May 18, 2024

ఒక విధి వంచిత కధ

 రచన: ప్రియా

 

నా పరిస్థితి నన్ను నిలువునా దిక్కరిస్తోంది

నా అనుమతి లేకుండానే నన్ను వెక్కిరిస్తోంది

నా అసమర్ధతను నాకు ప్రతిక్షణం గుర్తుచేస్తోంది

నా దీన స్థితిని చూసి విధి కసిగా వెక్కిరిస్తోంది

నా బ్రతుకు ను తమాషా చేసి తెగ  పరిహసిస్తోంది

జీవన ప్రయాణంలో ఎన్నో బాధల సుడిగుండాలు

సంగర్షణవ్యధల  చితిమంటల  నరక యాతనలు

మానవసంబంధాల నటనల్లో ఎన్నో భూటకాలు

మానవత్వము సచ్చిన సమాజంలో పడిగాపులు

విసిరేసిన విస్తరాకులాంటి చీత్కారాల బతుకువెతలు

బాందవ్యాలు  కాదు వెనకనున్న”మనీ” షి పై ఆశలు

వెటకారాల విషమునిండిన  పగటి వేష పలకరింతలు

చింకి పోయిన చాప లాగ ఇలా ఇంకిపోయిన  నవనాడులు

ఎన్నని, యేమని చెప్పాలి ఈ మానవ నాటకాలు ఆనవాళ్ళు

వెన్నుపోటు కాదు ఎదురుపోటు పొడిచే మన సొంతవాళ్ళు

మానవత్వపు ముసుగు ధరించిన ఘోర మృగరాజులు

చిత్రమైన జీవితం కడకు ఛిద్రమైన మానవ అనుబంధాలు

మనో వైకల్యపు క్రూర ప్రవుర్తితో సంచరించే మానవ రాక్షసులు

లేదుకదా ఆడదానికి ఈ సమాజంలో అసలు విలువలు

అతివల మాన ప్రాణం దోచి వలువలు ఊడ్చే నరకాసురులు

పట్టపగలే స్త్రీకి బధ్రత లేని మదమెక్కిన నీచ కామకులు

ద్రుత రాష్ట్రుడిని మించిన కండకావరం పట్టిన ఖటినాత్ములు

ఇదే ఇప్పటి ప్రతి పడతి అనుభవిస్తున్న ముప్పతిప్పలు

రక్షణ లేని సమాజంలో లో అబలగా మిగిలిన అమాయకులు

దిక్కుతోచక బిక్కచచ్చిపోయి అలమటిస్తున్న అభాగ్యులు

రగులుతున్న గుండెలతో బ్రతుకులు ఈడుస్తున్న ఆడజన్మలు

రంగువెలసి కళతప్పి కటికచీకటి నిండిన అందమైన చందమామలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *