April 26, 2024

మాలిక పత్రిక ఫిబ్రవరి 2016 సంచికకు స్వాగతం

ఈ సంచికలోని విశేషాలు  1. వలలుడూ – తాండావకేళి సల్పెనే… 2. హిమము కురిసిన వేళ 3. “అగ్గి పెట్టెలో ఆరు గజాలు” – పుస్తక సమీక్ష 4. మనోగతం – వ్యక్తిబాగుంటేనే సమాజం బాగుంటుంది…. 5. రెక్కల గుఱ్ఱం: ఆడియో కథ 6. సామరాగ లక్షణాలు 7. “కాఫీ ” రాగంలో – కొన్ని కీర్తనలు, సినిమా పాటలు 8. శుభోదయం-5 9. యాత్రామాలిక – విశాఖపట్నం 10. యాత్రా మాలిక: భోపాల్ 11. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి -3: విశ్లేషణ 12. కార్టూన్లు 13. ప్రణయ విజృంభణ 14. మనోర్పితం 15. వాడే వీడు 16. మా నాన్న […]

వలలుడూ – తాండావకేళి సల్పెనే…

  వంశీ మాగంటి ________   కుండలా కాంతూలూ మెరయ దండిగా  అందెలూ మ్రోయ దండిగా గంటె చేబూని థళాంథళాం యని థణినాదముతో   || తాండా ||   నీటీచుక్క సుయ్యిమని పాడాగా గంటెలు తాళమూ వేయగ వంటింటి కొలువూన వలలుడూ తధిమిత కుంతరి తకుఝణ తకథిమి  || తాండా ||   అల్లమూతల్లి వీణామీటాగా ఉల్పాయలు తాళమూ వేయగ మిరిచీలూ మృదంగమూ వాయించగను పరీపరీ పరి పరి పరి విధముల || తాండా ||   […]

హిమము కురిసిన వేళ

  జెజ్జాల కృష్ణ మోహన రావు   పరిచయము – గడచిన వారము జనవరి22 నుండి 24 వఱకు మా ఊళ్లో (ఫ్రెడరిక్, మేరిలాండ్, అమెరికా తూర్పు తీరము) భారీగా మంచు  కురిసింది. ఇది అలాటి ఇలాటి హిమపాతము కాదు. మూడు అడుగుల మంచు. 22 శుక్రవారము రాత్రి ప్రారంభమై 23 శనివారమంతా, 24 ఆదివారము ఉదయము కురిసింది. ఒక్కొక్కప్పుడు గంటకు   రెండు మూడు అంగుళాలు. దీనితోబాటు సుమారు 30 మైళ్ల వేగపు గాలి. దీనినే blizzard […]

“అగ్గి పెట్టెలో ఆరు గజాలు” – పుస్తక సమీక్ష

సమీక్ష: పుష్యమి సాగర్  నేత పని చేసే వాళ్ళ బ్రతుకు చిత్రమే ఈ “అగ్గి పెట్టెలో ఆరు గజాలు”.  ఒక చిన్న అగ్గి పెట్టెలో ఆరు గజాల చీరని ఇమిడ్చిన కళా నైపుణ్యం ఎలా అబ్బిందీ, అందుకు వారు చేసిన కృషి ఏమిటీ మొదలైన విషయాలతో వస్త్రాల వెనుక వెలిసిపోయిన జీవితాల గురించి ఆకట్టుకునే కధనంతో రచయిత్రి మంధా భానుమతి గారు ఆసాంతం చదివింపజేశారు. మనిషికి కూడు, గుడ్డ, నివాసం కనీస అవసరాలు. మనం ధరించే వస్త్రాల […]

మనోగతం – వ్యక్తిబాగుంటేనే సమాజం బాగుంటుంది….

                                       డా. శ్రీసత్య గౌతమి   అమ్మాయిలకు పెద్ద చదువెందులకు, భర్తనెదిరించడానికా? ఆమెకి ఆర్ధిక స్వాతంత్ర్యమెందుకు… అత్తవారికుటుంబానికి అడుగులకుమడుగొలొత్తకుండా తప్పించుకోవడానికా? సంసారాల్లో వచ్చే సర్దుబాట్లు కేవలం ఇంటికివచ్చే కోడలికే పరిమి తం గానీ ఆమె ఇష్టాయిష్టాలకు సర్దుకోవలసిన అవసరం మిగితావారికిలేదు, అవన్నీపాటిస్తే ఆమె మీద పెద్దరికం ఎలా నిలుస్తుంది? అలా నిలవాలంటే […]

సామరాగ లక్షణాలు

                                             భారతీప్రకాష్   సామ రాగం 28.వ. మేళకర్త రాగమైన హరికాంభోజి నుండి పుట్టినది.   ఆరోహణ   : స రి మ ప ద స.   స. ద ప మ గ రి స   షడ్జమ పంచమాలతో పాటు ఈ […]

“కాఫీ ” రాగంలో – కొన్ని కీర్తనలు, సినిమా పాటలు

                                                        వైశాలి పేరి    శాస్త్రీయ సంగీతములో ఇరవైరెండొవ  మేళకర్త రాగము ఖరహరప్రియ.  ఖరహరప్రియకు జన్య రాగలలో ఒకటి “‘కాఫీ” రాగము.   ఆరోహణ : S R g m P D n s అవరోహణ : […]

శుభోదయం-5

                                                               రచన: డి.కామేశ్వరి వారిద్దరిమధ్య ప్రేమానురాగాలు శాశ్వతమని, ఒకరికొకరం అనుకుని మురిసే జంటకి – అనుకున్నట్లంతా అయితే యింక నా ఉనికిని మీరు విస్మరిస్తారు. మీ జీవితాలు మీ చెప్పుచేతల్లో లేవు నా చెప్పుచేతల్లో […]

యాత్రామాలిక – విశాఖపట్నం

పుష్యమీ సాగర్   మన రెండు రాష్ట్రాలలో నేను ఎంతో ఇష్టపడే ప్రదేశాల్లో వైజాగ్ ఒకటి, చిన్నప్పటి నుండి వేసవి కాలం సెలవులు వచ్చినప్పుడు చూసేవాడిని. అయితే ఉరుకుల పరుగుల జీవితం లో అవన్నీ వెనకబడి పోయాయి…ఇదిగో మా కమల (శ్రీమతి) పుణ్యాన మరల ఆ అదృష్టం దక్కింది ఎందుకంటే మా శ్రీమతి పుట్టిన వూరు వైజాగ్ మరి. ప్రతి సంవత్సరం సంక్రాంతి కి వారి వూరు వెళ్ళడం ఆనవాయితి. ఈ సారి కూడా వెళ్దామని నిశ్చయించి […]