May 3, 2024

మన వాగ్గేయకారులు – (భాగము – 4)

రచన: సిరి వడ్డే

శ్రీ శ్యామశాస్త్రి :

కర్నాటక సంగీతంలో ప్రముఖ వాగ్గేయకార త్రయంలో శ్రీ త్యాగరాజు, శ్రీ ముత్తుస్వామి దీక్షితుల సరసన నిలిచే తెలుగు పెద్దలలో శ్రీ శ్యామశాస్త్రి ప్రముఖులు. శ్రీ శ్యామశాస్త్రి వయస్సులో వారిద్దరికన్నా పెద్దవారు. శ్యామశాస్త్రి గారి తండ్రి శ్రీ విశ్వనాథ శాస్త్రి, ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుకు సమీపంలోగల కంభం ప్రాంతీయులు. అయితే, 17వ శతాబ్దంలో తమిళనాడుకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. శ్యామశాస్త్రి గారి అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము. అయితే, చిన్నతనంలో ముద్దుపేరుగా “శ్యామకృష్ణ “గా పిలుస్తూ, ఆ పేరే చివరకు వ్యవహరికంలో సార్ధకమైందని ఆయన శిష్యులు పేర్కొంటారు.

తండ్రి విశ్వనాధ శాస్త్రి గారు సంస్కృత, తెలుగు భాషలలో పండితుడు కావడంతో, శ్యామశాస్త్రి గారు చిన్నతనంలో తండ్రి దగ్గరే సంస్కృతాంధ్రభాషలు అభ్యసించారు. సంగీతంలో తన మేనమామ దగ్గర స్వరపరిచయం కలిగినా, ఆ పిదప తంజావూరులో ‘సంగీత స్వామి’ అనబడే ప్రముఖ తెలుగు సంగీత విద్వాంసుని దగ్గర, తంజావూరులోని రాజాస్థానంలో సంగీత విద్వాంసుడైన శ్రీ పచ్చిమిరియము ఆది అప్పయ్య సహకారంతో సంగీత శాస్త్రాలలో మర్మములు ఎన్నో అధ్యయనం చేశారు.

సంగీత త్రిమూర్తులలో మూడవవారైన శ్రీ శ్యామశాస్త్రి ( ఏప్రిల్ 26, 1762 – ఫిబ్రవరి 06,1827 ) ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మరియు వాగ్గేయకారులు. ఈయన అసలు పేరు “వేంకట సుబ్రహ్మణ్యము”. ఈయన తంజావూరు జిల్లాలోని తిరువారూరు గ్రామంలో ఏప్రిల్ 26, 1762న కృత్తికా నక్షత్రమున విశ్వనాధ అయ్యరు గారికి జన్మించిరి. వీరిని తల్లిదండ్రులు “శ్యామకృష్ణా”యని ముద్దుగా పిలిచేవారు. అదే వారి కృతులలో, ఈయన ముద్ర అయినది. ఈయన బంగారు కామాక్షి ఉపాసకులు. అమ్మపై తప్ప వేరొకరిపై రచనలు చేయలేదు. ఈయన కలగడ, మాంజి, చింతామణి మొదలగు అపూర్వ రాగములను కల్పించారు. త్యాగరాజాదులచే కొనియాడబడిన ఈయన లయజ్ఞానము శ్లాఘనీయమైనది. ఆనంద భైరవిరాగమన్న ఈయనకు చాలా ఇష్టమని చెప్తారు. ఆంధ్ర గీర్వాణ భాషా కోవిదుడై ఈయన కృతులలో ముఖ్యమైనవి: “ఓ జగదంబా”, “హిమాచలతనయ”, “మరి వేరే గతి యెవ్వరమ్మా”, “హిమాద్రిసుతే పాహిమాం”, “శంకరి శంకురు”, “సరోజదళనేత్రి”, “పాలించు కామాక్షి”, “కామాక్షీ (స్వరజతి), కనకశైలవిహారిణి”, “దేవీ బ్రోవ సమయమిదే”, “దురుసుగా”, “నన్ను బ్రోవు లలిత”, మొదలగునవి. ప్రఖ్యాత వాగ్గేయకారుడైన శ్రీ సుబ్బరాయశాస్త్రి గారు ఈయన కుమారుడే.

వీరు 18వ యేట తలిదండ్రులతో తంజావూరు చేరుకొనిరి. అచట ఆంధ్ర పండితులైన సంగీతస్వామి అను సన్యాసి కాశీ నుండి దక్షిణ హిందూ యాత్రకు వచ్చి, అది చాతుర్మాసముగాన తంజావూరి లోనే ఆ నాలుగు నెలలు ఉండిపోయిరి. ఒక దినము శ్యామశాస్త్రి గారి యింటిలో వారికి భిక్ష జరిగెను. భిక్ష జరిగిన వెనుక శాస్త్రి గారి తండ్రి తన కుమారుని ఆ సన్యాసి గారికి చూపి ఆశీర్వదింపగోరిరి. శ్యామశాస్త్రిని చూచిన వెంటనే అతడు గొప్ప పండితుడు కాగలడని సంగీతస్వామి తెలుసుకొనెను. అప్పటి నుండి సంగీత విద్య అభ్యసించిరి. తాళశాస్త్రము లోను, రాగ శాస్త్రములో అఖండ పండితుడైన సంగీతస్వామి వద్ద బాగుగా విద్యనభ్యసించిరి. చాతుర్మాసము కాగానే సంగీతస్వామి కాశీకి వెళ్ళునప్పుడు గాంధర్వ విద్యాగ్రంథముల నిచ్చి “నీవు సంగీత శాస్త్రమును సమగ్రంగా అభ్యసించితివి. తంజావూరు ఆస్థాన విధ్వాంసుడైన పచ్చి మిరియము ఆది అప్పయ్య గారి సంగీతమును తరచు వినుచుండుము” అని చెప్పి వెడలిపోయిరి. గురువాజ్ఞ ప్రకారమే శాస్త్రి గారు ఆది అప్పయ్యగారితో స్నేహము చేసికొని, వారి గానమును తరచు వినుచుండిరి. అది అప్పయ్య గారికి శాస్త్రిగారనిన అపరిమిత ప్రేమ, భక్తియునుండెడివి. ప్రేమతో “కామాక్షి” అని పిలుచుటయు కలదట.
వీరు మదురైకు వెళ్లినపుడు మీనాక్షిదేవిని స్తుతించుచూ తొమ్మిది కృతులు పాడిరి.(“నవరత్నమాలిక”). శాస్త్రి గారి రచనలు కదళీపాకములు. వీరికి ఆనందభైరవి రాగంపై అనురాగమెక్కువయున్నట్లు కనిపించును. ఆనందభైరవిలో చాలా కృతులను రచించిరి. సాధారణముగా చాపుతాళములోనే ఎక్కువ కృతులు, స్వరజతులు రచించినట్లు తెలియుచున్నది. వీరి కీర్తనలు కొన్ని ,

