May 13, 2024

అగ్గ్గిపెట్టెలో ఆరు గజాలు – సమీక్ష

రచన: – బి.ఎస్‌.రాములు, సామాజిక తత్త్వవేత్త

bhanumathi

వేల ఏళ్ల చేనేత పరిశ్రమ, జీవిత పరిణామాలను

‘అగ్గి పెట్టెలో ఆరుగజాలు’లో ఇమిడ్చిన మంథా భానుమతి

 

 

ప్రముఖ రచయిత్రి మంథా భానుమతి గారు రాసిన ‘అగ్గిపెట్టెలో ఆరుగజాలు’ నవల కేవలం నవల మాత్రమే కాదు. ఒక

పరిశోధనాత్మక రచన. ఒక పిహెచ్‌.డి.కి తక్కువ కాకుండ దేశ వ్యాప్తంగా చేనేత రంగంలో, వస్త్ర పరిశ్రమలో, నేతపై ఆధారపడి జీవిస్తూ వచ్చిన మానవుల జీవితాల్లో, సంస్కృతిలో వచ్చిన అభివృద్ధి, వికాసం, పతనాలు గురించిన అపూర్వ పరిశోధన ఈ నవలలో కనపడుతుంది. చేనేత పద్మశాలి, దేవాంగ, తొగట, తదితర చేనేత వృత్తి కులాల పురాణాలను, ఇతిహాసాలను కూడ అధ్యయనం చేసి వారి నుండి చేనేత కులాలు ఒకనాడు అనుభవించిన మహోజ్వల దశను ఎత్తి చూపారు.

ఈ నవల చదవడం ద్వారా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఈనాడు తెలంగాణలో, ఆంధ్రలో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్‌లో, వారణాసిలో, తమిళనాడులో, బెంగాల్‌లో నేత పరిశ్రమ, దానిపై ఆధారపడిన యంత్రాంగం, వ్యాపారం, ముడి సరుకులు, కేంద్ర ప్రభుత్వం యొక్క జౌళివిధానం, ఎగుమతి, దిగుమతి విధానాల వల్ల నేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, జీవితాలు, బడా పారిశ్రామికవేత్తలు మిల్లుల ద్వారా, మిల్లులు మూసివేసి స్థలాలను రియల్‌ ఎస్టేట్ గా మార్చుకోవడం ద్వారా ఎన్ని పరిణామాలు సంభవిస్తున్నాయో ఈ నవలలో చూడవచ్చు.

చరిత్రలో చక్రవర్తులతో, రాజులతో అపారమైన గౌరవాలు, ప్రశంసలు పొంది దేవతా విగ్రహాలకు వస్త్రాలు అందించి సామాజిక గౌరవం పొందిన చేనేత కులాలు ప్రస్తుతం రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎదుగుదల ఆగిన దశలో కొనసాగడం  పారిశ్రామిక విప్లవం తెచ్చిన విషాదం. పారిశ్రామిక విప్లవ ఫలాలు చేనేత కులాలకే అంది వారే యజమానులుగా, నిపుణులుగా, కార్మికులుగా ఎదిగి ఉంటే, ఆ సామాజిక పరిణామాలు వేరుగా ఉండేవి. బ్రిటీష్‌ వారి వలస పాలనలో మగ్గి ఇంగ్లాండులోని మాంచెస్టర్‌, లాంక్‌షోర్‌లలో ఉత్పత్తి అయిన వస్త్రాలను దిగుమతి చేసి సబ్సిడుపై అందిస్తూ దేశీయ వస్త్రాలపై  విపరీతమైన పన్నులు విధిస్తూ, చేనేత కార్మికుల చేతులు నరికివేస్తూ చేసిన దుర్మార్గ చరిత్ర మరుగున పుతున్నది. అప్పటి నుండి ప్రారంభమైన చేనేత కులాల దీనస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది.

చేనేత వృత్తి బహుప్రాచీనమైనది. మానవ నాగరికతలో వేట, ఆహార సేకరణ దశ నుండి గణ తెగలుగా, జనపదాలుగా స్థిర వ్యవసాయానికి మారే క్రమంలో ఆనాది మానవులు ఎన్నో విషయాలు కనుక్కున్నారు. కాయకసరు, పండు తిని రుచి చూసి ఏది మంచో, ఏది విషపూరితమో తెలుసుకున్నారు. శరీరానికి ఏ జంతువు కూడ మరో తొడుగులు తొడుక్కోలేదు. మానవులు తమకు వాతావరణం నుండి రక్షణ కోసం అనేక తొడుగుల గురించి ప్రయోగాలు చేశారు. తోలును తొడుగులుగా ఉపయోగించారు. ఉన్నిని నేసి ఉపయోగించుకోవచ్చని తెలుసుకున్నారు. గుహల్లో జీవించడం నుండి స్వయంగా కట్టె, పొరుక, ఆకులు, అలములతో గుడిసెలు వేసుకోవడం, రాళ్లతో గోడలు పెట్టడం నేర్చుకున్నారు.

కుండలు తయారు చేయడం నేర్చుకున్న తరువాత ధాన్యం నిల్వతో పాటు నీటి నిల్వ చేసుకోవడం తెలిసింది. అంతదాకా వాగులు, నదులు వెంట సాగిన మానవ ప్రస్థానం వాగులు, నదుల వరదలకు దూరంగా ఉండగలిగే అవకాశం పెరిగింది. ఆకులు కట్టుకోవడం నుండి తోలుబట్టలకు ఆ తరువాత ఉన్ని, తాటినార తొడుగులకు, గొంగళ్లకు మారే క్రమంలో పత్తి నుండి దారం తీయవచ్చని కనుగొన్నారు. అలాగే పట్టు పురుగుల నుండి పట్టుదారం తీయవచ్చని, అలాగే జనపనార నుండి జనపదారం తీయవచ్చని తెలుసుకున్నారు. చేనేతకులాల పూర్వీకులైన భావనారుషి, మార్కండేయ, తదితర పూర్వీకుల ఇతిహాస చరిత్రతో ఈ నవల ప్రారంభించం విశేషం. రామాయణంలో అరణ్యవాసంలో ఉన్న సీతారామ లక్ష్మణులు నార దుస్తులు ధరించినట్టు తెలుస్తున్నది. అలా అనేక నారలతో దుస్తులు, తడకలు, గంపలు, బాణాలు, విల్లులు తయారు చేసుకున్నారు. ఈ పరిణామాల్లో పత్తి, పట్టు, నూలు వడకం, వాటితో బట్టలు నేయడం అనేవాటికి మరింత నైపుణ్యం అవసరమయ్యాయి.

పాతరాతి, కొత్తరాతి, కంచు, రాగి యుగం నుండి ఇనుప యుగానికి మానవ వికాసం జరిగిన క్రమంలో నూలు వస్త్రాలు, పట్టువస్త్రాలు తయారు చేసుకోవడం నేర్చుకున్నారు. వేలయేళ్లుగా ప్రజలు తమ వస్త్రాల కోసం తామే స్వయంగా పత్తి పండించి, దారం వడికి బట్టలు నేసే వారికి ఇచ్చి బట్టలు నేయించుకునేవారు. అలాగే పట్టు దారం వడికి పట్టు వస్త్రాలు నేయించుకునే వారు. పారిశ్రామిక విప్లవంలో భాగంగా తొలిదశలో జెన్నీ నూలు వడుకు యంత్రం కనుక్కోవడంతో దారం మిల్లుపై తయారు చేయడం మొదలయింది.

అంతదాక చేతితో వడికిన దారంతో తయారైన వస్త్రాలను ప్రస్తుతం ఖాదీ వస్త్రాలని పిలుస్తున్నారు. మిల్లులో వడికిన దారంతో చేతిమగ్గంపై తయారయిన వస్త్రాలను చేనేత వస్త్రాలని పిలుస్తున్నారు. నూలు వడకం, బట్టలు నేయడం, సోజింగ్‌,  ప్రాసెసింగ్‌, రంగుల అద్దకం, డిజైన్‌లతో సహా అన్ని మిల్లుల ద్వారానే ఉత్పత్తి చేసినవాటిని మిల్లు బట్టలు అని పిలుస్తున్నాం. ఇప్పుడు మిల్లు బట్టలపో ఉత్పత్తి చేస్తున్న డిజెాన్‌లు, సోజింగ్‌, ప్రాసెసింగ్‌, రంగుల అద్దకం, మగ్గంనేత అన్నీ చేనేత వృత్తి కులాల వాళ్లు వేలయేళ్లుగా చేతి పరిశ్రమగా, కుటీర పరిశ్రమగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. వ్యవసాయం తరువాత దేశంలో అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమ బట్టల పరిశ్రమ.

అదెలాగంటే… పత్తి పండించం, పత్తి గింజలు వేరు చేసి దూదిగా మార్చడం, దూది నుండి దారం వడకం, దారాన్ని లడులుగా, పొంటెలుగా వడికి రంగులు అద్దం, ఎండబెట్టం, పడుగు పోయడం, గంజితో సరిచేయడం, ఆ తరువాత మగ్గంమీదికి ఎక్కించి అడ్డపోగు ఎక్కించడానికి మగ్గంతో నేయడం జరిగేది. చేనేత వృత్తికి ఎన్నో పరికరాలు, సాధనాలు అవసరం. నిలువు పడుగు పోసే పంటెను, బట్టనేసే మగ్గాన్ని, నేసిన బట్టను చుట్టనికి దోనుగును, కాళ్లతో దారాలను పైకికిందికి జరపడానికి పాదుకలను, చీరెపై రావాల్సిన డిజైన్లకు సంబంధించిన ‘పింజర’ను కర్రతో వడ్రంగి, విశ్వకర్మలు తయారు చేస్తారు. సహజ రంగుల కోసం ముదిరాజ్‌, తెనుగు తదితర కులాల వారు అటవీ ఉత్పత్తులను, చెట్టు బెరులను, కాయలను, పండ్లను సేకరిస్తారు. నిలువుపేటికను సరిచేయడనికి ఎరుకలి కుంచెలు అవసరం. సగం పోగులు పోకి, సగం పోగులు కిందికి జరపడానికిగాను ల్యాక బద్దలు అవసరం. వీటిని వెదురు బొంగుల నుండి చీరి నునుపుగా తయారు చేయడం అవసరం. నాడెకు నాణ్యమైన ఇనుప ముల్లు అవసరం. ఇలా అనేక కులవృత్తుల నాణ్యతను ఉపయోగించుకొని నేయడం ద్వారా వస్త్రం తయారవుతుంది. ఇలా ఇన్ని వృత్తులకు కేంద్ర వృత్తిగా చేనేత కుటీర పరిశ్రమ కొనసాగం వల్ల వ్యవసాయం తరువాత అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పరిశ్రమగా వేలయేళ్లుగా విరాజిల్లింది. వీటి పరిణామాలన్నింని ‘అగ్గిపెట్టెలో ఆరుగజాలు’ నవలలో మంథా భానుమతి ఎంతో పరిశోధన చేసి మానవ సంబంధాల్లో భాగంగా వివరించారు.

నేత పరిశ్రమలో నేడు  ఎన్నో దశలు, ఉన్నత ప్రమాణాల యంత్రాలు, రంగులు, డిజైన్లు, సాంకేతిక ఇంజనీర్లు కొనసాగుతున్నాయి.

కోట్లాది మంది ఇంకా వెనుకటి కాలంలోని చేనేత మగ్గంపై  ఆధారపడి బతుకుతూ జీవన ప్రమాణాలు పెంచుకోలేక ఆకలి చావులకు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. కొందరు చదువుకొని ఇతర రంగాల్లో ఎదుగుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, టీచర్లుగా, లెక్చరర్లుగా, సైంటిస్టులుగా, అడ్వకేట్లుగా ఎదుగుతున్నారు. గత శతాబ్ది ప్రారంభంలో మిల్లు బట్టలతో కునారిల్లిపోయిన చేనేత బతుకులకు

ఆసరాగా చేనేత సహకార సంఘాలను, ఆధునిక విద్య, ఆధునిక వృత్తుల్లో ఎదగనికి వసతి గృహాలను నిర్మించుకున్నారు. అలా అనేక కులాలు అదే మార్గంలో నడిచాయి. చేనేత కులాల జీవితాలు, సంస్కృతి గురించి ఆధునిక సమాజంలో వారి వికాసం, పతనాలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, రాజకీయ నాయకులుగా ఎదుగుతున్న క్రమం గురించి నేను అనేక కథంలు రాశాను. వాటిలో

కొన్నింటిని ‘చికాగోలో నానమ్మ’ అనే కథంల సంపుటిలో సంపుటీకరించాను. అయితే చేనేత కార్మిక కుటుంబంలో పుట్టి, చేనేత కార్మికుల జీవితాలను ఒక నవలగా రాయలేకపోయాను. ఇది ఎక్కువ విషయాలు తెలియడం వల్లనో, వర్తమానంలో నేత పరిశ్రమలో, వారి జీవితాల్లో వస్తున్న మార్పులు ఆకళింపు చేసుకోకపోవడం వల్లనో జరుగుతున్నది. ఈ కర్తవ్యాన్ని ఎంతో దీక్షతో, పరిశోధనతో నిర్వహించి వర్తమాన నేత కార్మికుల జీవితాలు, నేత పరిశ్రమ పోతున్న పోకడలు, దేశ వ్యాప్తంగా విస్తరించిన పరిశ్రమలోని వైవిధ్యం అంతటినీ ఒక్కచోట రాసిపోసి అందించిన మహోన్నత నవల ‘అగ్గిపెట్టెలో ఆరుగజాలు’.

ఈ నవలను చేనేత కులాలలో పుట్టిన ప్రతి ఒక్కరూ చదివి తమ ప్రాచీన, ఆధునిక జీవితాల పరిణామాలను తెలుసుకోవాలి. చరిత్రలో చేనేత కులాలు, నైపుణ్యాలు నిర్వహించిన పాత్ర ప్రస్తుత సమాజంలో మారుతున్న వారి జీవితాలు, వస్త్ర రంగంలో వస్తున్న అనేక పరిణామాలు తెలుసుకోవడనికి ప్రతి ఒక్కరూ ఈ నవల చదవడం అవసరం. ఏ వస్త్రధారణ ద్వారా నేటి సమాజంలో మానవ సమాజం నాగరిక సమాజంగా రూపుదాల్చుతున్నదో ఆ వస్త్ర ఉత్పత్తి క్రమాలను తెలుసుకోవడానికి ఈ నవలను అందరూ చదవడం అవసరం. విస్తారంగా పర్యటించి, పరిశోధించి వాటన్నిలో చాలామేరకు నవలా రూపంలో ఇమడ్చడానికి విశేష కృషి చేసిన రచయిత్రి మంథా భానుమతి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

1 thought on “అగ్గ్గిపెట్టెలో ఆరు గజాలు – సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *