May 21, 2024

మహిళా శాస్త్రవేత్త అన్నా మాణి

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు   పరిచయము – భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చిన సమయములో, అనగా 1940-60 ప్రాంతాలలో స్త్రీలకు విద్యావకాశములు, ముఖ్యముగా వైజ్ఞానిక రంగములో ఏ విధముగా ఉండినదో అన్నదే ఈ వ్యాసపు ముఖ్యాంశము. అంతెందుకు ఇరవై ముప్పయి సంవత్సరాలకు ముందు కూడ మహిళలు ఎక్కువగా పంతులమ్మల, నర్సుల, ప్రసూతి డాక్టరుల ఉద్యోగాలలో మాత్రమే ఉండేవాళ్లు. దీనికి మినహాయింపులు చాల తక్కువ.  ఐ.టి. రంగము, బ్యాంకులు విస్తరించిన పిదప ఈ స్థితి మారిందనే చెప్పవచ్చును. […]

చేరేదెటకో తెలిసీ … 1

రచన: స్వాతీ శ్రీపాద   ఎక్కడ ఉన్నదీ ఏమవుతున్నదీ ఏమీ అర్ధం కాడంలేదు ఆమెకు , తలలోలోపల ఎక్కడో ఏదో తొలిచేస్తున్న భావన. ఎక్కడో ఎవరో మూలుగుతున్నారు. ఆ స్వరం అంత సుపరిచితంగా వుందేం? అది ఆమెదే! ఎక్కడున్నాను? ఏం జరిగింది? జ్ఞాపకం గడ్డిపరకతో ఆమెకు అతీతంగా సాగింది. ఏదీ స్పష్టంగా లేదు. ఒక్కటీ అర్ధం కాడంలేదు. బాగా గుర్తున్నది కళ్ళల్లోకి దూసుకు వచ్చిన వెలుగు …………….ఆ తరువాత మెలికలు తిరిగిపోయేంత బాధ,… ఎప్పుడు……….. ఎప్పుడు జరిగిందది […]

ఆరాధ్య 7

రచన: అంగులూరి అంజనీదేవి   ”నీ బాధ నాకు తెలుసు హేమంత్‌! కానీ బాధపడకు. ఎందుకంటే ఆయన మొదటి నుండి అదో టైప్‌ మనిషి! ఏది అనుకుంటే అదే చెయ్యాలనుకుంటాడు. అది అయ్యేంత వరకు వేరే పని ముట్టుకోడు. ఇప్పుడు ఆయన కాన్‌సన్‌ట్రేషన్‌ అంతా కోర్టు ఇచ్చే తీర్పు మీదనే వుంది. అందుకే నేను కూడా ఆయన్ని డిస్టర్బ్‌ చేయదలచుకోలేదు. నేనేం చెప్పినా ఆయన వినే పొజిషన్‌లో లేరు” ”నాన్నను నువ్వు మార్చుకోవచ్చు కదమ్మా!” ”ఆయన్ని మార్చుకోలేక […]

Rj వంశీతో అనగా అనగా…

ఈసారి నీలం చొక్కా మనిషి గురించి ఎన్నో విషయాలు చెప్తున్నారు మంచి మంచి పాటలు కూడా కలిపి.. విందాం పదండి.. ఎక్కడ, ఎలా అంటారా? ఈ నీలంరంగుమీద కాస్త తట్టండి…

పుకార్ల పురాణ౦ – పద్మావతమ్మ కధా సరిత్సాగరం

రచన: లిపి జ్వలన   “ అవార్డుల లక్ష్మి కధ తెలుసా ?” అంటూ ఆనాటి సమావేశం ఆరంభించింది ఆకాశవాణి. ఆకాశవాణి అంటే రేడియో అనుకుని భ్రమపడేరు.. కాదు కాదు ముమ్మాటికీ కాదు. ఆకాశం నుండి వార్తలు పుట్టించి అన్ని వైపులా వాటిని వెదజల్లే పుకార్ల పురాణ పద్మావతమ్మ బిరుదు  అది. పద్మావతమ్మ వయసు కాస్త అటూ ఇటూగా అర్ధశతకానికి  మరో పది . అంటే అర్ధం అవదేమో అరవై కి అటూఇటూ.. పాత న్యూస్ పేపర్లు […]

పచ్చనాకు కళ

రచన, ఆర్టిస్ట్: ముక్తవరం వసంతకుమారి, పత్రచిత్రకారిణి      “పండుటాకులమై మిగిలి వగచేకన్నా, ఎండుటాకులో నిండు జీవితాలను పచ్చగా సృజించి శిశిర వసంతంగా శోభిద్దాం” కొత్తగా ఆలోచించడమే సృజన.  మనం రోజూ చూసే ఆకులకూ, రాలిన ఆకులకూ, ఎవరూ పట్టించుకోని ఆకులకూ వసంతం ఉంటుందని ఊహించాను. చూసే దృష్టి ఉంటే ఒక చిన్న ఆకులో కూడా సృజనాత్మకతను దర్శించగలడు ఆర్టిస్ట్. ఒక క్రమబధ్ధంగా  ఆకులను అమర్చడంలో కూడా ఒక ప్రత్యేకత ఉండాలనుకుని, వాటిని యధాతధంగా తీసుకుని, ఊహించుకున్న […]

ll అంకితమిస్తున్నా నీకై ….నీతిలేని ఓ శాసనాన్ని ll

రచన: సిరి వడ్డే కలల సౌధాలెన్నో కట్టుకున్న కన్నె వధువు కంట కావేరీ జల తరంగాలనే పొంగిస్తూ మూడు ముళ్ళు వేయించుకున్న పాపాన తాళితో ఉరినే బిగిస్తూ,   కనికరం చూపించారా ఏనాడైనా కరుణతో పలుకరించారా పొరపాటుగానైనా ఆత్మీయులై దరిచేరారా కలనైనా అనురాగం కురిపించారా క్షణమైనా ?   మీకు శ్రమదానం చేయడానికే కన్నారా ఆడబిడ్డలను తల్లిదండ్రులు లక్షలు ధారబోసి కొనిపెట్టిన మగబొమ్మలు మీరు పెత్తనం చేసే అధికారం ఎవరిచ్చారు మీకు ? ఎక్కడనుండి వచ్చిందని మా […]

హృదికవాటం

రచన, చిత్రం: కృష్ణ అశోక్   నా రెండు కళ్లు ఆకాశంలోకి చూస్తున్నాయి. కుక్కవంటి ఆకారం క్రమంగా సింహంగా మారుతున్నట్లు, పాముతోకకి ఆవును కట్టినట్లు, పరిగెడుతున్న మనిషిని పెద్ద భూతం ఆక్రమిస్తున్నట్లు, పిచ్చిపిచ్చిగా ఆకారాల్ని సృష్టిస్తున్నాయ్ మేఘాలు. ఎక్కడో దూరం నుంచి తెరలు తెరలుగా వస్తున్న హమ్మింగ్. వాటిని నా కర్ణభేరి ప్రకంపనాలుగా నా హృదయానికి చేరవేసింది.  అది వినగానే పొట్టలోని ప్రేవులన్నీ వాంతి అవుతున్న ఆనుభూతి. అది సంగీత నాదం కాదు. ఓ ఆర్తనాదం అంటోంది […]

మనసుపై చెరగని ఛాయాచిత్రం సూర్యుని నీడ.

సమీక్ష: సి.ఉమాదేవి స్వాతంత్ర్యం మనిషికి ఊపిరినందించే ప్రాణవాయువు. కుత్తుకనునొక్కి ప్రాణాలను గిలగిలలాడించే కుతంత్రాలు,కుయుక్తులు అమాయక ప్రజల బ్రతుకులపై తుపాకీ గుండ్లు దొర్లించి వారి బ్రతుకు బండలు చేసి జబ్బలు చరచుకున్న ఒకనాటి వికృతకేళికి అక్షరరూపం సూర్యుని నీడ. ఆనాటి అరాచకత్వంపై సంధింపబడిన ఉద్యమస్ఫూర్థిని చారిత్రక మథనం కాదు కన్నీటి మథనం చేసి మనముందు సజీవచిత్రంగా నిలిపారు. బైరాన్ పల్లె, చిన్న పల్లెటూరయినా పోరాడే తత్వానికి పెద్దదే! తమపై విచక్షణాశూన్యంగా విరుచుకుపడ్డ వారిపై కాలు దువ్విన చాకలి రాజవ్వ […]