June 19, 2024

నల్లమోతు శ్రీధర్ వీడియోలు – యోగా

ప్రముఖ కంప్యూటర్ మాసపత్రిక కంఫ్యూటర్ ఎరా సంపాదకులు సాంకేతిక సంబంధిత విషయాలమీద మాత్రమే వీడియోలు చేస్తారని అందరికీ తెలుసు కాని ఆరోగ్యానికి సంబంధించిన యోగా గురించి తయారు చేసిన వీడియోల గురించి తెలుసుకుందాం. ఆచరిద్దాంః

ప్రాణాయామం:

మన శారీరక, మానసిక సమస్యలకు ప్రాణాయామం ఎంత మంచిదో మీరే తెలుసుకోండి….  “మనం రోజూ గాలి పీల్చుకుంటూనే ఉంటాం… ప్రాణాయామంలోనూ అదే చెప్తారటగా.. ఇంకా కొత్తగా నేర్చుకునేదేముంది” అని లైట్‌గా మాట్లాడే జనాల్ని నేను ఎందర్నో చూశాను. మనం ప్రతీ క్షణం ఎదుర్కొనే అనేక శారీరక, మానసిక సమస్యలకు ప్రాణాయామం ఎంత అద్భుతమైన సొల్యూషనో ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకెప్పుడూ ప్రాణాయామాన్ని అంత కాజువల్ విషయంగా భావించలేరు. అలాగే ప్రాణాయామం చెయ్యకుండానూ ఉండలేరు… మీలో శారీరకంగానూ, మానసికంగానూ వచ్చే మార్పుని మీకు మీరే అనుభూతి చెందొచ్చు.

 

 

ప్రాణాయామం ముందు జాగింగ్:

ప్రాణాయామం ప్రారంభించే ముందు జాగింగ్ తప్పనిసరి!  అప్పటివరకూ అచేతనంగా ఉన్న కండరాలూ, శరీర భాగాలూ ఉత్తేజితం అవ్వాలంటే.. మనం ప్రాణాయామం ద్వారా శరీరంలోకి తీసుకునే ప్రాణశక్తి అన్నివైపులా సరిగ్గా చేరుకోవాలంటే ముందుగా మన బాడీని కొన్ని warm up ఎక్సర్‌సైజ్‌లతో రెడీ చేయాలి. ముఖ్యంగా ప్రాణాయామం breathingకి సంబంధించిన విషయం కావడం వల్ల జాగింగ్ ద్వారా ఊపిరి సక్రమంగా తీసుకోబడేలా సిద్ధపరచబడాలి.

ఈ వీడియోలో ప్రాణాయామానికి ముందు జాగింగ్ ఎలా చేయాలో ప్రాక్టికల్‌గా చూపించాను.

 

 

 

సర్వాంగాసనం:

ఎంత తక్కువ తిన్నా విపరీతంగా లావవుతున్నారా? కొంతమంది ఎంత తక్కువ తిన్నా ఎందుకు విపరీతంగా లావవుతారో అర్థం కాక తల బాదుకుంటారు.. మరికొంత మంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారు.. అలాగే కొంతమంది ఊరికే ఇన్‌ఫెక్షన్లకు గురవుతుంటారు, అలాగే అలసట కూడా! థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి… ఈ వీడియోలో నేను చూపిస్తున్న సర్వాంగాసనం ద్వారా థైరాయిడ్ సమస్యల్ని పూర్తిగా అధిగమించవచ్చు.
అలాగే ఈ ఆసనం బ్రెయిన్‌లోని CNS (సెంట్రల్ నెర్వస్ సిస్టమ్)ని ఉత్తేజితం చేస్తుంది, తద్వారా ఆలోచనలూ, శరీరంలోని ఇతర భాగాల పనితీరూ అద్భుతంగా ఉండేలా కాపాడుతుంది. ఈ ఆసనాన్ని ఎవరు వేయొచ్చు, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలన్నది ఈ వీడియోలో మీరే స్వయంగా చూడండి.

 

 

ముద్రా  ప్రాణాయామం:

మీకు back pain ఉందా? ఇతర అనేక సమస్యలకు ఈ ముద్రాప్రాణాయామాలు ఉపయోగపడతాయి..  శరీరంలో తరచూ సమస్యలకు గురయ్యే భాగాలకు ప్రాణశక్తిని ప్రసరింపజేయడం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు. ఈ వీడియోలో నేను చూపించిన చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, మేరుదండ ముద్ర అనే ప్రాణాయామాలు అనేక శారీరక సమస్యలకు పరిష్కారంగా ఉండడమే కాకుండా ఆయా భాగాలను పటిష్టంగా చేస్తాయి..

 

 

విభాగ  ప్రాణాయామం:

విభాగ ప్రాణాయామాలు ఇలా చేయాలి.. మన శరీరాన్ని మూడు భాగాలుగా విభజిస్తే శరీరం మొత్తాన్నీ దశలవారీగా ఉత్తేజపరుచుకోవడానికి విభాగ ప్రాణాయామాలు ఉపకరిస్తాయి. ఉదా.కు.. కనిష్ట విభాగ ప్రాణాయామం నడుము దగ్గర నుండి కాళ్ల వరకూ, మధ్యమ విభాగ ప్రాణాయామం పొట్ట ప్రదేశం నుండి ఛాతీ వరకూ, జ్యేష్ట విభాగ ప్రాణాయామం మెడ, తల వంటి పై భాగాలను ఉత్తేజం చేస్తుంది. ఈ మూడు రకాల ప్రాణాయామాలను ఎలా చేయాలన్నది ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో చూపించడం జరిగింది.

 

 

వజ్రాసనం:

ఆరోగ్యాన్ని అద్భుతంగా ఉంచే వజ్రాసనం ఇలా వేయాలి..  శరీరాన్ని ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంచే అద్భుతమైన ఆసనం ఏదైనా ఉందంటే అది వజ్రాసనమే. పేరుకి తగ్గట్లే అది శరీరాన్ని వజ్రంలా చేస్తుంది….మిగతా అన్ని ఆసనాలను ఎప్పుడు పడితే అప్పుడు వేయడం సరైనది కాదు. కానీ వజ్రాసనాన్ని 24 గంటల్లో ఎప్పుడైనా వేయొచ్చు.ఈ ఆసనంలో కూర్చుని పేపర్ చదువుకోవచ్చు, టివి చూడొచ్చు, పుస్తకాలు చదవొచ్చు… మెడిటేషన్ చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు….రోజుకి కనీసం ఓ అరగంట పాటైనా నేను ఈ ఆసనంలో కూర్చుంటాను..ఈ వజ్రాసనాన్ని ఎలా వేయాలి, దీని వల్ల ఆరోగ్యపరమైన ఉపయోగాలేమిటి.. అన్నది ఏమాత్రం యోగాపై అవగాహన లేని వారికి కూడా అర్థమయ్యేలా ఈ వీడియోలో చూపించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *