రచన: పారనంది శాంతకుమారి

ఓ మగవాడా…..ప్రేమకు పగవాడా!
అమ్మ ప్రేమతో,నాన్న జాలితో
వీచే గాలితో,పూచే పూలతో
అందాలతో,అనుబంధాలతో
ఆత్మీయతలతో,అమాయకత్వంతో
ఆడుకుంటావు
ఆస్తులతో,దోస్తులతో
అబద్ధాలతో,నిబద్ధాలతో
అంతరాత్మతో,పరమాత్మతో
అందరితో ఆడుకుంటావు.
అవకాశాలను వాడుకుంటావు,
అవసరమొస్తే వేడుకుంటావు
అది తీరాక ప్రాణాలనైనా తోడుకుంటావు
నీతిలేని రీతినీది,పాపభీతి లేని జాతి నీది
సిగ్గు లేని శాసనం నీది,స్థిరంలేని ఆసనం నీది
వగపెరుగని వ్యసనం నీది,వలపెరుగని హృదయం నీది.
ఎక్కివచ్చిన మెట్లను ఎగతాళి చేసే ఎడద నీది,
మెక్కివచ్చిన తిండిని ఎగాదిగాచూసే బెడద నీది,
అమ్మనైనా,అతివనైనా,ఆలినైనా
అవసరానికి వాడుకొనే బుద్ధి నీది.
ఆచారాన్నైనా,అపచారాన్నైనా, గ్రహచారాన్నైనా
నీకనుగుణంగా మార్చుకొనేఅప్పనపు సిద్ధి నీది.
వంకరగా పోయే వృద్ధి నీది.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వర్గాలు
భోషాణం
ఇటీవలి వ్యాఖ్యలు