May 13, 2024

అన్ని ఋతువుల ఆమని …..

రచన: కోసూరి ఉమాభారతి

చిత్రాలు: వాసు చెన్నుపల్లి

paduchu

బుడిబుడి అడుగుల బుజ్జాయికి

చిరునవ్వులొలికే పాపాయికి

అమ్మ తినిపించె గోరుముద్దలు

నాన్న కురిపించె ముద్దుమురిపాలు

 woman 2

పట్టుపావడలో  చిట్టితల్లి

తూనిగల్లె పరుగులెడుతూ

చిరుచేపల్లె తుళ్ళిపడుతూ

మురిపిస్తుంది మైమరిపిస్తుంది…

     bharya

మోముపై  అల్లలాడు ముంగురులతో

పెదవులపై తరగని సిరినగవులతో

పదహారు ప్రాయాన జవరాల యువరాణి

నడయాడె నట్టింట నీలవేణి

 gruhuni

నయగారాల నవవధువయ్యేను

అత్తింట అడుగిడి మేటి కోడలయయ్యేను

భర్త  ప్రేమలు, అత్తారి ఆప్యాయతలతో

ఆనందాలు వెల్లువై అతివ జీవనం విరసిల్లేను

mother vasu

 

ఎదుగుతున్న పిల్లలు

అందుతున్న గౌరవాలు

బరువు-బాధ్యతలు అధికమైనా

చవిచూసేనామె ‘అమ్మదనంలో కమ్మదనం!

 

అల్లుళ్ళు-కోడళ్ళ ఆగమనాలు

మనమల ముద్దు మురిపాలు

వెండౌతున్న కురులు

తడబడుతున్న అడుగులు

పెద్దరికమూ హుందాగనే సాగేను..

 

మేను అదిరినా, చూపు చెదిరినా

సాయంపట్టి ఆదరించే పరివారం

అడుగెయ్యను చేయూతనిచ్చే భర్త

అమ్మమ్మా, నానమ్మంటూ పిల్లా-జెల్లా

ఆమె ఉనికే పరిపూర్ణ సంతోషం!

 aamani

అన్ని ఋతువుల ఆమనిలా

అతివ జీవనం నిత్యం వసంతం

 

 

 

 

 

 

 

 

 

7 thoughts on “అన్ని ఋతువుల ఆమని …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *