July 5, 2024

బాలమాలిక – ‘బామ్మ నేర్పిన పాఠం.’

రచన: ఉమాదేవి కల్వకోట స్కూల్ వాన్ ఆగే ప్లేస్ లో తన ఫ్రెండ్ వరుణ్ కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్న బంటీ ముఖం వికసించింది. వరుణ్ కూడా నవ్వుతూ వచ్చి బంటీ పక్కనే నిలబడగానే వ్యాన్ రావటం, వీళ్ళు ఎక్కటం, వ్యాన్ కదలటం జరిగిపోయాయి. “హాయ్ రా వరుణ్…” “హాయ్ రా బంటీ…” “నిన్న సండే కదా… ఏంట్రా, ఏం చేసావు నిన్న?” కుతూహలంగా అడిగాడు వరుణ్. “నిన్న మేము ఒక బర్త్ డే పార్టీ […]

బాలమాలిక – ఎవరికి ఇవ్వాలి?

రచన: మంగు కృష్ణకుమారి రమేష్, శుశ్రుత్, గౌతమ్, కిరీటిలు కూచొని గట్టి చర్చలు చేస్తున్నారు. వీళ్ళు నలుగురూ ఒకటే ఎపార్టమెంట్‌లో వేరు వేరు ఫ్లోర్స్‌లో ఉంటారు. ఒకటే స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారు. వాళ్ళ క్లాస్మేట్ కిరణ్ పుట్టినరోజు రెండురోజుల్లో ఉంది. వాడికి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు. ఒకొక్కళ్ళూ ఒకొక్కటి చెప్పేరు. “అది కాదురా… కిరణ్ అసలే చాలా డబ్బున్న వాళ్ళబ్బాయి. మనం ఇచ్చేది గ్రాండ్‌గా ఉండాలి” శుశ్రుత్ అన్నాడు. మల్లాగుల్లాలు పడి, మంచి […]

బాలమాలిక – ‘నీవే వెలుగై వ్యాపించు…’

రచన: కొంపెల్ల రామలక్ష్మి స్కూల్ వాన్ ఆగే ప్లేస్ లో తన ఫ్రెండ్ వరుణ్ కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్న బంటీ ముఖం వికసించింది. వరుణ్ కూడా నవ్వుతూ వచ్చి బంటీ పక్కనే నిలబడగానే వ్యాన్ రావటం, వీళ్ళు ఎక్కటం, వ్యాన్ కదలటం జరిగిపోయాయి. “హాయ్ రా వరుణ్…” “హాయ్ రా బంటీ…” “నిన్న సండే కదా… ఏంట్రా, ఏం చేసావు నిన్న?” కుతూహలంగా అడిగాడు వరుణ్. “నిన్న మేము ఒక బర్త్ డే పార్టీ […]

బాలమాలిక – ‘నెపాలెందుకు?’

రచన: విశాలి పేరి సుధన్వ స్కూల్ నుంచి వచ్చి స్కూల్ బాగ్ విసిరేసి రాఘవయ్యగారి గదిలోకి వెళ్ళి “తాతయ్యా! నాకు రన్నింగ్ లో సెకండ్ వచ్చింది” అని చెప్పాడు. “కంగ్రాట్స్ నాన్నా!” అన్నాడు రాఘవయ్య. “నాకు పార్టీ కావాలి మరి!” అడిగాడు సుధన్వ. “ఓ తప్పకుండా, ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రా” సుధన్వ వంటింట్లోకి వెళ్ళి తల్లి, నాన్నమ్మ కి తను ఎలా గెలిచింది కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాడు. “అమ్మా ఎంత స్పీడ్ గా […]

వాసంత సమీరం

రచన : బుద్ధవరపు కామేశ్వరరావు వసంత ఋతువు వచ్చిందన్న సూచనగా అక్కడ ఉన్న పచ్చని చెట్లనుంచి చల్లటి పిల్లసమీరాలు అతడిని తాకుతున్నాయి. పచ్చని చేల మీద తిరిగే తెల్లని కొంగల్లా కనబడుతున్నారు, పచ్చటి మొక్కల మధ్య తెల్లటి యూనిఫారం వేసుకుని నడుస్తున్న ఆ బడి పిల్లలు. ఆ రోజునే అక్కడ టీచర్ గా చేరడానికి వచ్చిన చంద్రశేఖర్, ఆ దృశ్యం చూస్తూ బాల్యంలో తనకు దక్కని ఆ ఆనందాన్ని వాళ్లలో చూసుకుంటూ అలా కాసేపు మైమరచి ఉండిపోయాడు. […]

బాల మాలిక – ప్రోత్సాహంతోనే విజయం..

