May 13, 2024

మాలిక పత్రిక మార్చ్ 2015 మహిళా ప్రత్యేక సంచికకు స్వాగతం

march 2015 title

 

Jyothivalaboju

Chief Editor and Content Head

అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి (International Women’s Day) గుర్తుగా సృష్టించబడిన వృత్తము స్త్రీ వృత్తము. దీనికి గణములు- స/స/స/స/త/ర (సీ యందలి ఈ-కారమునకు నాల్గు స-గణములు, త,ర ఒత్తులకు ఒక్కొక్క గణము). యతి మూడవ, ఐదవ గణములతో చెల్లును. ఈ లక్షణములు గల స్త్రీ వృత్తము ధృతి ఛందములో 83676వ వృత్తము. క్రింద  ఒక  ఉదాహరణము-
స్త్రీ – స/స/స/స/త/ర, యతి (1, 7, 13) 18 ధృతి 83676

తరివో, సిరివో, – దరివో, మురివో, – ధర్మమ్మొ, దాసివో
పరువో, మురువో, – బరువో, తరువో, – వాగ్దేవి వాణివో
వెరవో, పెరవో, – వెఱపో, చెఱపో, – ప్రేమామృతాబ్ధివో
చిరమో, క్షరమో, – స్థిరమో, పరమో, – స్త్రీదేవి నీవిలన్

(తరి – నౌక, దరి – మేర, మురి – కులుకు, గర్వము, మురువు – సౌందర్యము, వెరవు – యుక్తి, పెర – అన్య, వెఱపు – భయము, చెఱపు – కీడు, చిరము – శాశ్వతము, క్షరము – నశించునది, పరము – ఇహము కానిది)

మార్చ్ అనగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు వస్తుందని తెలుసు. ఈ సందర్భంగా మాలిక పత్రికను ప్రత్యేక మహిళా సంచికగా ఆవిష్కరిస్తుంది. ఈ సంచికలో ప్రత్యేకత ఏంటంటే అందరూ మహిళా రచయిత్రులే.. ఈసారి పత్రిక ఒక్కసారి కాకుండా నాలుగు భాగాలుగా ప్రతీ ఆదివారం ఒక్కో భాగం విడుదల అవుతుంది. మొదటి భాగంలోని విశేషాలు…

మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

1. భక్తి – ముక్తి
2. Happy Women’s Day
3. వీణ
4. రాగలహరి – కళ్యాణి
5. దివ్య ద్విగళ గీతాలు
6. బేటి బచావ్
7. నెచ్చెలి
8. మొండి గోడలు
9. తరుణి
10.జయహో మహిళా
11. కాలుతున్న పూలతీగలు
12.  పునీత
13. ఆడజన్మకెన్ని శోకాలో
14. అన్ని బుుతువుల ఆమని
15. Tv9 నవీన 
16. లాంతరు వెలుగులో

2 thoughts on “మాలిక పత్రిక మార్చ్ 2015 మహిళా ప్రత్యేక సంచికకు స్వాగతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *