July 1, 2024

మాలిక పత్రిక జూన్ 2024 సంచికకు స్వాగతం

    మాలిక పాఠకులు, మిత్రులు, రచయితలకు సాదర ఆహ్వానం… మండే ఎండలనుండి ఉపశమనము కలిగిస్తూ వానజల్లుల హోరు మొదలైంది. ఇది చిరుజల్లుల వరకైతే అందరికీ హాయిగా, ఆనందంగానే ఉంటుంది. కాని అది భీభత్సంగా మారినప్పుడు అందరికీ కష్టమే. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు ఏ కాలమైనా సాధారణంగా ఉంటే అంతా బావుంటుంది. తీవ్రంగా మారినప్పుడే ఇబ్బందులు మొదలై అమ్మో అనుకుంటాం. కాలానుగుణంగా ఆహారం, ఆహార్యం అన్నీ మారతాయి. మల్లెల కాలం చివరికొచ్చింది. సన్నజాజుల సువాసనలు మొదలయ్యాయి […]

సుందరము సుమధురము – తాను నేను మొయిలు మిన్ను

రచన: నండూరి సుందరీ నాగమణి ఈ నెల ఈ శీర్షికలో ఒక కొత్త సినిమాలోని గీతాన్ని గురించి చర్చించుకుందాము. ‘సాహసం శ్వాసగా సాగిపో’ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విడుదల అయిన ఈ చిత్రం 2016 విడుదల అయింది. చిత్ర కథానాయకుడిగా అక్కినేని నాగచైతన్య, కథానాయికగా మంజిమా మోహన్ నటించారు. ఈ చిత్రానికి శ్రీ ఏ ఆర్ రహమాన్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లోని ‘తానూ నేనూ…’ అనే సోలో గీతం ఈనెల పరిచయం చేయాలని […]

స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -10

రచన: డా. లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద 24. పని- కుటుంబం, పని-కుటుంబం. డా. పీజే బ్రహ్మానందం (డా. పీజేబీ) పీజీ ఐ ఎమ్ ఈ ఆర్ లో మా ఆర్థోపీడిక్ కొలీగ్స్ లో ఒకరు, విజయ వాడలో రెండేళ్ళుగా ప్రాక్టీస్ చేస్తూ మాకు చాలా సహాయపడుతున్నారు. అతను నన్ను చుట్టుపక్కల గ్రామాలకు తీసుకువెళ్ళి నన్ను ప్లాస్టిక్ సర్జన్ గా పరిచయం చేస్తాడు. మేం సలీం ఒక గాస్ట్రోస్కోప్ తెప్పిస్తాడనీ , మొట్టమొదటిసారి వస్తున్న పరికరం […]

మా ఊరి తొలకరి

రచన: రమా శాండిల్య నేను, ఎప్పుడూ చెబుతుంటాను కదా, మా ఊరు చాలా చిన్న పల్లె! అక్కడికి వెళ్ళటానికి బస్ కానీ మరే పెద్ద వాహనం గానీ వెళ్లలేని చాలా చిన్న బంకమన్ను రోడ్లు… చిన్న నీటి చుక్క పడినా జారిపడిపోవటం ఖాయం. పగలు చూస్తే భూలోకస్వర్గమే మా ఊరంటే… ఒక ప్రక్క తివాచీ పరిచినట్లుండే లేతాకుపచ్చటి వరిచేలు, మరొక ప్రక్క పంట కాలువనానుకుని, కొబ్బరి, అరటి తోటలుంటాయి. వరిచేలకు, పంట కాలువకు మధ్య నల్లటి తారు […]

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 11

రచన: రామలక్ష్మి కొంపెల్ల ఇంతవరకు మనం సంగీతంలో అనేక విభాగాల్లో రాగమాలికల గురించి తెలుసుకున్నాం. ఈ సంచిక నుంచి మనం సినిమాపాటల్లో కొన్ని రాగమాలికల గురించి తెలుసుకుందాం. సినిమాపాట అన్నది మనందరికీ కూడా చాలా ఇష్టమైన అంశంగా చెప్పవచ్చు. దృశ్య శ్రవణ మాధ్యమంగా అందరికీ చేరువైనది సినిమా. 3 గంటల వ్యవధిలో ప్రేక్షకులను మైమరపింపజేసేది సినిమా. ఈ మాధ్యమాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రజలకు మంచిని బోధించడానికి ప్రయత్నించి సఫలీకృతులైన దర్శకులు, నిర్మాతలు సినీప్రపంచంలో కోకొల్లలు. అటువంటి ఒక […]

తెల్ల కాగితం

రచన: జ్యోతి వలబోజు   “అమ్మా! ఒకసారి నా మాటినవే!” “ఏంట్రా?” “మరే! మరే! నువ్వెప్పుడూ నాకు వాళ్లని వీళ్ళని అడిగి తెచ్చిన పాత పుస్తకాలనుండి తీసిన కాగితాలతో మళ్ళీ క్లాసుబుక్కుల్లా కుట్టి ఇస్తావు కదా! ఒక్కసారి కొత్త పుస్తకం కొనివ్వవా? నాకు అందరి కంటే ఎక్కువ మార్కులొచ్చినా కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు. ‘చిత్తు కాగితాలోడా’ అని.” “నేనేం చేసేదిరా? మీ అయ్య సంపాదించినదంతా తాగుడుకే తగలేస్తాడూ. నిన్ను కూడా పనిలో పెడతానంటే నేనే […]

అమ్మమ్మ – 57

రచన: గిరిజ పీసపాటి “అలా చెయ్యము వదినగారూ! కావాలంటే మళ్ళీ మీరు వెళ్ళి, ఒకమారు వెతికి రండి. కనబడితే ఇప్పుడే మీ డబ్బు వెనక్కిచ్చేసి, అందరం క్షమాపణ కోరుతాం” అంది వసంత. వసంత మాటంటే గురి ఉన్న పిల్లలు కూడా “అవును” అంటూ ముక్త కంఠంతో అరిచారు. పెద్దలు ‘ఏం జరుగుందా’ అని వినోదం చూస్తున్నారు. “అయితే ఒక పని చేద్దాం. ఇద్దరం ఒకేసారి గదిలోకి వెళదాం. మీరు కామేశ్వరిని దాచిన చోటు నాకు చూపించి, నా […]

ఎనిమిదో అడుగు

రచన: డా. వివేకానందమూర్తి రేవతి డాక్టరు. ఎక్స్‌రే డిపార్టుమెంటులో పని చేస్తుంది. రేడియాలజిస్టు. హాస్పిటల్లో అందరూ ఆమెను ఎక్స్ రేవతి అని పిలుస్తారు. ఆమె అందంగా ఉంటుంది. ఎంచక్కా ఉంటుంది. ఏపుగా ఉంటుంది. అంచేత కొందరు ఆమెను సెక్స్ రేవతి అని కూడా పిలుస్తారు. ఆమెకు అందమే కాదు. నలుగురికీ నచ్చే గుణవతి కూడా, అందరినీ మందహాసంతో మధురంగా పలుకరిస్తుంది. అవసరమై ఆడిగితే, అంతరాలు ఆలోచించకుండా ఆసరా అందిస్తుంది. ఆమె మంచితనం తెలిసినవారు ఆమెను రేవతిగారు అంటారు. […]

సెల్లే నా ప్రాణం

రచన: ఉమాదేవి కల్వకోట అరుణ అన్నం ముట్టి ఈ రోజుకి మూడు రోజులయింది. కడుపులో గాబరాగా ఉంది. నీరసంతో ఒళ్ళు తేలిపోతోంది. అసలే అరుణ ఫుడ్డీ… క్రొత్త క్రొత్త వంటలన్నా , చిరుతిళ్ళన్నాఇష్టం. చిన్న తనం నుండి కూడా గంటకు, రెండుగంటలకూ ఏదో ఒకటి తింటూనే ఉండడం ఆమెకు అలవాటు. అలాంటిది మూడు రోజులనుండి ఏమీ తినకుండా కేవలం నీళ్ళు తాగి ఉండడం ఓ ప్రపంచ వింతే. ఆమె అలా ఉండడానికి మొగుడేమైనా ఆమెమీద అరిచాడా, అలిగిందా? […]

ఆడవాళ్ళూ మీకు జోహార్లు!!

రచన: సంధ్యా రాణి సిరిప్రగడ “మీరు పాడటం బాగున్నా లేకున్నా, మీకు పాడాలనిపిస్తే పాడండి. ఇది కూడా ఒక వ్యాయామం. ఊపిరితిత్తులకి మంచి ఎక్సర్సైజ్ కాబట్టి ఎవడో వెక్కిరించాడని పాడటం ఆపేయకండి. పాడటం అనేది మీ ఒత్తిడిని సడలిస్తుంది, అంటే మీ బాడీకే కాదు బ్రెయిన్ కి కూడా. నేను పాడేటప్పుడు ఒకటే అనుకుంటాను, ఇప్పుడు నేను ఎలాంటి పోటీలకైతే వెళ్ళడం లేదు, నా గొంతు చాలా బాగుండాల్సిన అవసరం లేదు, నేను సినిమాలలో పాటలు పాడడానికి […]