రచన: భోగా  పురుషోత్తం   ‘‘నమస్తే అంకుల్‌!’’  గుమ్మం బయటి నుంచి అంది పక్కింటి ప్రియాంక తలెత్తి చూశాడు పరంధామయ్య. ప్రియాంక నవ్వుతూ నిల్చొని వుంది. ఆ అమ్మాయిని చూస్తే పరంధామయ్యకి చిరాకు. ‘‘రవి లేడా అంకుల్‌ ’’ ప్రశ్నించింది ప్రియాంక. ‘‘ఉన్నాడు’’ పుస్తకం కింద పెడుతూ అన్నాడు పరంధామయ్య. టీవీ ఆపేసి పక్కకి తిరిగి చూశాడు రవి. పరీక్ష రాయడానికి ఏదో ఒకటి చదవమని పుస్తకం వంక చూడబోయింది ప్రియాంక. హిస్టరీ పుస్తకం అందించాడు రవి. […]

బాలమాలిక కథ – అడవిలో ఉగాది

రచన: కోనే నాగ వెంకట ఆంజనేయులు     ఉగాది పండుగ రోజు. ఊళ్ళో ఇల్లిల్లూ తిరిగే కాకి ఉదయాన్నే  అడవిలో జంతువులన్నిoటినీ మామిడి చెట్టు క్రింద సమావేశ పరిచింది. ఈ అత్యవసర సమావేశం దేనికో అర్థం కాని జంతువులన్నీ కాకి చెప్పే విషయం కోసం ఆత్రంగా ఎదురు చూడసాగేయి. కాకి గొంతు సవరించుకుంది. జంతువులన్నీ చెవులు రిక్కించాయి. “సోదరులారా! ఈరోజు ఉగాది పండుగ. ఊళ్ళో మనుషులందరూ ఈ పండుగని చాలా ఆనందంగా జరుపుకుంటారు. సంవత్సరంలో వచ్చే […]

కోకో

రచన: వి. రాజారామమోహనరావు “కోకో – మా కుక్క పేరు, మీకు నచ్చిందా? కోకో వెనకాల ఒక కథ ఉంది. దానికన్నా ముందు లియో గురించి చెప్పుకోవాలి. పక్షుల్నీ, కుక్కల్నీ ఇంట్లో పెంచడం నాకు అయిష్టం. హాయిగా తిరగాల్సిన వాటిని బంధించటమేమిటని నా అభిప్రాయం. కానీ మా అమ్మాయికి వాటిని పెంచడం అంటే ఎంతో ఇష్టం. ఎవరింట్లో ఏ పెంపుడు జంతువు కనిపించినా వాటితో తెగ ఆడేది. అయినా నాకు ఇష్టం లేదని తెలిసి ఎప్పుడూ ఏ […]

పువ్వుల వనము

రచన: సుజాత తిమ్మన బలపం పట్టిన పసి కరము ఓం నమః చెప్పే స్వరము అమాయక చూపుల సరము దేవునిచే పొందిన వరము అమృతవాక్కులు రాసే కలము మానవతే మనందరి కులము గంగమ్మ ఇచ్చిన ఈ జలము పవిత్రతను వెలికి తీసే హలము ఒక్కటై ఉంటేనే అది మనము కలిసి పనిచేస్తే ఎంతో ఘనము సంతోషమే మనకున్న ధనము పసినవ్వుల పువ్వుల వనము ***

బాల మాలిక – కందికాయలాంటి కమ్మని కథ

రచన: నండూరి సుందరీ నాగమణి అనగనగా… మరేమో… ఒకానొక దేశంలో… ఉల్లిపాయంత ఊరుండేదట. ఆ ఉల్లిపాయంత ఊరిలో బుడమకాయంత బుల్లోడు ఉండేవాడట… ఆ బుడమకాయంత బుల్లోడికి తామరకాయంత తండ్రి ఉన్నాడట. ఆ తామరకాయంత తండ్రి కాకరకాయంత కార్యాలయంలో పని చేస్తూ ఉండేవాడట. బుడమకాయంత బుల్లోడు బంగాళాదుంపంత బళ్ళో చదువుకుంటున్నాడట. ఆ బడిలో వీడికి చదువు చెప్పే పనసకాయంత పంతులమ్మ చెర్రీ పండంత చదువు చెప్పేదట. పుచ్చకాయంత ఫ్రెండ్స్ తో అనాసపండంత ఆటలా చదువు నేర్చుకుంటున్నాడు మన బుడమకాయంత […]