May 3, 2024

నీలి చందమామ

సమీక్ష: సుజల గంటి

IMG_20151230_180852

ప్రముఖ రచయిత్రి తమిరిశ జానకి గారి నవల “నీలి చందమామ” అన్న నవలను పాఠకులకు పరిచయం చేయదల్చుకున్నాను. నవలలో పాత్రల పేర్లు పెట్టడంలో కూడా నూతనత్వం కనబడింది నాకు. ఆవిడ కవియిత్రి కూడా కావడంతో ఈ నవల లో మనం కవిత్వాన్ని కూడా దర్శించగలం.
ఇది డిటెక్టివ నవల కాదు. కానీ చక్కని సస్పెన్స్ తో కధను ముందుకు నడిపించారు. తరువాత ఏం జరగబోతుందన్న ఉత్కంఠత పాఠకులకు కలుగుతుంది. యజ్ఞపతి రేష్మాల కుమార్తె “కృతమాలిక”. ఆమె నాట్యమయూరి. కౌండిన్య అన్న అతని ప్రేమలో పడుతుంది. అతను తన ప్రియురాలి నీలికళ్ళ అధ్భుత సౌందర్యానికి అచ్చెరువొంది ఆమెకు ముద్దుగా “నీలి చందమామ” అన్న ముద్దు పేరు పెడతాడు. అదే నవల పేరు.
దొంగ వ్యాపారాలు చేసే కౌండిన్య ఆడపిల్లల జీవితాలతో చెలగాటాలాడుతూ తనకు అడ్డువచ్చిన వాళ్ళను హతమారుస్తూ చట్టానికి చిక్కకుండా సంఘంలో పెద్దమనిషిగా చెలామణి అవు తూంటాడు. ఆడపిల్లలను తన మాయమాటలతో ఆకర్షించడం అతనికి వెన్నతో బెట్టిన విద్య. తను చేసేవన్నీ చీకటి వ్యాపారాలే. పాము కుబుసాలు అమ్మడం పిచ్చాసుపత్రి అధిపతిగా వ్యవహరిస్తూ వారి అవయవాల తో రహస్యంగా వ్యాపారం చెయ్యడం కూడా అతని రహస్య కలాపాల్లో ఒక భాగం. తన బిజినెస్ పెట్టుబడి కోసం ఒక అమ్మాయిని మోసంచేసి వివాహం చేసుకోవడం, ఆమె అతని వెతుక్కుంటూ వస్తే ఆమె తన దారికి అడ్డు అని తొలగించడం చేస్తాడు.
ఇంక బైరాగి పాత్ర. తన తండ్రి ని చంపిన వాడి తో కృతమాలికను చూసి ఆమె పారిపోయి నిస్సహయత స్థితిలో ఉన్నప్పుడు ఆమె తనను చంపడానికి వచ్చిందని భయపడతాడు. ఇక్కడ కూడా రచయిత్రి సస్పెన్స్ బాగా మైంటైన్ చేసారు.
కౌండిన్య స్నేహితుడు భరద్వాజ స్నేహితుడికి అన్ని విషయాల్లోనూ సహాయపడ్డా, తాగి తాగి చివరకు లివర్ పాడయిపోయిన స్థితిలో జీవితం చివరలో మంచిపని చెయ్యాలన్న ఉద్దేశంతో కౌండిన్య గుట్టు రట్టు పెట్టడంలో సహాయం అందించడం, కౌండిన్య పోలీసులకు సాక్ష్యాధారాలతో పట్టుబడడంతో కధ ముగుస్తుంది.
ఈ కధ చదివితే సస్పెన్స్ కావాలంటే డిటెక్టివ్ నవలలే కాదు సామాజిక కధలల్లో కూడా ఉంటాయన్నవిషయం అవగతమవుతుంది. చదివి ఆనందించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *