May 18, 2024

అమ్మమ్మ – 13

రచన: గిరిజ పీసపాటి వరలక్ష్మమ్మ గారు కోరినట్లే ఇల్లు వారికే అమ్మేసి, ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేసి, వారు కోరిన విధంగానే వారు తనకోసం కేటాయించిన గదిలో ఉండసాగింది అమ్మమ్మ. ఆ చిన్న గదిలోనే ఒక మూల వంట, మరోమూల పడక. ఆ మాత్రం నీడైనా దొరికినందుకు చాలా సంతోషించింది అమ్మమ్మ. వారు అంత అభిమానం చూపించడానికి ఒకప్పుడు అమ్మమ్మ, తాతయ్యలు చేసిన సహాయం ఒక కారణం అయితే, చిన్నప్పటి నుండి నాగను పెంచిన […]

అమ్మమ్మ – 12.

రచన: గిరిజ పీసపాటి స్పృహ తప్పిన తాతయ్యను అతి కష్టం మీద విజయవాడ నుండి టాక్సీలో తెనాలి తీసుకువచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉండడంతో ఒక్కసారిగా నిస్పృహగా అరుగు మీదే కూలబడిపోయారు పాతూరి రామకృష్ణ మూర్తి గారు. తరువాత తెలివి తెచ్చుకుని అమ్మమ్మ, నాగ ఎక్కడికి వెళ్ళారని ఆరా తీయగా ఊరిలోనే ఉంటున్న చుట్టాలింటికి వెళ్ళారని తెలిసి, పెద్దన్నయ్య ఆఫీసులో ఉండడంతో, వాళ్ళ అమ్మగారికి తాతయ్యను తను వచ్చేవరకు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, వేరేవాళ్ళని డాక్టర్ నమశ్శివయ్య […]

అమ్మమ్మ – 11

రచన: గిరిజ పీసపాటి దొంగవెల్లి సంబరానికి సిధ్ధం కమ్మని మగపెళ్ళివారి నుండి కబురు రాగానే అదేదో పేరంటం అనుకుని పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, అక్షింతలు మొదలైనవన్నీ సిధ్ధం చేసి, నాగను పల్లకిలో తీసుకెళ్ళి దొంగవెల్లి కార్యక్రమానికి తరలి రమ్మని ఆహ్వానించారు తెనాలి తాతయ్య అమ్మమ్మ. దొంగవెల్లి కార్యక్రమం అంటే పేరంటం కాదనీ, అదో వేడుక అనీ, అందుకు నాగ ఉండనవసరం లేదనీ, పెళ్ళికూతురి అన్నదమ్ముడు వుంటే చాలని చెప్పారు మగపెళ్ళివారు. నాగను తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోయి […]

అమ్మమ్మ – 10

రచన: గిరిజ పీసపాటి సంవత్సర కాలం గడిచింది. నాగ పరికిణీ, ఓణీల్లోకి ఎదిగింది. పెద్దబావ, చిన్నబావ వారి టెన్త్ క్లాస్ పూర్తి చేసుకుని రాముడువలస వెళ్ళిపోయారు. పెద్దబావ చదువులో పెద్దగా రాణించకపోవడం, ఏడ‌వ తరగతి చదువుతున్న సమయంలో ఇస్నోఫిలియా రావడంతో తన తమ్ముడితో కలిసి టెన్త్ క్లాస్ పూర్తి చేసాడు. రాముడువలస వెళ్ళాక ఇద్దరూ పియుసి చదవసాగారు. రెండు కుటుంబాల మధ్యా రాకపోకలు యధావిధిగా కొనసాగాయి. ఐదవ తరగతి వేసవి సెలవుల్లో ఒక్కసారి మాత్రమే రాముడువలస వెళ్ళిన […]

అమ్మమ్మ – 9

రచన: గిరిజ పీసపాటి తెనాలి తాతయ్య నాగ చదువుకోవడం కోసం చందమామ, బాలమిత్ర పుస్తకాలు ప్రతినెలా తెప్పించేవారు. నాగ స్కూల్ నుండి వచ్చేలోపు చిన్న బావ వాటిని నాగకు అందకుండా దాచేసేవాడు. అతను రెండు పుస్తకాలు పూర్తిగా చదివిన తరువాత కానీ తిరిగి నాగకు ఇచ్చేవాడు కాదు. ఈలోపు మళ్ళీ నెల తిరిగి వచ్చేసేది. దానితో కొత్తగా వచ్చిన వెంటనే పుస్తకాలు చదివే అలవాటున్న నాగ ఆ పుస్తకాల కోసం ఏడ్చేది. వెంటనే పెద్ద బావ నాగను […]

**** అమ్మమ్మ – 8 *****

రచన: గిరిజ పీసపాటి అమ్మమ్మ, తాతయ్య నాగను బజారుకి తీసుకెళ్ళి అప్పటికప్పుడు పట్టు లంగా, జాకెట్టు క్లాత్ తీసి టైలర్ కి గంటలో కుట్టి ఇమ్మని చెప్పి, అక్కడి నుండి బంగారం షాపుకి వెళ్ళి అనార్కలి మోడల్ నెక్లెస్, చెవులకు బెంగాలీ రింగులు, జడ గంటలు కొన్నారు. అప్పటి వరకు నాగకి చెవులు కూడా కుట్టించని కారణంగా అటునుంచి అటే కంసాలి వద్దకు వెళ్ళి చెవులు కుట్టించి, బెంగాలీ రింగులు పెట్టించారు. చెవులు కుట్టించాక ఆ నొప్పికి […]

అమ్మమ్మ – 7

రచన: గిరిజ పీసపాటి అన్నపూర్ణ శాస్త్రుల గారిని ఆశ్రయించిన అమ్మమ్మని వారు మెత్తగా చీవాట్లు పెట్టి ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాన్ని అక్షర లక్షలు జపించమనీ, ఎంత త్వరగా జపిస్తే అంత త్వరగా ఫలితం లభిస్తుందనీ, అలా జపించినట్లైతే సుబ్రహ్మణ్య స్వామి కంఠానికి కాటు ఇచ్చిన దానికి సమానమనీ చెప్పి పంపించారు. ఆ మంత్ర జపం త్వరగా పూర్తి చేయాలని, అహోరాత్రులు జపిస్తే కాని త్వరగా పూర్తవదని గ్రహించిన అమ్మమ్మ ఇంటికి రాగానే తాతయ్యకు, పెద్దన్నయ్యకి, […]

అమ్మమ్మ – 5

రచన: గిరిజ పీసపాటి నాగ తమ ఇంటిలో అద్దెకు ఉంటున్న వారి కుటుంబంలో వారి పాపలాగా కలిసిపోయింది. ఆ అద్దెకుంటున్న వారికి‌ ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు సంతానం. బొటాబొటీగా వచ్చే ఆదాయంలో గుట్టుగా బతుకుతున్న మంచి మనసున్న మనుషులు. వారి ఆఖరి అమ్మాయి నాగ కన్నా మూడు లేక నాలుగేళ్ళు పెద్ద ఉండొచ్చు. అందరికన్నా పెద్దబ్బాయికి వివాహం కూడా అయింది. ఆయన భార్య చాలా మంచి ఇల్లాలు. మగ పిల్లలందరినీ అన్నయ్యా అనీ, ఆడపిల్లలందరినీ అక్కయ్యా […]

అమ్మమ్మ – 4

రచన: గిరిజ పీసపాటి తన ఆస్తిని ఇంకమ్ టాక్స్ వారు సీజ్ చేసి, అందులో నుండి ఒక్క పైసా కూడా తను వినియోగించరాదనే ఉత్తర్వులు జారీ చెయ్యడంతో, ఏం చెయ్యాలో తెలియక వేదనకు లోనైన పీసపాటి తాతగారితో తెలిసిన వారు తెనాలి తాతయ్య పేరు చెప్పి, వారు పూనుకుంటే పని అవుతుందని చెప్పడంతో, పీసపాటి తాతయ్య తెనాలి తాతయ్యను కలిసి, విషయం చెప్పి ఎలాగైనా తనను ఈ సమస్య నుండి గట్టెక్కించమని కోరారు. తెనాలి తాతయ్య పీసపాటి […]

అమ్మమ్మ -3

రచన: గిరిజ పీసపాటి అన్నపూర్ణ శాస్త్రులు గారు చెప్పిన విధంగా సింహాచలం వరాహ నృసింహస్వామి సన్నిధిలో నలభై రోజుల పాటు సుందరకాండ ఒకరు పారాయణ చేస్తుండగా, ఇంటి దగ్గర పాలు ఇస్తున్న ఆవుకి, దాని దూడకి అమ్మమ్మ సేవ చెయ్యసాగారు. నలభై రోజుల పారాయణ, గో సేవ పూర్తయాక ఆ పుణ్యఫలాన్ని అన్నయ్యకి ధార పోసారు అమ్మమ్మ. తరువాత కొన్ని రోజులకే గవర్నమెంట్ రద్దు చేసిన సర్టిఫికెట్లు చెల్లుతాయని చెప్పి, తిరిగి ఇవ్వడమే కాకుండా ఆయనకి హెల్త్ […]