May 21, 2024

“సమయమిదే”– గజల్

రచన:లయన్ విమల గుర్రాల

 

మంచుపూల వలపు కబురు

కరిగిపోయె సమయమిదే…

సూరీడూ నిప్పుటిల్లు

చేరబోయె సమయమిదే…

 

శిశిరానికి ముడుచుకున్న

తనూలతలు విరిసెనిపుడె

నవయుగాది తేజాలే

చెలగిపోయె సమయమిదే…

 

పాటలతో కోయిలమ్మ

సమరానికి సిద్ధమపుడె

నవరాగపు విందులకే

పిలుపుపోయె సమయమిదే…

 

భయపెట్టే బ్రతుకు జాడ

నవ్వుతుంది ఎపుడైనా

కలలజిలుగు వెలుగుతార

ఎదురుపోయె సమయమిదే…

 

రైతన్నల కన్నులలో వెలుగు

మొలక తొంగిచూచె

సందెలలో విమల వాణి

మురియబోయె సమయమిదే…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *