రచన: వి.ఎన్.మంజుల

అవనిపై అడుగుడడానికి,
అమ్మ గర్భాన నవమాసాలూ ఓపికపట్టలేదా…

పుట్టిన నుండీ మాటలు పలికేదాకా,
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూడలేదా…

అక్షరాభ్యాసం నుండీ పట్టా పట్టేదాకా,
బ్రతుకు సమరానికి సిధ్ధం కాలేదా…

సంవత్సరం తరువాత వచ్చే పరీక్షా ఫలితాలకై,
వందల రోజులు ఆసక్తిగా ఆగడంలేదా…

కన్నకలల సాకారం కోసం,
జీవితకాలం ప్రయత్నం చేయటంలేదా…

బంధాలు ముడిపడి బాధ్యతలు పెరిగినా,
చివరికంటా ఓపికగా మోయడంలేదా…

విత్తునాటి, పంట చేతికొచ్చేదాకా,
నెలలకొద్దీ ఆశగా వేచిచూడటంలేదా…

సాధన చేసిన రంగంలో విజయపతాకానికై,
సంవత్సరాలతరబడి కలలుకనడంలేదా…

సరిహద్దున కాపుకాసి శత్రు సమరానికి,
ప్రతిక్షణం మెలకువతో గడపటంలేదా…

రేపటి భానోదయ తేజస్సుకై,
రాత్రంతా ఆత్రంగా వేచిఉండటంలేదా…

ఉపచారాలతో భగవంతుని కృపకై,
ఆఖరిక్షణం దాకా ఆర్తితో వేడడంలేదా…

ఇదేళ్ళకోసారి వచ్చే ఎన్నికల హంగామాకి,
ఈక్షణం నుండే సన్నద్ధంకావడంలేదా…

వచ్చే కాత్త సంవత్సర సంబరానికై,
ఈ ఉగాదినాడే ఆలోచించడంలేదా..

నిర్భయంగా నిదురించే రోజుకోసం…
నియంత్రణతో ఈరోజు కట్టుబడి ఉండలేమా…

వీటన్నిటితో పోలిస్తే…
మహమ్మారి నిర్మూలనకి..
కొన్ని గంటలు.. కొద్ది రోజులు..
మరిన్ని నెలలు స్వీయ నిర్భంధంకాలేమా…

స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి..
మనవంతు సహకారం అందించలేమా…

By Editor

22 thoughts on “ఎదురుచూపు….”
 1. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈసమయంలో
  ” నిర్భయంగా నిదురించే రోజుకోసం…
  నియంత్రణతో ఈరోజు కట్టుబడి ఉండలేమా…”
  నీవు వ్రాసిన విత్తు. సాధన బందాలు కన్న కులాల
  చిన్న చిన్న పదాలతో అర్థవంతంగా వివరించారవు
  అభినందనీయం

 2. Madam, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా చాలా చక్కగా వివరించారు. మీకు మా అభినందనలు.

 3. Madam,
  కవిత చాలా బాగుంది,
  ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా చాలా చక్కగా వివరించారు. మీకు మా అభినందనలు.

 4. కవిత చాలా బాగుంది మంజుల గారు
  మీకు మా అభినందనలు

 5. Chala Chala bagundi manju nee kavitha
  ila enno marenno kavithalu vrayalani korukuntunnanu manju

 6. మంజుల గారి కవిత ఎదురు చూపులు చాలా బాగుంది. సమయానుకలంగా కరెక్ట్ గా వ్రాశారు. మనమందరం కారోన మహమ్మారి పోవటానికి ఎదురు చూద్దాము. ధన్యవాదములు మంజుల గారు.

 7. Chala bagundhi, nijjamgha ippudu ee. Parishithiki illanti urata kavali, prajalu opika pattali

 8. జీవితంలో మనిషి ఎదురుచూపులకి ఇంకోటి చేరింది. అంతేగా..అంతేగా..

 9. కవిత చాలా బాగుంది మంజుల..
  ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా చాలా చక్కగా వివరించారు కవితలో ‌..

 10. మంజులగారి కవిత “ఎదురుచూపు” చాలాబాగుంది. జీవితంలో ఎన్ని ఎదురు చూపులో పూసగుచ్చినట్టు కవితా రూపంలో అందించారు. అభినందనీయం. అన్ని ఎదురుచూపులలో ఇప్పటి ఎదురు చూపుకూడా సమంజసం. మన కోసం, సమాజ మంచి కోసం ఎదురుచూడడమన్నది మన బాగుకోసమే అని అందరూ తెలుసుకోగలిగిననాడు ఇలాంటి కవితలకు సార్ధకత చేకూరుతుంది.

 11. […] 1. అర్చన కథల పోటి – దీర్ఘ సుమంగళీ భవ! 2. అర్చన కథల పోటి – వాళ్ళూ మనుషులే 3. అర్చన కథల పోటి – సెలెబ్రిటి 4. అర్చన కథల పోటి – నేనూను 5. అర్చన కథల పోటి – పథకం 6. అర్చన కథల పోటి – రక్షణ కవచం 7. అర్చన కథల పోటి – మార్పు 8. చంద్రోదయం – 3 9. రాజీపడిన బంధం – 5 10. జలజాక్షి.. మధుమే( మో) హం 11. అమ్మమ్మ – 13 12. అమ్మ ప్రేమించింది.. 13. పిల్లల మనసు 14. ఎందుకోసం?. 15. కంభంపాటి కథలు – మాటరాని మౌనమిది 16. సౌందర్య భారతం 17. భిన్న ధృవాలు 18. తపస్సు – అరాచక స్వగతం ఒకటి 19. అక్షరాలే ఊపిరిగా రూపుదిద్దుకున్న కవితాస్ఫూర్తి 20. శృంగేరి 21. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 47 22. జ్ఞానజ్యోతి శ్రీమతి సూరి నాగమ్మ గారు 23. కార్టూన్స్ – జెఎన్నెమ్ 24. గోదావరి అలలలో అమ్మపిలుపు వినిపిస్తోంది 25. కంచి కామాక్షి 26. కవి పరిచయం.. 27. ఎదురుచూపు…. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *