెద్ద రాగము. ఈ రాగము అన్ని వేళల పాడదగిన రాగమైనప్పటికి సాయం సమయము సమంజసము.
మేచకల్యాణి రాగానికి చాలా జన్య రాగాలు ఉన్నవి. వాటిలో ‘ హమీర్ కల్యాణి ‘ , ‘ మోహన కల్యాణి ‘ , ‘సారంగ ‘, ‘ సునదవినోదిన ‘, ‘యమన్ కల్యాణి ‘ మొదలైనవి ప్రముఖమైనవి.
సినిమా పాటలు ఎక్కువగా ఈ రాగములోనే చేయబడ్డాయి. ఘంటసాల గారికి ఈ రాగము ఇష్టమైనది కావడముతో ఆయన చేసిన సినిమాలో ఒక్క పాటైనా ఈ రాగములో ఉండి తీరాల్సిందే. మన జాతీయ గీతము “జనగణమణ ” కూడా కల్యాణి రాగములో ఉండడం ఆ రాగము యొక్క విశిష్టత తెలుపుతోంది. హింధుస్తాన్ సంగీతముతో ఈ రాగాన్ని ‘యమన్ కల్యాణి ‘ గా అభివర్ణిస్తారు.

కల్యాణి రాగములో ఉన్న ప్రశిద్ధ కీర్తనలు / కృతులు :
నిధి చాల సుఖమా – త్యాగరాజు కీర్తన
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి – రామదాసు కీర్తన
కమలజాదళ విమల సునయన కరి వరద కరునాంబుధే
వనజాక్షరో…
ఎంతటి కులుకే (పదము)- పట్టాభిరామయ్య
నినువినా – సుబ్బరాయశాస్త్రి’
పారెంగుం – ఘనం కృష్ణయ్య
కమలాంబాం- ముత్తుస్వామి దీక్షితులు
నిజదాసవరద – పట్నం సుబ్రహ్మయ్యర్
ఎంతటి కులుకే- పట్టాభిరామయ్య
సుందరి నీ దివ్యరూపమును – త్యాగరాజు కీర్తన
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి – రామదాసు కీర్తన

ఈ రాగము లో ఉన్న కొన్ని సినిమా పాటలు :
1. ఆకాశంలో హాయిగా రాగం తీసే కోయిల – కల్యాణి
2. హరి కథ లో భూతల నాథుడు – వాగ్ధానం
3. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో – సంతానం
4. చెలికాడు నిన్నె రమ్మని పిలువా చేర రావేలా – కులగోత్రాలు
5.చిగురులు వేసిన కలలన్నీ- పూలరంగడు
6.దొరకునా యిటువంటి సేవ – శంకరాభరణం
7.దొరవో ఎవరివో – కథానాయకి మొల్ల
8.ఎక్కడి దొంగలు అక్కడనే- ఇల్లరికం
9.ఎతవున్నారా నికకడ నీకు – వరుడు కావాలి
10.ఎవరివో నీవెవరివో- పునర్జన్మ
11.ఏమని తెలుపుదురా – చిన్ననాటి స్నేహం
12.ఇది చిరు సరిగమలెరుగని రాగం – హై హై నాయకా
13.జయ జయ జయ సుభసయ – మల్లీశ్వరి
14.జగమే మారినదీ మధురముగా ఈ వేళ- దేశద్రోహులు
15.జయ జయ ప్రియ భారత జనని – రాక్షసుడు
16.రా రా కృష్ణయ్య – రాము (పాతది)
17.కలలు ఫలించే కాలములో – విమల
18.హాయిహాయిగా జాబిల్లి తొలిరేయి – వెలుగు నీడలు
19.కన్నయ్య లాంటి అన్నయ్య లేని – బంగారు బాబు
20. కులాసా రాదోయి రమ్మంటే – అన్నపూర్ణ
21.కనుగవ తానియయ – సువర్ణ సుందరి
22.కిల కిల నవ్వులు చిలికిన – భార్యా భర్తలు
23.వాన కాదు వాన కాదు వరదా రాజా – భాగ్యచక్రం
24.కుండ కాదు కుండ – భాగ్యచక్రం
25.కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ – దేవదాసు
26.కనుల ముందు నీవుంటే – చెల్లెలి కాపురం
27.కనులు మాటలాడునని- మాయని మమత
28.లలిత లలిత మురళీ- పాండురంగ మహత్యం
29.మదిలోన మధుర భావం – జయసింహ
30. మది శారదా దేవి మందిరమే- జయభేరి
31.మనసేమిటో తెలిసిందిలే – అన్నపూర్ణ
32.మధుర భావాల సుమమాల – జై జవాన్
33. మనసు పాడింది సన్నాయి పాట – పుణ్యావతి
34. శామలాంబ దండకము లో మాతా మరకత శ్యామా – మహాకవి కాళిదాసు
35. నాదిరదిన్నా నచ్చిన దాని కోసం- ఒకరికి ఒకరు
36.మనసా త్రుళ్ళి పడకే – శ్రీవారికి ప్రేమలేఖ
37.మనసులో ఒకటుంది- కులదైవం
38.మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి – అందాల రాముడు
39.నాసరి నీవని నీ గురినీనని – సి.ఐ.డి
40. నీవే ఆది దైవము – భక్త తుకారాం
41. మనసున మల్లెల మాలలూగెనే – మల్లీశ్వరి
42. నా నోము ఫలించెనుగా – భూకైలాస్
43. ఓ దేవదా చదువూ ఇదేనా- దేవదాసు
44. పాల కడలిపై శేష తల్పమున – చెంచు లక్ష్మి
45. నేడు శ్రీవారికి మేమంటే పరాకా – ఇల్లరికం
46. పలికెను ఏదో రాగం- సంఘం చెక్కిన శిల్పాలు
47. పల్లెకు పోదాం- దేవదాసు
48. పాడనా వాణి కళ్యాణిగా- మేఘ సందేశం
49. నిఖిల భువనపాల – ఇలవేలుపు
50.ఓ సఖా రావోయి సఖా- అనార్కలి
51.పలుకవే రాణి – స్వర్ణమంజరి
52.పయనించే ఓ చిలుకా ఎగిరిపో – కులదైవం
53.పలుకురాదటే చిలుకల- షావుకారు
54.పెను చీకటాయే లోకం- మాంగల్యం బలం
55.పులకించని మది పులకించు – పెళ్ళి కానుక
56.పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకొని – పెళ్ళి చేసి చూడు
57.ఓ నమో నమః యవ్వనమా – సూర్య ఐ.పి.ఎస్
58.రా రా నా సామి రా రా – విప్రనారాయణ
59.పూవై విరిసిన పున్నమి వేళ- తిరుపతమ్మ కథ
60.సావిరహెతవ దీనా రాధా- విప్రనారాయణ
61.రావె నా చెలియా – మంచి మనసుకు మంచి రోజులు
62.సాగేను జీవిత నావ- తోబుట్టువు
63.రావే రావే వయరి ఓ చెలియా- కులదైవం
64.రాధను రమ్మన్నాడు – అర్థాంగి
65.రాక రాక వచ్చావు చందమామ- అర్థాంగి
66.సరసాల జవరలను- సీతారామ కళ్యాణము
67.శ్రీరామ నామాలు శతకోటి- మీన
68.తలనిండా పూదండ – ప్రైవేటు సాంగ్
69.రాజా నా రాజా ఇటు చూడవోయి – సారణాగదర
70.తోటాలో నా రాజు తొంగి చూసెను – ఏకవీర
71.సఖియా వివరింపవే – నర్తనశాల
72.తానే మారెనా గుణమే మారెనా- దెవదాసు
73.తొలివలపే పదే పదే పిలిచే – దేవత
74.సలలిత రాగ సుధారస సారం – నర్తనశాల
75. మదిలొ విరిసే తీయని రాగం – రెండు కుటుంబాల కథ
76. రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి – లవకుశ
77. విరిసే చల్లని వెన్నెలా – లవకుశ
78. మనసార కల్యాణి పలికించు వీణ – వీరభార్కరుడు
79. కలిసిన హృదయాలలోనా – ప్రేమ – పగ
80. నీవేనా నను తలచినది – మాయబజార్
81. ఓ నా రాజా రావా రావా – ఆమె ఎవరు?
82. సరిసరి నటనల ఓ చెలి – మనోహరం
83. నీవే ఆది దైవము – భక్త తుకారాం
84. సుందరాంగ మరువలేనోయ్ – సంఘం
85. ఇలలో సాటి లేని భారత దేశం – సంఘం
86. రాకరాక వచ్చావు చందమామ – అర్ధాంగి
87. ఆ మనసేమో .. ఆ సొగసేమో – రేచుక్క
88.రాధను రమ్మన్నాడు – అర్ధాంగి
89. నిఖిల భువన పాల – ఇలవేలుపు
90.పలుకవే రాణి కలవాణి – స్వర్ణమంజరి
91. కనుగవ తనియగ (హాయి హాయిగా ఆమని సాగే) – సువర్ణ సుందరి
92. ఆ చూపులోనా ఆ మనసులోనా – పల్లెటూరు
93. చిరు చిరు నగవులు చిలికే తండ్రి – శ్రీవేంకటేశ్వర కల్యాణం
94. పూచే పూలలోనా వీచే గాలిలోనా – గీత
95. చక్కనైనా కోయరాజుని ఎక్కడేనా చూచేరా – జీవితం
96. ఇదియే జీవితానందము – స్వర్ణ మంజరి
97. దొరనో ఎవరినో – కథానాయిక మొల్ల
98. కలలు ఫలించే కాలములో (కనుల బెళుకు) – విమల
99. తలనిండ పూదండ దాల్చిన రాణి -ప్రవేట్ సాంగ్
100. బహుదూరపు బాటసారి – ప్రైవేట్ సాన్

కల్యాణి రాగం లో హింది సినిమా పాటలు :
1. ఆప్ కి అనురోద్ పే – అనురోద్
2. ఆయే హో మేరి జిందగీ మే – రాజా హిందుస్తాని
3. అభి నా జావో చోడ్ కర్ – హం దోనో
4. అంగ్ అంగ్ రంగ్ చల్కె – సంకల్ప్
5. ఆసూ భరి హై యే జీవంకి రాహే -పర్వరిష్
6. ఆసు సమజ్ కర్ క్యూ ముఝే – ఛాయ
7. బడా దుఖ్ దియా తేరే లఖన్ నే – రాం లఖన్
8. బడే భోలే హొ – అర్ధాంగి
9. చందన్ స బదన్ – సరస్వతి చందెర్
10. ఎహసాన్ తెరా హోగా ముఝ్ పర్ – జంగిలి
11. ఘర్ సే నికల్ తే హి – పాపా కెహెతే హై
12. ఇణి లోగో నే – పాకీజా
13. ఇస్ మోడ్ సే జాతే హై – ఆంధి
14. జబ్ దీప్ జలే ఆనా – చిట్ చోర్
15. మన్ రే తూ కాహె న ధీర్ ధరే – చిత్ర లేఖ
16. మోసం హై ఆషికానా – పాకీజా
17. మేరే దునియా మే తూ ఆయే – హీర్ రాంజా
18. నిగాహే మిలానే కో జీ చాహతా హై – దిల్ హీ తో హై
19. పాన్ ఖాయే సయ్యా హమారో – తీస్రి కసం
20. సోచేంగే తుమే ప్యార్ కర్తే నహి – దీవాన

2 thoughts on “కళ్యాణి రాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *