May 17, 2024

అభాగ్యపు బాలల జీవితాలు

రచన : ప్రియ నాయుడు

poor kids-1

దుర్భర దారిద్రము మిగిల్చిన అనాధ బూడిద బ్రతుకులు మీవి
చిక్కని చీకటి దుప్పటి కప్పిన అంధకార జీవితాలు మీవి
భయంకర బాధల శోకం తరిమి తరిమి కొడుతుంటే
బక్కచిక్కిన భీబత్స బాల్యపు భయంకర బతుకులు మీవి

చితి మంటల సాక్షిగా చితికిన బాల్యపు అరణ్య రోదన మీది
గాండ్రించి ఊసిన కామవాంచలు చిమ్మిన ఊపిరిలు మీవి
కొవ్వు పట్టి సందుల గొందుల పందుల వలే నేల దొర్లిన
క్షణిక కామ కోరికల.కండకావరాల కార్చిన వ్యర్ధాలు మీరు

సిగ్గు ఎగ్గు లజ్జ కనికరం లేని ఈ కుళ్ళి పోయిన వ్యవస్థలో
దిక్కులేని బతక తెలియని బిచ్చగాళ్ళ దుర్బర గుర్తులు మీవి
ఎంత ఎక్కు పెట్టి ఎలుగెత్తి గొంతెత్తి గగ్గోలు పెట్టి గీపెట్టినా
మీకు పట్టిన ఈ దయనీయ జీవితాలకు విముక్తి లేదు

భగ భగ మండే అగ్ని కణాల సాక్షిగా బుగ్గి పాలైన
మీ బాల్యానికి ..కరుడు కట్టిన జీవితాలకు విముక్తి లేదు
మీరే పడే పసితనపు బాధలకు వర్ణన కుదిరే అక్షరాలు లేవు
ఎన్నాళ్ళు భరిస్తారు ఆ మౌనఘోషను ,ఈ వల్లకాడు బ్రతుకులను

ఉపేక్షించకండి శపించండి ధూషించండి.గొంతెత్తి అరవండి
ఎవరు ఇందుకు కారణాలు ఎందుకు మాకు ఈ రోదనలు
వంటరి మా బ్రతుకులు ఎడారిలో మిగిలిన పూల మొక్కలు
మాకు ఎందుకు ఈ ఆకలి సంకెళ్ళు ఈ బ్రతుకుల తిప్పలు

అని నిగ్గదీసి అరవండి ..ఈ సమాజపు కళ్ళు తెరిపించండి
ఎందరో వొస్తారు ఎదో చేస్తామంటారు ..వొచ్చి వోదార్చి పోతారు
మా దైన్యాన్ని చూసి దేవునికే ,గుండె దిగ జారి పోతోంది
లేవుగా అందరి బాలల మాదిరి మాకు ఆనందక్షణాలు

బ్రతుకు విలువ పోగొట్టుకొన్న పూజకు నోచని పువ్వులు
మా దీన గాధలు దొరుకుతాయి ప్రతి సందులలో గొందులలో
మాకు ప్రసాదించిన ఇలాంటి జీవితాలకు సిగ్గుతో తలవంచండి
మా ధైర్యానికి ఈ సమాజమే తలదించాలి మాకు సలాము కొట్టాలి

మాకు లేవు బాలల దినోత్సవాలు పండగలు కేరింతల చప్పట్లు
మురిగిపోయిన పాడు జీవితాలు,స్వార్ధానికి మిగిలిన వ్యర్ధగుర్తులు
ఈ సమాజం మాకు పూసిన బూడిద బతుకులు చిదిమిన జీవితాలు
ఎప్పటికి మారెను మా తలరాతల ఎప్పుడు వెలుగును నవ్వుల దీపాలు

1 thought on “అభాగ్యపు బాలల జీవితాలు

Leave a Reply to Gauthami Jalagadugula Cancel reply

Your email address will not be published. Required fields are marked *