కర్ణాటక కాపి – ఆది అఖిలాండేశ్వరి దురుసుగ బ్రోవుము
ఆనందభైరవి – త్రిపుట ఆదినమునించి పొగడి పొగడి ఆశ్రయించి
పూర్వికల్యాణి – మిశ్ర చాపు ఎన్నేరముమ్‌ ఉన్‌ నామమ్‌ ఉరైప్పదే ఎన్‌ నేమమ్‌ అన్నైయే
పున్నాగవరాళి – త్రిపుట ఎన్నేరముమ్‌ ఉన్‌ పాదకమలధ్యానమ్‌
తోడి – ఆది ఏమని మిగుల వర్ణింతు ఈ మహిని నే నీ మహిమలు
ఆనందభైరవి – ఆది ఓ జగదంబ నను అంబ నీవు జవమున బ్రోవు అంబ
పున్నాగవరాళి – ఆది కనకశైల విహారిణి శ్రీ కామకోటిబాలే సుశీలే
వరాళి – మిశ్ర చాపు కరుణజూడవమ్మా వినమ్మా
శ్రీ – మిశ్ర చాపు కరుణజూడు నిన్నునమ్మిన వాడగదా
తోడి – ఆది, తిశ్ర గతి కరుణానిధి ఇలలో నీవనుచును
(స్వరజతి) కామాక్షి అనుదినము
పరజు – త్రిపుట కామాక్షి కరుణాకటాక్షి (గీతమ్‌)
బేగడ – ఆది కామాక్షి నాతో వాదా దయలేదా
యదుకులకాంభోజి – త్రిపుట ( – మిశ్ర చాపు) కామాక్షి నీ పదయుగము (స్వరజతి)
వరాళి – మిశ్ర చాపు కామాక్షి బంగారు కామాక్షి నన్ను బ్రోవవే
మధ్యమావతి – త్రిపుట కామాక్షి లోకసాక్షిణీ (గీతమ్‌)
సావేరి – ఆది జనని నతజనపరిపాలిని పాహిమాం భవాని త్రిలోక
గౌళిపంతు – ఆది తరుణమిదమ్మా ఎన్నై రక్షిక్క
కల్యాణి – మిశ్ర చాపు తల్లి నిన్ను నెఱ నమ్మినాను వినవే
పరజు – మిశ్ర చాపు/ఆది త్రిలోకమాతా నన్నుబ్రోవు కరుణను
జగన్మోహిని – మిశ్ర చాపు దయజూడ మంచి సమయమిదే వే వేగమే వచ్చి
బేగడ – ఆది దయానిధే మామవ (వర్ణమ్‌)
సావేరి – ఆది దురుసుగా కృపజూచి సంతత
శంకరాభరణం – ఆది దేవి మీన నేత్రి బ్రోవ రావే
కల్యాణి – ఝంప దేవీ నన్ను బ్రోవవమ్మా ఇపుడే మంచి సమయమమ్మా
కాంభోజి – ఆది దేవీ నీ పాదసారసములే దిక్కు
చింతామణి – ఆది దేవీ బ్రోవ సమయమిదే
జనరంజని – త్రిపుట నన్ను బ్రోవరాదా ఓ జగదంబా నీ దయచేయవే
గౌళిపంతు – మిశ్ర చాపు నన్ను బ్రోవరాదా వేగమే నీవు
లలిత – మిశ్ర చాపు నన్ను బ్రోవు లలితా వేగమే చాల
సౌరాష్ట్రం – చతురశ్ర అట నామనవిని విను ఈ వేళ(వర్ణమ్‌)
ఆభేరి – రూపక (రీతిగౌళ -) నిన్ను వినా మఱిగలదా గతి లోకములో
పూర్వికల్యాణి – మిశ్ర చాపు నిన్ను వినాగా మరి దిక్కెవరున్నారు
కేదారగౌళ – ఆది నిన్నే నమ్మితి నిజముగ గతి లోకములో
తోడి – త్రిపుట ( – మిశ్ర చాపు) నిన్నే నమ్మినాను సదా నా
పరజు – త్రిపుట (మాయామాళవగౌళ – ) నీలాయతాక్షీ నీవే జగత్సాక్షి
కల్యాణి – తిశ్ర మఠ్యమ్‌ నీవే గతియని (వర్ణమ్‌)
కేదారగౌళ – ఆది పరాకేల నన్ను పరిపాలింప మురారి సోదరి అంబా
కల్యాణి – త్రిపుట పరాముఖమేనమ్మా పార్వతియమ్మా
భైరవి – ఖండ మఠ్యమ్‌ పార్వతి జనని శ్రీ రాజరాజేశ్వరి(గీతమ్‌)
కల్గడ – ఆది, తిశ్ర గతి పార్వతీ నిన్ను నే నెఱనమ్మితి
ఆరభి – త్రిపుట పాలయాశు మాం పరదేవతే
మధ్యమావతి – ఆది పాలించు కామాక్షి పావనీ పాపశమనీ అంబ
ముఖారి – ఆది పాలింపవమ్మా పరమపావనీ భవానీ
నాట – రూపకం పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి అంబ పాహి మాం
ఆనందభైరవి – రూపకం పాహి శ్రీ గిరిరాజసుతే కరుణాకలితే
గౌళిపంతు – మిశ్ర చాపు పురహరజాయే పాలయ మాం
కల్యాణి – రూపకం బిరాన వరాలిచ్చి బ్రోవుము నెఱ నమ్మితి
మధ్యమావతి – తిశ్ర మఠ్యమ్‌ బృహన్నాయకీ నన్ను బ్రోవు వేగమే
పున్నాగవరాళి – ఆది బ్రోవ సమయమిదే దేవీ విను
మాంజి – మిశ్ర చాపు బ్రోవవమ్మా తామసమేలే బిరాన
నీలాంబరి – మిశ్ర చాపు బ్రోవవమ్మా బంగారు బొమ్మా మాయమ్మా నను
ఆనందభైరవి – మిశ్ర చాపు మరి వేరే గతి ఎవరమ్మా
ఆనందభైరవి – ఆది మహిలో అంబా నీదు మహిమాతిశయమెన్న తరమా?
నాటకురంజి – ఆది మాయమ్మా నన్నుబ్రోవవమ్మా మహామాయా ఉమా
ఆహిరి – ఆది మాయమ్మా యని నే పిలిచితే
ధన్యాసి – మిశ్ర చాపు మీనలోచని బ్రోవయోచనా దీనజనావనా
కల్యాణి – ఝంప రావే పర్వతరాజకుమారీ దేవీ నన్నుబ్రోచుటకు వే వేగమే
తోడి – ఆది రావే హిమగిరికుమారి కంచికామాక్షి వర (స్వరజతి)
కల్యాణి – ఆట శంకరి శంకరి కరుణాకరి రాజరాజేశ్వరి
సావేరి – ఆది, తిశ్ర గతి శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి
కల్యాణి – ఆది శ్రీ కామాక్షి కావవే నను కరుణాకటాక్షి
సావేరి – ఆది శ్రీపతిముఖ విరచిత పూజ్యే
పరజు – ఆది సంతతమ్‌ ఎన్నై రక్షిప్పాఇ ఉందన్‌ పాదారవిందత్తై (గీతమ్‌)
భైరవి – ఖండ ఝంప సరి యెవరమ్మా అంబ నీ
శంకరాభరణ – ఆది సరోజదళనేత్రి హిమగిరిపుత్రి నీ పదాంబుజములే
బేగడ – ఆది సామి నిన్నె నమ్మితిరారా రా ముద్దు కుమారా
ఆనందభైరవి – ఆట సామిని రమ్మనవే (వర్ణమ్‌)
సావేరి – త్రిపుట సారసాక్షి సదా (గీతమ్‌)
ఆనందభైరవి – చాపు/ఆది హిమాచలతనయ బ్రోచుటకిది
కల్యాణి – రూపక హిమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే

హిమాచల తనయ బ్రోచుటకి – శ్యామశాస్త్రి , ఆనందభైరవి రాగం

హిమాచల తనయ బ్రోచుటకి
ది మంచి సమయము రావే అంబా ||

కుమార జనని సమానమెవరిల
ను మానవతి శ్రీ బ్రుహన్నాయకి ||

సరోజముఖి బిరాన నీవు
వరాలొసగుమని నేను వేడితి
పురారి హరి సురేంద్రనుత
పురాణి పరా ముఖ మేలనే తల్లి ||

ఉమా హంస గమా తామ
సమా బ్రోవ దిక్కెవరు నిక్కముగ
ను మాకిపుడభిమానము చూపు
భారమా వినుమా దయ తోను ||

సదా నత వర దాయకి ని
జ దాసుడను శ్యామక్రిష్ణ సోదరి
గదా మొర వినవా దురిత
విదారిణి శ్రీ బ్రుహన్నాయకి ||

రచన – శ్రీ శ్యామశాస్త్రి.

కనక శైల విహారిణి అంబ
శ్రీ కామ కోటి బాలే సుశీలే ||కనక||
వనజ భవ హరి నుతే దేవి
హిమ గిరిజే లలితే సతతం
వినతం మాం పరిపాలయ శంకర
వనితే సతి మహా త్రిపుర సుందరి ||కనక||
కంబు కంఠి కంజ సదృశ వదనే
కరి రాజ గమనే మణి సదనే
శంబర విదారి తోషిణి శివ
శంకరి సదా మధుర భాషిణి ||కనక||
చండ ముండ ఖండన పండితే
ఇక్షు దండ కోదండ మండిత పాణి
పుండరీక నయన-అర్చిత పదే త్రి-
పుర వాసిని శివే హర విలాసిని ||కనక||
శ్యామళాంబికే భవాబ్ధి తరణే
శ్యామ కృష్ణ పరిపాలిని జనని
కామితార్థ ఫల దాయకి
కామాక్షి సకల లోక సాక్షి ||కనక||

వీరి గౌరవార్దం 1985 , డిసెంబర్ 21న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు.

తరువాత భాగంలో, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం నేస్తాలు.

హృదయపూర్వక కృతజ్ఞతలతో,

మీ సిరి _/\_

(సేకరణ – కొన్ని అంతర్జాల లింకుల నుండి…వారికి హృదయపూర్వక ధన్యవాదములు)

1 thought on “మన వాగ్గేయకారులు – (భాగము – 4)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *