May 8, 2024

కడలి వదిలేసిన కెరటం

 

రచన: తిలక్ బొమ్మరాజు

 

పదాలను పేర్చనా

బాధలను కూర్చనా ఇప్పుడిక్కడ

 

నువ్వొదిలేసిన ఈ దేహాన్ని

ప్రేమించనా

నన్నుగా మిగిల్చిన

నీ జ్ఞాపకాలనా?

 

అప్పుడెప్పుడొ[ నా పక్కన

కూర్చున్నావు…

ఇప్పటికీ ఆ గుర్తులలానె` ఉన్నాయి

గుండె సంధుల్లో ఎవరొ[ అచ్చుపోసినట్టు

 

నీకే …

పున్నమిలో అడవి

నవ్వినట్టు ఉంటావు గోముగా

నేను మాత్రం ఒంటరిగానే మిగిలాను

రెక్కలు  తెగిన పక్షిలా

ఇంకా నీ ఊహలనే దిద్దుతూ

 

ఎన్నిసార్లు నువ్వున్నటుగా రమిస్తానొ లెక్కే లేదు…

 

ప్రతి రాత్రి ఎన్ని స్వప్నాలను

స్ఖలిస్తానో కన్నీళ్ళుగా

నిన్ను తలుచుకుంటూ

నాకింకా నీ పాదాల స్పర్శ గుర్తే

నాపై నడిచెళ్ళినట్టు

 

ఎక్కడో ఉంటావు

నన్ను మాత్రం పిలుస్తూనే

చలింపచేస్తావు

స్తంభించిన ఈ హ్రుదయంలో స్పందనవై…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *