May 19, 2024

దృఢచిత్తులు ధీరవనితలు

రచన: ప్రియానాయుడు

 

 

అదిగో అల్లదిగో ఒక్కసారి అటు చూడండి

అహో జ్వలిత వనితలారా దిక్కులు పిక్కటిల్లేలా

ఫిరంగులు మారుమ్రోగేల కదం తొక్కుతున్నారా

యుద్ధభూమినందు శత్రుసైన్యాన్ని

గజ గజ వణికించే మహాయోధులారా

ఆడసైన్యము కాదు మీరు శత్రువులకు

చెమట పట్టించే అగ్నికణము మీరు

వీరనారి ఝాన్సిరాణి బిడ్డను నడుమున

కట్టి పోరాడిన పుణ్య భూమి మనది

మగవారికి తగుదీటుగా తరిమితరిమి కొట్టగల

ధైర్య సాహసాల ఆడపులులు మీరు

మాతృభూమి కొరకుతనవారందరినీ వొదిలి

మరణము సైతము త్రుణముగా ఎంచి

కఠిన సాధనాలతో సాహసవంతమైన

కఠోరనియమాలతో ప్రావీణ్యము పొంది

దేశ రక్షణే పరమావిధిగా…తమలపాకుల వంటి

చేతులను చురకత్తులుగా మార్చుకొని

మొండి ధైర్యముతో ధృడ నిశ్చయముతో

అడుగేసిన అసమాన ధీరవనితలారా!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *