April 26, 2024

ప్రేమ…

రచన: కృష్ణ అశోక్

ka1

నా మనో ప్రపంచం నుండి…

తవ్వుకో.. ఎంత తవ్వుకుంటావో
నీవెంత తవ్వినా దొరికేదేముంది!
వసంత రాత్రులు నీతో ముచ్చటించిన నా మధుర జ్ఞాపకాల గుర్తులు తప్ప!!

చేదుకో… ఇంకెంత చేదుకుంటావో
నువ్వెంత చేదినా వచ్చేదేముంది!
నీ హృదికై అర్పించిన నా మనో పుష్పపు గుత్తులు తప్ప!!

తోడుకో.. ఏమి తొడుకుంటావో,
నువ్వెంత తోడినా ఏమొస్తుందీ!
నింగీ నేల మధ్య నిశ్చలంగా నిలిచిన మన ప్రేమ శిలా ఫలకం తప్ప!!

వెతుక్కో… నాలో సర్వం వెతుక్కో,
ఎంత వెతికినా ఏమి దొరుకుతుంది!
దేహానికి అతీతంగా సిద్ధం చేసిన నా ఆత్మ జ్యోతి వెలుగు తప్ప!!

కలసిన మన ఆత్మల ఆలింగనపు ప్రకాశంలో సృష్టి సమస్తం ప్రజ్వరిల్లనీ…!!

ప్రేమతో….
నీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *