May 19, 2024

అమ్మమ్మ – 23

రచన: గిరిజ పీసపాటి ‘పున్నామ నరకం నుండి తప్పించేవాడు కొడుకు మాత్రమే’ అనుకునే రోజులవి. తనకు కొడుకు పుట్టినా దక్కలేదు. కనుక, వియ్యంకుడికైనా మనవడు పుడితే బాగుండునని అమ్మమ్మ ఆరాటం. అంతే తప్ప ఆడపిల్లల పట్ల చిన్నచూపు ఎంత మాత్రమూ కాదు. నాగ తోడికోడలికి కూతురు పుట్టిన ఏడు నెలలకు నాగ మళ్ళీ గర్భవతి అయిందని వియ్యంకుడి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అమ్మమ్మకి. మళ్ళీ అమ్మమ్మకి హడావుడి మొదలైంది. ఈసారి తొమ్మిదవ నెలలో రాముడువలస వెళ్ళి, […]

అమ్మమ్మ -22

రచన: గిరిజ పీసపాటి ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న అమ్మమ్మ ఎదురింటావిడ అడిగిన ప్రశ్నకు జవాబుగా “నాగకు సీమంతం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చానని, పువ్వులు, గాజులు మొదలగునవి తేవడానికి ఎవరికీ తీరుబాటు లేదంటున్నార”ని చెప్పింది. అందుకావిడ “ఈ మాత్రానికే దిగులు పడతారెందుకు అక్కయ్యగారూ! నాగను ఎప్పుడూ మా ఇంటి పెద్ద కూతురిలాగే భావిస్తాం. మా పిల్లలు కూడా నాగను సొంత తోబుట్టువులాగే చూస్తారు. కాకపోతే మీ మరిదిగారు బడిపంతులు కావడం, ఐదుగురు సంతానం […]

అమ్మమ్మ – 21

రచన: గిరిజ పీసపాటి తమ పక్కింటి వాళ్ళకు ఫోన్ ఉండడంతో, వాళ్ళ పర్మిషన్ తీసుకుని, తెలిసిన వాళ్ళకు వాళ్ళ నంబర్ ఇచ్చింది అమ్మమ్మ. కేవలం వంట పని ఉంటే తనకు చెప్పడానికి తప్ప ఇతర కారణాలకు ఆ నంబర్ కి ఫోన్ చెయ్యొద్దని అందరికీ మరీ మరీ చెప్పింది. దగ్గరలో ఉంటున్న భార్యాభర్తలను కూడా తనతో కలిసి వంట పనికి తీసుకెళ్ళసాగింది. పెద్ద పెద్ద గుండిగలతో అన్నం వార్చడం వంటి కొన్ని బరువు పనులకు అతన్ని వినియోగించసాగింది. […]

అమ్మమ్మ – 20

రచన: గిరిజ పీసపాటి తెనాలిలో పది రోజుల పాటు కష్టపడినా రాని సొమ్ము హైదరాబాదులో ఒక్కరోజు వంట చేస్తే వచ్చింది. అదే అమ్మమ్మకి చాలా అబ్బురంగా అనిపించింది. “రాజేశ్వరమ్మా! వాళ్ళు పొరపాటున ఎక్కువ ఇచ్చినట్లున్నారు. ఒక్కసారి ఫోన్ చేసి వాళ్ళకు ఎక్కువ ఇచ్చారని చెప్తాను” అన్న అమ్మమ్మను ఆపేసారు రాజేశ్వరమ్మ గారు. “ఈ ఊరిలో వంట చేసేవారు ముఖ్యంగా మన గుంటూరు వంట చేసే బ్రాహ్మణ స్త్రీలు దొరకడం కష్టం. అందుకే వాళ్ళు మీ పని మెచ్చుకుని […]

అమ్మమ్మ – 19

రచన: గిరిజ పీసపాటి అమ్మమ్మ, డా పురుషోత్తంగారు మాట్లాడుకుంటూ ఉండగానే కారు పురుషోత్తం గారి ఇంటికి చేరింది. ఆయన నేరుగా ఇంట్లోకి వెళిపోయినా, అమ్మమ్మ మాత్రం బయట కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని ఒకసారి లలితా పరమేశ్వకి మనసులోనే నమస్కరించుకుని, లోపలికి అడుగు పెట్టింది. రాజేశ్వరమ్మ గారు ఎదురు వచ్చి ఆప్యాయంగా పలకరించి, కాఫీ తెమ్మని వంట మనిషికి పురమాయించారు. కానీ అమ్మమ్మ ఆవిడను వారించి, స్నానం, జపం పూర్తి కానిదే తాగనని చెప్పి నేరుగా పెరట్లోకి […]

అమ్మమ్మ – 18

రచన: గిరిజ పీసపాటి డాక్టర్ రాజేశ్వరమ్మ గారి దగ్గర నుండి ఇంటికి వచ్చిన అమ్మమ్మ ఆలోచనలో పడిపోయింది. ‘తనమీద ఉన్న అభిమానం కొద్దీ రాజేశ్వరమ్మ గారు తనని హైదరాబాదు తీసుకెళ్తానన్నా అక్కడికెళ్లగానే ఆవిడకు తన విషయం ఏ గుర్తుంటుంది? ఒకవేళ ఉన్నా ఇది తెలిసిన ఊరు, ఎరిగిన మనుషులు కనుక పని ఇప్పించగలిగారు కానీ అక్కడ ఆవిడ తనకి పని ఎలా ఇప్పించగలరు? ఒకవేళ ఇప్పించినా ఆ మహానగరంలో ముక్కు మొహం తెలియని మనుషుల మధ్య ఒంటరిగా […]

అమ్మమ్మ – 17

రచన: గిరిజ పీసపాటి ఆ రోజు పెద్దవాళ్ళు బలవంతం చేస్తే తిన్న మూడు ఉండలే తప్ప మళ్ళీ ఆ కాయం తిననే లేదు నాగ. అత్తగారు తన చేతిలో తినమని వేసిన మూడు ఉండలూ పనిలో ఉన్నానని సాకు చెప్పి, పక్కన పెట్టి, తరువాత రహస్యంగా చిన్న చేతిలో పెట్టేసేది. చిన్న కూడా ఎలాగూ పెద్దవాళ్ళు అడిగితే ఇవ్వరని మహదానందంగా ఆ కాయపుండలను తినేసేది. నాగకు పసి పిల్లను సాకే వయసు లేకపోవడంతో పాప బాధ్యత అంతా […]

అమ్మమ్మ – 16

రచన: గిరిజ పీసపాటి నాగకు, పాపాయికి ఇరవై ఒకటవ రోజున పెద్ద పురిటి స్నానం చేయించారు. పిల్ల పుట్టిన ఇరవై నాలుగవ రోజు పీసపాటి తాతయ్య మక్కువ వచ్చి మర్నాడు మంచిరోజు కనుక, భార్యని, కోడలిని, మనుమరాలిని రాముడువలస తీసుకెళ్తానని, ఇన్నాళ్ళూ నాగను తమ ఇంట కన్న బిడ్డకన్నా ఎక్కువగా చూసుకుని పురుడు పోసినందుకు డాక్టర్ గారికి, వారి భార్యలిద్దరికీ కృతజ్ఞతలు తెలిపి, బారసాలకి తప్పకుండా రమ్మని ఆహ్వానించారు. మర్నాడు అంటే ఇరవై ఐదవ రోజున నాగను, […]

అమ్మమ్మ – 15

రచన: గిరిజ పీసపాటి పీసపాటి తాతయ్య దగ్గర నుండి అమ్మమ్మకు వచ్చిన ఉత్తరంలో ‘నాగకు కొంచెం ఆరోగ్యం క్షీణించిన కారణంగా నా స్నేహితుడైన డా. నౌడూరి శ్రీరామమూర్తి గారికి (మక్కువ అనే ఊరిలో వీరు ఉంటున్న కారణంగా అందరూ వీరిని మక్కువ డాక్టర్ గారు అంటారు) చూపించగా, చాలా చిన్న వయసులోనే గర్భవతి కావడం వలన రక్తహీనత బాగా ఉందనీ, మందులు రాసి ఇచ్చారని రాస్తూ…’ ‘డెలివరీ కష్టం కావచ్చు కనుక డెలివరీ సమయానికి ఏదైనా హాస్పిటల్ […]

అమ్మమ్మ – 14

రచన: గిరిజ పీసపాటి     “నేను ఈ రోజు రాత్రి ఈ గుడిలో నిద్ర చేయాలని వచ్చాను. రేపటికి ముప్పై రోజులు ఆయన నాకు దూరమై. త్వరలోనే నాగని చూడడానికి వెళ్ళాలి. ఎక్కడా నిద్ర చెయ్యకుండా వియ్యాలవారింటికి ఎలా వెళ్తాను? అందుకే మీరు దయతలచి ఈ ఒక్క రాత్రి నన్ను గుడిలో ఉండనిస్తే రేపు ఉదయం వెళ్ళిపోతాను. కాదనకండి బాబూ!” అని వేడుకుంది అమ్మమ్మ. అమ్మమ్మ మాటలకు చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ “మనుషులు ఆదరించకపోవడంతో భగవంతుని […]