ఆర్టిస్ట్: సువర్ణ భార్గవి
ముగ్గురు ఆడపిల్లలే, మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమో అని తల్లి ఆవేదనతో తల పట్టుకుంటే, బిడ్డ ఆ తల్లితో ఆడపిల్ల అనుకోవద్దు ఆడపిల్లే ఇంటికి ముద్దు అని చెపుతూ ఓదారుస్తున్న దృశ్యం…..
దుశ్శాసన పర్వంలోని సన్నివేశాన్ని తీసుకొని కృష్ణుడిలాగా పిల్ల తండ్రి తల తాకట్టు పెట్టి కూతురి కోసం వర కట్నం ఇస్తూనే పోతున్నాడు, వరుడేమో తాళి చేత పట్టుకొని డబ్బు పేర్చుకొంటూనే పోతున్నాడు.. మన వ్యవస్థ లో ఏమాత్రం మార్పు రాలేదు… ఇంకా అత్తగార్లు కోడళ్లని కాల్చటం, లేదా ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకోవటం చూస్తున్నాము… వరకట్న బాధల నుంచి ముక్తి లేదా?????????
అక్రమ సంబందాలు ఎంత హాని తలపెడతాయో ప్రజలకి తెలిపి, ఎయిడ్స్ నుండి విముక్తి పొందే విధంగా సంఘంలో మార్గనిర్దేశం సూచిస్తూ మార్పు రావాలని ఎయిడ్స్ బారిన పడకండి అని వేసిన చిత్రం..
“ప్రెగ్నెంట్ లేడీ విత్ ఫీటస్ ” విత్ స్కానింగ్ ఆడపిల్ల అని తెలుసుకోవటం భ్రూణ హత్యలు చేయటం మానండి అంటూ వేసిన చిత్రం ……….
good art. yes beti bachavo..desh ko bachavo !
అన్నీ పెయింటింగ్స్ చాలా బావున్నాయి భార్గవి గారు !!
Nice.. oil canvas paintings and Good captions,