May 22, 2024

సమూహమే బలం

రచన: –  ధనలక్ష్మి సైదు

 

మనుస్మ్రుతి మనకొద్దు…

ఏకులం ఏ భాగాలా నుంచి

ఉద్భవించిందో అధి కూడా వద్దు ..

పెళ్ళిళ్ళకు,పూజలకు తప్ప

పట్టేడన్నం పెట్టని గో్త్రాలు వద్దు ..

కులకట్టడులను రాబడులుగా

మార్చుకున్న రాజకీయం వద్దు ..

అస్సలు సాటిమనిషిని గుర్తించని ఏమతం వద్దు ..

బ్రాహ్మణులు పూజలు మాత్రమేనంటే,

క్షత్రియులు రాజ్యాలే ఏలాలంటే ,

వైశ్యులు వ్యాపారమే చెయ్యాలంటే ,

శూద్రులు సేవలే చెయ్యాలంటే,

సమాజములొ స్తబ్దత ఎలా పోతుంది

ఇక సమసమాజం ఎలావస్తుంది .

సమభావము మాటేమిటి ….?

మనుషులలొ ముందడుగు ఉండాలి

నలుగురిని కలుపుకుపోయే తత్వం రావాలి

ఐదు వేళ్ళూ కలిస్తేనే ముద్ద నోటికి అందేది ..

అన్ని వర్ణాలు కలిస్తేనే ఇంద్రధనుస్సు

అందరు కలిసి ఉంటేనే మానవశ్రేయస్సు ..

సముహాలే బలమన్న విషయం జంతువులకే తెల్సు ..

ఇంగితం ఉన్న మనుషులం తెలుసుకొకపోతే ఎలా..

“కారం”చేడు లాంటి ఘటనలను

“వగరు”గా తగిలే కులకుమ్ములాటలను

పరజాతి నిందలను “ఉప్పు”పాతర వెయ్యాలి

సాటి మనిషి పట్ల కుల”పులుపు” లు వీడి

“చేదు”ని వదిలి “తీపి”ని ఆహ్వానించాలి

సౌభ్రాతృత్వాన్ని నిరుపించి చూపాలి .,,,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *